BigTV English

Kaushik Reddy: మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఏకంగా యాదాద్రి ఆలయంలోనే రీల్స్!

Kaushik Reddy: మరో వివాదంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఏకంగా యాదాద్రి ఆలయంలోనే రీల్స్!

Kaushik Reddy Yadadri Reels viral: తెలంగాణలో గత కొంతకాలంగా రాజకీయాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చుట్టే తిరుగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి మధ్య వైరం తీవ్ర స్థాయికి వెళ్లింది. ఇద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మరోవైపు నువ్వంతా అనే స్థాయిలో బూతులు తిట్టుకోవడంతో హాట్ టాపిక్ అయింది. దీంతో సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయ్యాయి.


తాజాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. యాదగిరిగుట్టు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాడవీధుల్లో తన భార్య, కుమార్తెతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్ చిత్రీకరించారు. అయితే ఆలయంలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు నిషేధం ఉన్నప్పటికీ.. అనుమతి లేకుండా రీల్స్ చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది.

మరోవైపు, భాస్కర్ రావు ఆలయ ఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి కొంతమంది రాజకీయ నాయకులను చూసీ చుడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల లడ్డూ వివాదం చోటుచేసుకుంది. నాలుగు రోజుల క్రితం ఏకంగా ఓ ఎమ్మెల్యే అనుచరులు లడ్డూ కౌంటర్ లోపలికి ప్రవేశించారని విమర్శలు కూడా వచ్చాయి.


Also Read: నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత

అయితే ఈ వ్యవహారంలో ఆలయ అధికారులు తూతూ మంత్రంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపేసుకున్నారని పలువురు అనుకుంటున్నారు.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×