trinayani serial today Episode: అమ్మా విశాలాక్షి నువ్వు చెప్పమ్మా నయని ఎందుకిలా చేస్తుందని విశాల్ అడుగుతాడు. దీంతో త్రినేత్రిగా ఉండటానికి మహంకాళి అమ్మవారు. నయనిగా ఉండటానికి విశాలాక్షి అమ్మవారు కారణం నాన్నా అంటుంది విశాలాక్షి. అమ్మవారు కారణమా అంటాడు విశాల్. దీంతో అవునని విశాలాక్షి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ఎవ్వరికీ అర్థం కావడం లేదని హాసిని అంటుంది. విశాలాక్షి చెప్పింది నిజమే అక్కా అంటుంది నయని. దీంతో ఆ నిజం ఏంటో చెప్పు అంటూ తిలొత్తమ్మ అడగ్గానే.. ఆ నిజం నేను చెప్పలేను అత్తయ్యా అంటుంది నయని. ఇంతలో అందరి చేతుల్లోని చీటీలను తిలొత్తమ్మ తీసుకుని చింపేస్తుంది.
అత్తయ్యా వద్దని నయని వారిస్తున్నా… వినదు. ఏం చేసినా సరే వాటికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోండి అని నాన్నా వెళ్లొస్తాను అని విశాలాక్షి వెళ్లిపోతుంటే.. నయని.. నేత్రిలా మారిపోయి అమ్మా మహంకాళి అని పిలుస్తుంది. తన దారిని తనని పోనివ్వు నయని అంటుంది తిలొత్తమ్మ. నయనిని కాదు త్రినేత్రిని అంటుంది నేత్రి. దీంతో అర్థం అయింది చెల్లి నువ్వు నయనిగా కేవలం మూడు గంటలు మాత్రమే ఉంటావు. కానీ ఎప్పుడు ఉంటావో తెలియదు. అది కనిపెట్టాలి అని మనసులో అనుకుంటుంది హాసిని.
నువ్వు త్రినేత్రివి అయితే గారడి పిల్ల మహంకాళి.. ఇద్దరూ పేర్లు మార్చుకుని మమ్మల్ని వెర్రి వాళ్లను చేస్తున్నారు అని వల్లభ అంటే మహంకాళి వెళ్లకుండా ఆపరా..? అంటుంది తిలొత్తమ్మ. ఇదీ కరెక్టు అని వల్లభ వెళ్లి విశాలాక్షిని ఆపబోతుంటే.. నేత్రి పరుగెత్తుకొచ్చి వల్లభను తోసేసి మహంకాళి అమ్మమీద చెయ్యి వేసే మగాడు ఇంకా పుట్టలేదు పుట్టడు అంటూ నువ్వు క్షేమంగా వెళ్లిరా అమ్మా అని చెప్తుంది నేత్రి. ఈసారి నా దగ్గరకు నువ్వే రావాలి అమ్మా.. నిన్ను ఇలా చేసిన వాళ్ల సంగతి చూడాలి కదా..? అని చెప్తూ వెళ్లిపోతుంది విశాలాక్షి. మా అక్కను ఏం చేశారు అని అనుమానిస్తుంది సుమన. నయనికి ఇలా అవ్వడానికి ఎవరైనా కారణం అయ్యి ఉంటారా..? అని విశాల్ అంటాడు. వాళ్లు ఎవరో తెలుసుకోవచ్చని విశాలాక్షి చెప్పింది కదా బ్రో అంటాడు
గాయత్రి పాపను ఎత్తుకుని పని చేస్తున్న నయని దగ్గరకు విశాల్ వచ్చి నయని అని పిలుస్తాడు. కానీ నయని పలకదు. నేత్రి అని పిలవగానే నయని తిరిగి చూస్తుంది. ఎందుకు అలా పిలిచారని అడుగుతుంది. నువ్వు నయని అంటే పలకలేదని అందుకే నేత్రి అన్నాను అంటాడు. అది సరే నువ్వు త్రినేత్రిగా ఉండటానికి మహంకాళి అమ్మవారు కారణం అన్నది ఎందుకు అని అడుగుతాడు విశాల్. అలాగే త్రినేత్రి.. త్రినయని వేరు వేరు అని నాకు అనిపిస్తుంది అంటాడు విశాల్. ఈసారి నువ్వే నా దగ్గరుక రావాలని విశాలాక్షి నీకు చెప్పింది. అసలు ఎక్కడికి రమ్మని చెప్పింది అని విశాల్ అడుగుతాడు. అమ్మ దగ్గరకు రమ్మని చెప్పిందేమో అంటుంది నయని. ఏ అమ్మ దగ్గరకు రమ్మని చెప్పింది అని విశాల్ అడగ్గానే అది గుర్తు లేదని చెప్తుంది నయని.
ఏవో పేపర్స్ తీసుకుని చదువుతుంది సుమన. ఇంతలో విక్రాంత్ వచ్చి చిత్తు కాగితాలు చదువుతున్నావేంటి సుమన అని అడుగుతాడు. ఇవి చిత్తు కాగితాలు కాదని బిల్స్ అని మా అక్క నగలు, డబ్బు ఎక్కడైనా దాచిపెట్టి వాటి గురించి చీటీల్లో రాసి పెట్టిందేమోనని వెతుకుతున్నాను అంటుంది. దీంతో విక్రాంత్ తిడతాడు. నీకు ఎప్పుడు ఇలాంటి పాడు బుద్దులేనా..? నలుగురు మెచ్చుకునే పనులు చేయాలనే బుద్ది ఉండదా..? అంటాడు. అలా అనుకుంటారేంటి… ఏదైనా చీటీలో సుమన సుఖపడాలని రాసిందేమో అంటుంది. ఆలా రాయాలంటే బెత్తడంత పేపర్ లో రాయరు మూరెడంత బాండు పేపర్ లో రాస్తారు అంటాడు విక్రాంత్.
నయని యాక్సిడెంట్ కేసు ఎంక్వైరీ చేస్తున్న ఎస్పై చంద్రశేఖర్ వస్తాడు. ఎందుకొచ్చావని తిలొత్తమ్మ అడిగితే మీ చిన్నాబ్బాయి ఇచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడటానికి వచ్చాను అంటాడు. దీంతో వల్లభ భయంతో మమ్మీ చూశావా..? నీ చిన్నకొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడంట అంటాడు. దీంతో తిలొత్తమ్మ కోపంగా వల్లభను తిడుతుంది. ఏంటో చెప్పండి అని తిలొత్తమ్మ అడగ్గానే కావాల్సిన వాళ్లు రాగానే చెప్తాను అంటాడు.
ఇంతలో నేత్రి వస్తుంది. చంద్రశేఖర్ గారు నీకోసమే వచ్చారంట చెల్లి అని సుమన చెప్పగానే ఆయన ఎవరు? అని అడుగుతుంది నేత్రి. ఎస్సై చంద్రశేఖర్ వచ్చారు నయని అని విశాల్ చెప్పగానే నేత్రి నమస్కారం పెట్టి.. మీకు బాగా పరిచయస్థులా బాబుగారు అని అడుగుతుంది నేత్రి. దీంతో అందరూ నేత్రి ఒకసారి ఒకలా.. మరోసారి మరోలా ఉంటుందని చెప్తారు. ఇంతలో ఎస్సై త్రినేత్రి అని పేరు పెట్టి పిలవగానే.. అందరూ షాక్ అవుతారు. తను నయని కాదు దేవీపురం త్రినేత్రి మాత్రమే అని చెప్తాడు ఎస్సై. అందరూ షాక్ అవుతారు. ఇంతటితో త్రినయని సీరియల్ నేటి ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?