BigTV English
Advertisement

Vivekananda Reddy Murder Case: వివేకా కేసు మరో మలుపు, అవినాష్‌రెడ్డికి నోటీసులు.. ఆపై ప్రభుత్వంతో మంతనాలు

Vivekananda Reddy Murder Case: వివేకా కేసు మరో మలుపు, అవినాష్‌రెడ్డికి నోటీసులు.. ఆపై ప్రభుత్వంతో మంతనాలు

Vivekananda Reddy Murder Case: వైఎస్ వివేకానంద మర్డర్ కేసు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోందా? నిందితులుగా ఉన్న ఎంపీ అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం వెనుక ఏం జరుగుతోంది? ఇందులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చేందుకు న్యాయస్థానం అంగీకరించిందా? ఈ కేసుకు సంబంధించి నాలుగు పిటీషన్లు విచారించింది న్యాయస్థానం. తదుపరి విచారణ మార్చి మూడుకి వాయిదా వేసింది.


వైఎస్ వివేకానంద హత్య కేసు యవ్వారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నింది తులుగా ఉన్న ఎంపీ అవినాష్, శివశంకర్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు గడప తొక్కింది వైఎస్ సునీత. ఈ నేపథ్యంలో నిందితులకు నోటీసులు జారీ చేసింది.

మరో పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలన్న సునీత రిక్వెస్ట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవడం, నోటీసులు జారీ చేయడం చకచకా జరిగి పోయింది.


మరోవైపు తనతోపాటు సీబీఐ అధికారిపై నమోదైన ప్రైవేటు కేసు కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌పై పీఏ కృష్ణారెడ్డితోపాటు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అనంతరం కేసు విచారణను మార్చి మూడుకి వాయిదా వేసింది.

ALSO READ:  కడపలో అదానీ పవర్ ప్లాంట్ సిబ్బందిపై ఎమ్మెల్యే వర్గీయుల దాడి

సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలు వినిపించారు. ఈ కేసులో బాధితులే విచారణ ఎదుక్కోవాల్సి వస్తుందని న్యాయస్థానికి వివరించారు. దర్యాప్తు చేస్తున్న అధికారితో బాధితులు కుమ్మక్కు అయ్యారని చెప్పి నిందుతుడే కేసు పెట్టారని పేర్కొన్నారు.

తమపై పెట్టిన కేసును కొట్టి వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై పీఏ కృష్ణారెడ్డితోపాటు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ వ్యవహారంపై ఏపీ పోలీసులు జోరుగా విచారణ చేస్తున్నారు. రెండురోజుల కిందట పీఏ కృష్ణారెడ్డి నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు. ఇందులో ఏపీ ప్రభుత్వాన్ని చేర్చడంతో సునీత బయటపడడం తేలికని అంటున్నారు.

మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత దాఖలు చేసిన మరో పిటిషన్‌పై విచారణ చేపట్టింది న్యాయస్థానం. ఈ కేసులో 8వ నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డి తరపున చైతన్యరెడ్డి అనే డాక్టర్ జైలుకి వెళ్లి అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించారని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు.

ఈ క్రమంలో న్యాయమూర్తి  పలు ప్రశ్నలు సంధించారు. లూథ్రా వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, అవినాష్ రెడ్డి, సీబీఐ, దస్తగిరికి నోటీసులు ఇచ్చింది. ఇందులో ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది.

అసలు విషయానికొద్దాం.. సునీత్, సీబీఐ అధికారిని బెదిరించాలన్న కేసు వ్యవహారం, తిరిగి ఇప్పుడు నిందితుల మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. సీబీఐ దర్యాప్తు చేసిన దాన్ని టచ్ చేయకుండా, మరో కోణంలో దర్యాప్తు మొదలు పెట్టేసింది. దీంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లు కనిపిస్తోంది.

మాజీ ఐఏఎస్ అజయ్‌కల్లాం రెడ్డి మళ్లీ విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు అంతర్గత సమాచారం. ఈ కేసులో సీబీఐ విచారణ ఎనిమిదో నిందితుల వరకు మాత్రమే విచారించింది. అక్కడి నుంచి పూర్తి చేయడానికి కొంత వ్యవధి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. నిందితులు 9, 10 ఎవరనేది తెలిస్తే ఈ కేసు ఫుల్‌స్టాప్ పడడం ఖాయమన్నమాట.

ఇదిలావుండగా మంగళవారం సచివాలయానికి వచ్చిన వైఎస్ సునీత, ప్రభుత్వం పెద్దలతోపాటు హోంమంత్రి అనితతో సమావేశమయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సునీత అక్కడికి వెళ్లడం ఇది రెండోసారి.  దాదాపు ఐదునెలల తర్వాత ఈ కేసులో కదలిక మొదలైనట్టు కనిపిస్తోంది.

Related News

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

Big Stories

×