Nindu Noorella Saavasam Serial Today Episode : అమ్ము ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి రేపు మేము ఎక్స్‌కర్షన్‌కు వస్తున్నాము అని చెప్తుంది. దీంతో ప్రిన్సిపాల్ షాక్ అవుతుంది. ఇప్పుడు ఎలా వస్తారు అని నిలదీస్తుంది. ఇప్పటికే బంటి అన్ని ఏర్పాట్లు చేశాడని అంటుంది. దీంతో అమ్ము… బంటి ఏ ఏర్పాట్లు చేయలేదని అన్ని నేనే ఫాలో అప్ చేశానని చెప్తుంది. దీంతో ప్రిన్సిపాల్ సరే అని చెప్తుంది. కానీ మీ ముగ్గురు మాత్రమే రావాలని అంజలి రావొద్దని ప్రిన్సిపాల్ చెప్పగానే ముగ్గురు హ్యాపీగా ఫీలవుతారు. అంజలి బాధపడుతుంది. మీతో పాటు నేను ఇంత కష్టపడితే నన్నే రాకుండా చేస్తారా..? అంటూ అంజు బాధపడుతుంది. నిన్ను కూడా నేను ఎలాగైనా ఎక్స్ కర్షన్‌కు పంపిస్తానని మనోహరి చెప్తుంది. అంజు కూడా హ్యాపీగా ఫీలవుతుంది.
అరవింద్ ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉండగా అనుచరుడుతు వచ్చి అన్నా ఇప్పుడే స్కూల్ నుంచి సమాచారం వచ్చింది. రేపు ఎక్స్ కర్షన్‌కు అమరేంద్ర పిల్లలు కూడా వెళ్తున్నారట అని చెప్తాడు. దీంతో అరవింద్.. హ్యాపీగా అమర్ నా ట్రాప్‌లో పడ్డాడురా..? పిల్లలు స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యాక 50 కిలోమీటర్లు హైవేలో వెళ్తారు. ఆ తర్వాత లెఫ్ట్ తీసుకుని 20 కిలోమీటర్ల తర్వాత ఫారెస్ట్ చెక్ ఫోస్ట్ దాటుకుని ఫారెస్ట్ లోకి వెళ్తారు అని అరవింద్ చెప్పగానే అయితే బస్సును మన వాళ్లతో మన రూట్‌లోకి వెళ్లేలా చేద్దాం అన్నా.. కానీ అమరేంద్ర ఆఫీసర్లను పెట్టి ఉంటాడు అన్న. అవును అమరేంద్ర ఆలోచించి ఉంటాడు. కానీ పిల్లల్ని కిడ్నాప్ చేయకపోతే ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. బస్సు ఫారెస్ట్ లోకి వెళ్లాలి. బస్సులో జరిగే ప్రతి విషయం మనకు తెలియాలి. అంటే నేను ఆ బస్సులో ఉండాలి అంటాడు అరవింద్.
ఆరు గుమ్మం దగ్గర నిలబడి ఇంట్లోంకి తొంగి చూస్తుంది. మిస్సమ్మ ఎక్కడకు వెళ్లింది అని ఆలోచిస్తుంది. ఇంతలో గుప్త వచ్చి ఇక్కడ ఏమీ చేయుచున్నావు అని అడుగుతాడు. పొద్దుట్నుంచి మిస్సమ్మ బయటకు రాలేదని అందుకే చూస్తున్నాను అంటుంది. ఇంతలో ఎవ్వరూ కనిపించడం లేదని గుప్తను మీ వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదని తిడుతుంది. పిల్లలు లోపల ఎక్స్ కర్షన్ కు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. మిస్సమ్మ హెల్ప్ చేస్తుంది. ఇంతలో అంజు ఏం చేస్తున్నావు మిస్సమ్మ.. నిన్నంతా వద్దన్నావు ఇవాళ హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తున్నావు అంటుంది.
దీంతో నన్ను అడిగితే వద్దనే చెప్తాను. కానీ మీరు వెళ్లాక ఇబ్బంది పడకూడదని హెల్ప్ చేస్తున్నాను అంటుంది మిస్సమ్మ. ఇంతలో అక్కడికి వచ్చిన మనోహరి పిల్లల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు. నువ్వు కనిపిస్తేనే పిల్లలకు నచ్చడం లేదు అంటుంది. మరీ ఫేస్ చూస్తేనే కోపం వచ్చేంత కోపం లేదులే ఆంటి అంటుంది అంజు. మీకు దాని మీద పీకల దాకా కోపం రావాలంటే ఇంకా ఏం చేయాలే అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఇంతలో అంజు ఎక్స్ కర్షన్‌కు వాళ్లు ముగ్గురు వెళ్తుంటే నువ్వెందుకు సర్దుకున్నావు అని అడుగుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు మిస్సమ్మ అంటూ మిస్సమ్మను అక్కడి నుంచి పంపిచేస్తుంది మనోహరి. మిస్సమ్మ వెళ్లిపోతుంది.
తర్వాత పిల్లలను తీసుకుని కిందకు వచ్చిన మనోహరి. అమర్ పిల్లలను బస్సు దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తుంటే.. నువ్వెందుకు వాళ్లను నేను తీసుకెళ్తాను అంటుంది మనోహరి. ఇంతలో శివరాం.. మిస్సమ్మ వెళితే బాగుంటుంది అంటాడు. నిర్మల కూడా నువ్వు వెళ్లొచ్చు కదా..? మిస్సమ్మ అంటే.. అంజు పర్వాలేదు డాడ్ మీరే రండి అంటుంది. సరేనని అమర్ పిల్లలను తీసుకుని వెళ్తాడు.
బస్సు డ్రైవర్ ను కిడ్నాప్ చేసిన అరవింద్ తన మనిషిని బస్సు డ్రైవర్‌గా పంపిస్తాడు. అరవింద్ మనిషి ట్రావెల్ ఓనర్ దగ్గరకు వెళ్లి అదే ఎక్స్ కర్షన్ కు వెళ్లే బస్సు నడపడానికి వచ్చానని చెప్తాడు. ఆనంద్ రాలేదా అని ఓనరు అడిగితే హెల్త్ బాగాలేదని నన్ను పంపించాడు అని చెప్తాడు. ఓనరు అనంద్‌కు ఫోన్ చేస్తే.. పక్కనే ఉన్న అరవింద్ గన్ పెట్టి ఉంటాడు. భయంతో నాకు హెల్త్ బాగాలేక మావాణ్ని పంపించాను అని చెప్తాడు. సరేనని బస్సు తాళాలు ఇస్తాడు ఓనరు.
కూరగాయలు కట్ చేస్తున్న మిస్సమ్మ పిల్లల గురించి ఆలోచిస్తుంది. పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని బాధపడుతుంది. నిర్మల వచ్చి పిలిచినా పలకదు. గట్టిగా పిలవగానే.. ఉలిక్కిపడుతుంది మిస్సమ్మ.. ఎందుకు అలా ఉన్నావని నిర్మల అడగ్గానే పిల్లలను ఎక్స్ కర్షన్ కు పంపించడం నాకెందుకో నచ్చడం లేదని చెప్తుంది మిస్సమ్మ. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?