BigTV English

Trinayani Serial Today October 21st: ‘త్రినయని’ సీరియల్‌: నయనికి విషం ఇచ్చిన హాసిని – నిజం బయటపెట్టిన విశాలాక్షి

Trinayani Serial Today October 21st: ‘త్రినయని’ సీరియల్‌: నయనికి విషం ఇచ్చిన హాసిని – నిజం బయటపెట్టిన విశాలాక్షి

trinayani serial today Episode:  నయనిని మనం చంపేస్తే.. ఆ నేరం హాసిని మీద పడుతుంది. నెపం విశాలాక్షి మీద పడుతుంది. అని తిలొత్తమ్మ చెప్పగానే ఏం ప్లాన్‌ మమ్మీ నీది వెళ్లు నువ్వు ఏమైనా చేయ్‌ అంటాడు. కానీ హాసిని అరెస్ట్ అయితే నాకు పెళ్లాం లేకుండా పోతుంది కదా మమ్మీ అంటాడు వల్లభ. దాని పేరు మీద ఉన్న అనుభవించడానికి ఇక సంసార బాధ్యతలు ఎందుకురా అంటుంది తిలొత్తమ్మ. అవునా అయితే సరే అంటాడు వల్లభ.


పావణమూర్తి బద్దకంగా వస్తూ రెండు నిమిషాలు గేటు దగ్గర ఉందామన్నా ఎండలు మండిపోతున్నాయి అల్లుడు అంటూ విక్రాంత్‌ కు చెప్తాడు. అక్కడికి వెళ్లావు మామయ్యా నువ్వు అని విక్రాంత్ అడగ్గానే ఎదురింటి కుక్క స్కూపీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వస్తుంది. దాన్ని చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటుందనుకో అని చెప్తుండగానే వల్లభ, తిలొత్తమ్మ వస్తారు. ఏం టేస్ట్‌ మామయ్యా నీది అంటాడు. దీంతో నేనేం చేశాను అల్లుడు అంటాడు పావణమూర్తి. స్కూపీ కుక్క ఒకటికి రెండుకు కానిచ్చేస్తుంటే.. అందంగా ఉంటుందని అంటావేంటి అంటాడు వల్లభ. రేయ్‌ పావణమూర్తి అన్నది అది కాదు స్కూపీ కుక్క చూడ్డటానికి అందంగా ఉంటుందని అని తిలొత్తమ్మ చెప్తుండగానే లోపలి నుంచి విశాలాక్షి వస్తుంది.

స్కూపీ కుక్కను చూడ్డానికి కాదు. దాన్ని పట్టుకుని వచ్చే పాపిని చూడ్డానికి అని విశాలాక్షి చెప్పగానే పావణమూర్తి షాక్‌ అవుతాడు. ఇంతలో హాసిని జ్యూస్‌ తీసుకుని వచ్చి అందరికీ ఇస్తుంది. అందరూ బాగా చేశారు అని చెప్తారు. అక్క ప్రయోగాలు చేస్తుంది కానీ ఏం చేసినా బాగుంటుంది అని నయని అంటుంది. ఏం చేసినా బాగుంటుందా? అలా అయితే ఆ జ్యూస్‌ పెద్దమ్మకు ఇవ్వు అని విశాలాక్షి చెప్తుంది. నయని జ్యూస్‌ ఇవ్వబోతుంటే.. వద్దని హాసిని అంటుంది. ఇంతలో కుళ్లుగా సుమన మీ ప్రేమాభిమానాలు చూడలేక చచ్చిపోతున్నాం ఇక్కడ అంటుంది. ఇంతలో పావణమూర్తి తీసుకుని తాగబోతుంటే.. నయని, విశాలాక్షి, తిలొత్తమ్మ వద్దని ఓకేసారి అంటారు.


విక్రాంత్‌ ముగ్గురూ ఒకేసారి వద్దని అన్నారేంటని అడగ్గానే.. నయని అందులో విషం ఉందేమోనని అంటుంది. వదిన నువ్వేం మాట్లాడవేంటి జ్యూస్‌ లో విషం ఉందంటే నువ్వేమీ మాట్లాడవేమి అంటుది. నేను విషం కలిపానా.. అంటుంది. దీంతో వల్లభ నువ్వు కాకపోతే మా మమ్మీ కలిపిందా? అంటాడు. దీంతో అవును కలిపిందేమో అంటుంది హాసిని వెంటనే తిలొత్తమ్మ హాసిని కొడుతుంది. నేను ఉదయం నుంచి హాసిని ఫాలో అయ్యాను హాసినే పళ్ల రసంలో విషం కలిపింది అని చెప్పి తాను తీసిన వీడియో చూపిస్తుంది తిలొత్తమ్మ. నేను అందుకనే అమ్మను తాగొద్దని పెద్దమ్మకు ఇవ్వమన్నాను అంటుంది విశాలాక్షి.

వదిన నువ్వు ఇలా చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను అంటాడు విశాల్‌. కారణం ఏదో ఉంటుంది అంటాడు విక్రాంత్‌. ఇంతలో వల్లభ  మమ్మీ నువ్వు ఇలా వీడియో తీస్తావని అసలు అనుకోలేదు. అసలు ఇది మన కాన్సెప్ట్‌ లో లేదు కదా? అంటాడు. విశాల్‌ ఏంటది అని అడగ్గానే వీడు ఏదేదో మాట్లాడతాడు విశాల్‌ అంటుంది. తిలొత్తమ్మ. పెద్దమ్మా ఎందుకు ఇలా చేశావో చెప్పు అని విశాలాక్షి అడుగుతుంది. దీంతో చెల్లి నయనిని కాపాడుకోవాలని.. అని చెప్తుంది హాసిని. దీంతో కాపాడుకోవాలనుకుంటే ఇలా చేస్తావా? అటూ ప్రశ్నిస్తుంది సుమన.

జ్యూస్ లో పాయిజన్ కలిపి ఇస్తే నీకు ప్రాణగండం ఉందని నీకు ముందే తెలుస్తుందని లేదంటే అదంతా ఉత్తిదేనని చెప్తుంది హాసిని. దీంతో నిజంగా నాకు తెలియలేదు అక్కా అని నయని చెప్పగానే.. అయితే నీకు ప్రాణగండం అనేది కూడా ఉత్తిదే కదా? అంటుంది. ఇక తిలొత్తమ్మ అత్తయ్యా.. విశాలాక్షి కి అందులో విషం ఉందని ఎలా చెప్పారో అర్థం కాక షాక్ లో ఉండిపోయాను అంటుంది హాసిని. ఇదే కాదు అమ్మ జీవితంలో మరో ఊహించని మలుపు రాబోతుంది. అని విశాలాక్షి చెప్తుంది. విశాలాక్షి మాటలకు విశాల్‌ భయపడతాడు.

హాసిని దగ్గరకు వెళ్లిన తిలొత్తమ్మ నేను అడిగే దానికి సూటిగా సమాధానం చెప్పు అని అడుగుతుంది. విషయం ఏంటో చెప్తే నేను వెళ్లి పని చేసుకుంటాను అంటుంది. మళ్లీ వెళ్లి జ్యూస్‌లో విషం కలుపుతుందేమో అంటాడు వల్లభ. విశాల్‌ వచ్చి అన్నయ్యా ఏంటా మాటలు అంటాడు. వదిన సరదాగా అంటుందే తప్పా ఎవ్వరినీ టార్గెట్ చేయదు అంటాడు. అలా అనుకుంటే మీ ఆవిడ పరిస్థితి ఏమౌతుందో ఒక్కసారి ఆలోచించు విశాల్‌ అంటుంది తిలొత్తమ్మ. నాకేం కాదని నయని చెప్తుంది.

అదేంటి పెద్ద మరదలా ఇప్పటి వరకు నాకేదో అవుతుందని ఇప్పటి వరకు ఆలోచించావు అని వల్లభ అడగ్గానే.. అసలు నాకు అపాయం ఉందా? లేదా? అని హాసిని అక్క అలా చేసిందని అంటుంది. ఒకవేళ నువ్వు ఆ విషం ఉన్న జ్యూస్‌ తాగి ఉంటే అని తిలొత్తమ్మ అంటుంది. అమ్మా ఇక్కడ చూడాల్సింది విషం కాదు హాసిని వదిన చేసిన ప్రయత్నాన్ని అంటాడు విశాల్‌. వదిన నువ్వు ఏ తప్పు చేయలేదు. నీకు అండగా మేముంటాము అంటాడు. దీంతో మరీ ఇంత మంచి తనం పనికిరాదు తమ్మీ మా ఆవిడ చేతిలో మీ ఆవిడ ప్రాణాలు పోకుండా చూసుకో అంటాడు వల్లభ. దీంతో హాసిని అక్క చేతిలో నేను పోయినా నాకు సంతోషమే అంటుంది నయని.

అమ్మో హాసిని అక్క ఎంత పని చేసిందో చూడు అంటూ విక్రాంత్‌ దగ్గరకు వెళ్తుంది సుమన. ఏం చేసిందని విక్రాంత్‌ అడగ్గానే జ్యూస్‌లో విషం కలిపింది అనగానే అక్కడ నేను కూడా ఉన్నాను కదా? నువ్వు మళ్లీ మళ్లీ అదే విషయం చెప్పాలా అంటూ విక్రాంత్‌ కోపంగా సుమనను తిడతాడు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Dhee Bhoomika : ఢీ కంటెస్టెంట్ కి భారీ యాక్సిడెంట్… కారు తుక్కు తుక్కు

Smriti Irani: ఒక్క ఎపిసోడ్ లక్షల్లో రెమ్యూనరేషన్.. ఏమాత్రం తగ్గని మాజీ మంత్రి క్రేజ్!

Bindas Brothers: పేరుకే సెలబ్రిటీలం… సంపాదన మాత్రం నిల్.. బిందాస్ బ్రదర్స్ కన్నీటి కష్టాలు!

Big TV Kissik talks: తట్టుకోలేక సూసైడ్ అటెంమ్ట్ చేశా.. కిస్సిక్ షోలో అమర్‌దీప్ ఎమోషనల్!

Telugu TV Serials: ఈ వారం టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Nindu Noorella Saavasam Serial Today August 8th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్ర విషయంలో ఆరుతో బాధపడ్డ మిస్సమ్మ

Big Stories

×