trinayani serial today Episode: పాపను ఇచ్చేందుకు సుమన రెడీ అవుతుంది. ఇంతలో గాయత్రి పాప వచ్చి పెద్దబొట్టమ్మను దూరంగా తోస్తుంది. తన చేతిలో ఫోన్ తీసి నయనికి ఇస్తుంది. ఫోన్ చూసిన నయని షాక్ అవుతుంది. పాపను ఇవ్వబోతున్న సుమన చేతులు పట్టుకుని పాపను విక్రాంత్ ను తీసుకోమని చెప్పి.. సుమనను కొడుతుంది. ఎందుకు కొడుతున్నావో చెప్పు అని సుమన అడగ్గానే నయని ఫోన్ లో ఉన్న వీడియో చూపిస్తుంది. ఆ వీడియో పెద్దబొట్టమ్మ, సుమన మాట్లాడుకున్నది ఉంటుంది. ఎవరికి వాళ్లు పెద్ద ఐడియాలు వేసుకుంటున్నారు అంటుంది తిలొత్తమ్మ. పెద్దబొట్టమ్మను అందరూ కలిసి ఇంట్లోంచి వెళ్లగొడతారు.
రాత్రికి ఇంటి బయట కూర్చుని బయపడుతున్న దురంధర దగ్గరకు తిలొత్తమ్మ, హాసిని వస్తారు. ఇంతలో విశాల్ వస్తారు. సుమనని నయని కొట్టడానికి కారణం ఈ దత్తపిల్లనే అంటుంది దురందర. నాకు అర్థం కావడం లేదని విశాల్ అడుగుతాడు. దీంతో ఉలూచి దత్తత గురించి పెద్దబొట్టమ్మ, సుమన ప్లాన్ చేసుకోవడం. గాయత్రి పాప వీడియో తీయడం మొత్తం చెప్తుంది హాసిని. గాయత్రి పాప టాలెంట్‌కు విశాల్ ఆశ్యర్యపోతాడు. మేము కూడా ఇంత చిన్న వయసులో ఈ పిల్లకు ఇంత తెలివి ఎలా వచ్చిందో అని తిలొత్తమ్మ అంటుంది. విశాల్ ను ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఫైల్ ఇవ్వడానికి వెళ్తున్నాను అంటాడు విశాల్.
హల్లో కూర్చున్న సుమన దగ్గరకు వెళ్లి నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావా? అని అడుగుతాడు విక్రాంత్. ఇంట్లో ఉండకుండా ఎక్కడ ఉంటాను అంటుంది సుమన. నువ్వు ఉండాల్సింది ఇంట్లో కాదు రోడ్డు మీద అంటాడు విక్రాంత్. ఏం పాపం చేశానని సుమన అడగ్గానే నువ్వు చేసిన పాపం అలాంటిది అంటాడు. నేను మన ఫ్యామిలీ గురించే అలా చేశాను అంటుంది. సరే పద వెళ్లిపోదాం అంటాడు విక్రాంత్. ఎక్కడికి అని అడుగుతుంది. మన బతుకు మనం బతకడానికి వెళ్దాం. అనగానే ఉన్నట్టుంది రమ్మంటే ఎలా వస్తాను. నాకు కోట్లు వచ్చాక వస్తాను అంటుంది. దీంతో సుమనను నిలువునా చీల్చేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు.
ఉలూచి ఏడుస్తుంటే దురంధర తీసుకొచ్చి గాయత్రి పాప దగ్గర వదిలిపెడుతుంది. ఇంతలో కోవెల మూర్తి ఫోన్ చేయగానే ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పెద్దబొట్టమ్మ ఎవ్వరూ లేరు ఉలూచి పాపను తీసుకెళ్తాను అనుకుని ఉలూచి దగ్గరకు వెళ్తుంది. గాయత్రి పాప చూస్తుంటే ఏదో చెప్పబోతుంది. ఇంతలో హాసిని రావడం చూసి పెద్దబొట్టమ్మ చాటుకు వెళ్తుంది. హాసిని వచ్చి ఉలూచిని ఎత్తుకుంటుంది.
ఇంతలో దురందర వచ్చి ఇంకా ఏడుస్తూనే ఉందా? అంటుంది. ఇంతలో నయని వచ్చి సుమన ఏం చేస్తుంది అని అడుగుతుంది. పెళ్లాం మొగుళ్లకు ఎప్పుడూ గొడవే అని దురందర చెప్తుంది. ఇంతలో గాయత్రి నయనికి పెద్దబొట్టమ్మ అక్కడ ఉంది అని చూపిస్తుంది. దీంతో పెద్ద బొట్టమ్మ భయపడుతుంది. ఇంతలో అక్కడకు వచ్చిన తిలొత్తమ్మకు చెప్పొద్దని సైగ చేస్తుంది.
దీంతో ఇక్కడ ఏమీ లేదని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతలో సుమన వచ్చి ఉలూచిని ఎత్తుకుంటుంది. గాయత్రి పాప మళ్లీ పెద్దబొట్టమ్మ ఉన్న సైడు చూపిస్తుంది. ఏదో పారేసుకున్నట్లుంది లేకపోతే ఇలా చూపించదు అంటాడు విక్రాంత్. చూడండి విక్రాంత్ బాబు అంటుంది నయని. దీంతో పెద్దబొట్టమ్మ ఉన్న వైపు విక్రాంత్ వెళ్తుంటే.. వల్లభ, తిలొత్తమ్మ విక్రాంత్ ను ఆపుతారు. ఇంతలో దురందర గాయత్రి నువ్వు అక్కడికే వెళ్లి చూపించు విక్కి తీస్తాడు అని చెప్పగానే గాయత్రి లేచి అటువైపు వెళ్తుంది.
అక్కడకు వెళ్లి కింద పడుకుని చూపిస్తుంది. అక్కడ భుజంగమణి ఉంటుంది. పెద్దబొట్టమ్మ కూడా ఇక్కడ ఏదో ఉన్నట్లుంది సర్ప రూపంలోకి మారితే కానీ కనబడదు అని పాములా మారి వెళ్లి చూస్తుంది. అక్కడే మణి ఉందని చూసి ఆశ్యర్యపడుతుంది. ఇంతలో మణిని గాయత్రి తీసుకోబోతుంటే పెద్దబొట్టమ్మ కాటేస్తుంది.
గాయత్రిని కాటేయడం చూసిన విక్రాంత్ భయంతో గట్టిగా గాయత్రి అంటూ అరుస్తాడు. నయని కంగారుగా పరుగెత్తుకొస్తుంది. ఏమైంది విక్రాంత్ బాబు అంటూ అడుగుతుంది. ఇంతలో టేబుల్ కిందనుంచి పాము పారిపోతుంది. వల్లభ కంగారుగా పెద్దబొట్టమ్మ గాయత్రిని కాటేసినట్టుంది మమ్మీ అంటాడు. పెద్దబొట్టమ్మ ఎందుకు కాటేస్తుంది అని తిలొత్తమ్మ అంటుంది. దీంతో నయని తిలొత్తమ్మే కాటేసిందని చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ కు ఎండ్ కార్డు పడుతుంది.