BigTV English

Trinayani Serial Today November 20th: ‘త్రినయని’ సీరియల్‌: నేత్రిలా మారిపోయిన నయని – నేత్రిని చంపేద్దామన్న తిలొత్తమ్మ  

Trinayani Serial Today November 20th: ‘త్రినయని’ సీరియల్‌: నేత్రిలా మారిపోయిన నయని – నేత్రిని చంపేద్దామన్న తిలొత్తమ్మ  

trinayani serial today Episode: హాస్పిటల్‌ కు వెళ్లి డాక్టర్‌ సారికను కలవాలని ఆమె ఎక్కడున్నారని నర్సును అడుగుతాడు విక్రాంత్. సారిక మేడం నిన్న హార్ట్‌ అటాక్‌ తో చనిపోయారని నర్సు చెప్తుంది. దీంతో విక్రాంత్‌ షాక్‌ అవుతాడు. అయితే కోమాలో ఉన్న మా వదినను హాస్పిటల్‌ చేంజ్ చేస్తానని చెప్పారు కదా ఏ హాస్పిటల్‌ కు చేంజ్‌ చేశారని నర్సును విక్రాంత్‌ అడగ్గానే చెప్పారు కానీ హాస్పిటల్ ఏదో మాకు తెలియదని నర్సు చెప్తుంది. దీంతో విక్రాంత్‌ మరింత టెన్షన్‌ పడుతుంటాడు. అసలు మా వదినను ఎక్కడికి తీసుకెళ్లారు. ఇంటికి వచ్చింది ఎవరు..? నిజంగానే గాయాలు నయం అయి వచ్చిందా..? లేక మతిస్థిమితం కోల్పోయి అలా ప్రవర్తిస్తుందా..? అంటూ విక్రాంత్‌ తల పట్టుకుంటాడు.


నయని ఇల్లంతా సర్దుతుంది. అది చూసిన ఇంట్లో వాల్లు షాక్‌ అవుతారు. విశాల్‌ రాగానే తిలొత్తమ్మ నీ  నీ భార్య అని నవ్వు ఏం పట్టించుకోవడం లేదు కానీ మాకు మాత్రం తను నయని కాదేమోనని అనుమానంగా ఉందంటుంది. దీంతో సుమన ఊరుకోండి అత్తయ్య అసలే మా అక్క తలకి  గాయం అయి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది. మీరన్నది వింటే కరిచినా కరిచేస్తుంది అంటుంది. వల్లభ కూడా అవును  మమ్మీ నిన్నటి నుంచి చూస్తున్నాం కదా ఒక్కర్తే మాట్లాడుకుంటుంది అంటాడు.

ఇంతలో హాసిని వచ్చి చెల్లికి కాదు మీకు పిచ్చి పట్టినట్టు ఉంది. ఇంటి ఇళ్లాలు తన పని తాను చేసుకుంటే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తుంది. ఇంతలో విక్రాంత్‌ వచ్చి వదిన ముందులా లేదని వింతగా ప్రవర్తిస్తుందని అందరూ అంటున్నారు. నాకు డౌటుగానే ఉందని అంటే బ్రో ఫీలవుతాడేమోనని మనసులో అనుకుంటాడు. ఇంతలో వాళ్ల దగ్గరకు వచ్చి బాబుగారు నేను పూర్తిగా కోలుకున్నాను. యాక్సిడెంట్ అయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా దాని గురించే ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్తుంది. దీంతో విక్రాంత్‌ నయనిని తలనొప్పిగా లేదా..? అని అడుగుతాడు. లేదని చెప్తుంది. దీంతో  వదినకు యాక్సిడెంట్ అయిన తర్వాత తలకి గాయం అయింది నాలుగు రోజుల్లో నయం అయ్యే గాయం కాదు అది అని మనసులో అనుకుంటుంటుంటే నయని కూడా  విక్రాంత్ బాబు మీరు చాలా తెలివైన వారు తిలోత్తమ అత్తయ్య వాళ్లు అనుమానిస్తే మీరు మాత్రం ఆలోచిస్తారని నాకు తెలుసు. ఇప్పుడు నా తలకు అయిన గాయాన్ని చూపించమంటే నేను ఎలా చూపించను అని మనసులో అనుకుంటుంది.


ఇంతలో విక్రాంత్‌  వదినకు ఆయన గాయం పూర్తిగా తగ్గడానికి కనీసం నెల అయినా పడుతుంది. వదినా ఇలా అడుగుతున్నందుకు మీరు నన్ను క్షమించాలి కానీ ఒకసారి మీ తలకు అయిన గాయం చూపిస్తారా అని అడుగుతాడు.  రేయ్ నువ్వు ఇలా అడిగితే ఎలా అంటాడు విశాల్‌. ఇంతలో తిలొత్తమ్మ  నాన్న విశాల్ యాక్సిడెంట్ అయి గాయాల పాలైన నీ భార్య మూడు రోజుల్లో కళ్లు తెరిచినా బాగున్ను అనుకున్నాం అలాంటిది రెండు రోజుల్లో ఇంత హుషారుగా ఉందంటే అనుమానించాల్సిందే అంటుంది. దీంతో నన్ను అనుమానిస్తున్నారా..? అత్తయ్యా అంటుంది.  

తప్పదక్కా తప్పుగా అనుకోకు. నిన్ను అభిమానించే నా భర్తే అలా అడుగుతున్నారు అంటే ఇది చిన్న విషయం కాదు ఇందులో ఏదో పెద్ద విషయమే ఉంటుంది అని సుమన చెప్తుంది. ఇంతలో కోపంగా హాసిని కథ లేదు ఏం లేదు కొత్త సమస్యలు సృష్టించాలి అనుకుంటున్నారా. విక్రాంత్ ముందు నిన్ను అనాలి. మమల్ని హాస్పిటల్‌కి రానివ్వకుండా మొత్తం నువ్వే చూసుకున్నావు. ఇప్పుడు  నువ్వే ఇలా అంటే ఎలా..? అంటూ నయనిని వెళ్లి వంట చేయమని చెప్తుంది. నయని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

అది నయని కాదని అందరికీ ఫ్రూవ్‌ చేద్దామంటే ఇలా మారిపోయిందేంటి అని తిలొత్తమ్మ, వల్లభ మాట్లాడుకుంటారు. అసలు అది నయనియేనా లేక వేరే ఎవరైనా ఇలా వచ్చారా..? తిలొత్తమ్మ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఒకవేశ తను నయని కాకపోతే ఏం చేస్తావు మమ్మీ అని వల్లభ అడుగుతాడు. దీంతో తిలొత్తమ్మ అది మనం చెప్పినట్టు వింటే సరి లేకుంటే చంపేద్దామని చెప్తుంది. కానీ ముందు మనం తను ఎవరనేది తెలుసుకోవాలని చెప్తుంది. అందుకోసం నయనికి ఒక పరీక్ష పెట్టాలని డిసైడ్‌ అవుతారు.

మూడు గంటలు పూర్తయిన తర్వాత నయని త్రినేత్రిలా మారిపోతుంది. లంగా ఓణి కట్టుకుంటుంది. విశాల్‌ రావడంతో మీ కోసం వచ్చిన నన్ను ఎందుకు అందరూ ఇబ్బంది పెడుతున్నారు అని నేత్రి అడుగుతుంది. అలాగే నయని అంటే ఎవరు బాబుగారు అని అడుగుతుంది. దీంతో విశాల్ షాకింగ్‌ గా చూస్తూ.. మళ్లీ తేరుకుని నయని నా భార్య అని చెప్తాడు. నేత్రి షాకింగ్‌ గా మీకు పెళ్లి అయిందా..? అని అడుగుతుంది.  పెళ్లి కాకపోవడం ఏంటి..? గాయత్రి, గానవి మన పిల్లలు కదా..? అంటాడు. దీంత్ నేత్రి షాక్‌ అవుతుంది. నాకు ఇంకా పెళ్లే కాలేదు బాబుగారు మీరు అప్పుడే నాకు పిల్లలు ఉన్నారు అంటున్నారు అంటుంది.  ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×