trinayani serial today Episode: ఆత్మను చూశాను అంటున్నాడు మీకు కనిపించడం లేదా అత్తయ్యా ఆత్మ అని సుమన, తిలొత్తమ్మను అడుగుతుంది. ఓరేయ్ చచ్చినోడా నువ్వు ఎక్కడ చూశావురా ఆత్మను అంటూ తిడుతుంది రత్నాంభ. ఇదిగో ఇక్కడే అంటూ నయనిని చూపిస్తాడు ఆత్మలింగం. దీంతో అందరూ షాక్ అవుతారు. నువ్వు పైన ఉన్న దేహాన్ని చూశావని నాకు అర్తం అయింది అని మనసులో అనుకుంటుంది నయని.
నయనిని చూసి ఆత్మలింగ భయపడుతూ నన్నేం చేయోద్దు దగ్గరకు రావొద్దు అంటూ వేడుకుంటాడు. మా దగ్గర నొక్కేసిన డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని ఈ నాటకాలు ఆడుతున్నావా..? అంటూ తిలొత్తమ్మ తిడుతుంది. కావాలంటే మీరిచ్చిన రెండు లక్షలకు మరో 50వేలు ఇస్తాను నన్ను మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోనివ్వండి అంటాడు. సరే ఇలా వెళ్లు అంటాడు విక్రాంత్. ఆత్మలింగం పారిపోతూ అమ్మలు, అక్కలు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ పారిపోతాడు ఆత్మలింగం.
రాత్రికి వల్లభ భయంలో అటూ ఇటూ తిరుగుతూ చీకటి పడిపోయింది ఎవరూ రారేంటి అంటూ భయపడుతుంటే.. ఇంతలో సుమన వచ్చి ఏమైంది బావగారు అని పిలుస్తుంది. వల్లభ భయపడతాడు. ఏమైంది పెద్దబావగారు అంటుంది ఏం లేదు కానీ ఆత్మలింగం ఈ ఇంట్లో ఆత్మ ఉందని చెప్పాడు కదా అందుకే భయంగా ఉంది అంటాడు విక్రాంత్.
కానీ మనం ఆలోచిస్తే అందు చిక్కదు తెలుసుకోవాలి అంటుంది తిలొత్తమ్మ. ఎలా తెలుసుకోవాలి మమ్మీ అని వల్లభ అడగ్గానే.. పెద్దలను అడగాలి అంటుంది తిలొత్తమ్మ.. నువ్వు ఎప్పుడో పెద్దమనిషివి అయ్యావు కదా మమ్మీ అంటాడు వల్లభ. ఏం మాట్లాడుతున్నావు బావగారు అంటుంది సుమన. తిక్కలోడు ఎలా మాట్లాడాలో వాడికి తెలియదు అంటూ నేను కలవాలనుకుంటుంది అఖండ స్వాముల వారిని అని చెప్తుంది. త్వరగా కలిసి తెలుసుకోండి అత్తయ్యా అంటూ చెప్తుంది సుమన.
రత్నాంభ ఏడుస్తుంటే.. విక్రాంత్ ఓదారుస్తుంటాడు. మీరు పెద్ద వాళ్లు మీరే ఏడిస్తే ఎలా అంటాడు. నేను మనిషిని కానా.. నాకు కన్నీళ్లు రావా అంటుంది. ఇంతలో హాసిని వచ్చి ఏంటి బామ్మ ఏడుస్తున్నారు. ఏంటి విక్రాంత్ బామ్మను ఏడిపిస్తున్నావు అంటూ అడుగుతుంది. నయని వచ్చి విక్రాంత్ బాబు ఎందుకు ఏడిపిస్తాడు అంటూ ఇంతకీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బామ్మ అని అడుగుతుంది.
దీంతో నా మనవరాలు కోసం ఏడుస్తున్నాను తను చనిపోయింది కదా..? అంటుంది. తను చనిపోయిందని నీకు ఎవరు చెప్పారు అని హాసిని అడగ్గానే.. ఆ గాదే లింగం గాడు చెప్పాడు కదా..? అంటుంది. చెల్లి, త్రినేత్రి ఒకేలాగా ఉండటంతో మీరు ఎక్కువగా ఊహించుకున్నారు. మీరు ధైర్యంగా ఉండండి త్రినేత్రి మీ దగ్గరకు అతి త్వరలో వస్తుంది అంటూ విక్రాంత్ ఓదారుస్తాడు.
హాల్లో కూర్చుని హాసిని లిస్ట్ చెప్తుంటే.. విక్రాంత్ రాస్తుంటాడు. ఇక వంటకు ఏమేం కావాలో చెప్పు వదిన అని విక్రాంత్ అడగ్గానే..దానికి నయని చెల్లి ఉందిగా తను చూసుకుంటుంది అని హాసిని చెప్పగానే.. వదినకు ఈసారి రెస్ట్ ఇద్దాం వదిన అంటాడు విక్రాంత్. మా అక్కకు కిచెన్‌లో పనులు చేయడంలోనే రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటూ సుమన వస్తుంది. అవునని చెప్తూ నయని వస్తుంది. ఇంతలో మ్యాజిక్ మిర్రర్ తీసుకుని వల్లభ, తిలొత్తమ్మ వస్తారు.
అందులో స్పెషల్ ఏముందని హాసిని అడుగుతుంది. అన్ని తమాషా మాటలు వదిన మీరు నమ్మకండి అంటాడు వల్లభ. అరేయ్ విక్రాంత్ నువ్వు నమ్మడం లేదు కదా నువ్వే ఓపెన్ చేసి చూడు అని చెప్పగానే.. సరే అని విక్రాంత్ తీసుకుని ఓపెన్ చేస్తుంటాడు. ఇంతలో గాయత్రి పాప వచ్చి అమ్మా అంటూ పిలుస్తుంది. ఒక్క నిమిషం పాప వెళ్దాం అని చెప్తుంది నయని. తిలొత్తమ్మ కూడా మ్యాజిక్ చూసి వెళ్లండి అంటుంది. విక్రాంత్ మిర్రర్ చూసి మ్యాజిక్ లేదు బొంగు లేదు అంటాడు.
హాసిని తీసుకుని చూసి తిడుతుంది. మ్యాజికేం లేదా..? అని నయని అడుగుతుంది. ఏమీ కనిపించడం లేదని హాసిని చెప్తుంది. గాయత్రి పాప వాటర్ కావాలని అడుగుతుంటే ఒక్క నిమిషం పాప అంటూ నయని మిర్రర్ తీసుకుని చూడగా అందులో త్రినేత్రి కనిపిస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. అకండ స్వామి చెప్పిన మాటలు గుర్తు చేస్తాడు వల్లభ. అద్దంలో ఎవరికేతే వేరే వాళ్ల ముఖం కనిపిస్తుందో వాళ్లలో ఆత్మ దూరిందని అర్తం అని చెప్పాడు అని వల్లభ చెప్తాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?