Supritha: సుప్రీత (Supritha)తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇప్పటివరకు సుప్రీత హీరోయిన్ గా ఒక సినిమాలో కూడా నటించకపోయిన ఈమె మాత్రం ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి(Surekha Vani) కుమార్తెగా అందరికీ సుపరిచితమైన సుప్రీత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేస్తూ ఉండేవారు.. ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి . ప్రస్తుతం బుల్లితెరప్ నటుడు అమర్ దీప్(Amardeep) సుప్రీత జంటగా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి(Chowdary Gari Abbayitho Naidu gari Ammayi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఆ హీరోలతో డేటింగ్..
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇద్దరు పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా యాంకర్ నిఖిల్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నిఖిల్ తో ముద్దు ముచ్చట్లు అనే కార్యక్రమంలో భాగంగా వీరిద్దరూ ఎన్నో విషయాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలోనే నిఖిల్ వీరిద్దరిని ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. ముఖ్యంగా సుప్రీత మీ క్రష్ తో లైఫ్ లో ఎప్పుడైనా డేట్ ఊహించుకున్నారా? అనే ప్రశ్న ఎదురయింది. తాను టాలీవుడ్ హీరోలైన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), అఖిల్(Akhik) తో డేట్ ఊహించుకున్నానని, ప్రస్తుతం అయితే నవీన్ పోలిశెట్టితో బ్యాడ్లీ క్రష్ ఉంది అంటూ అసలు విషయం బయటపెట్టారు. అదేవిధంగా తన ఫస్ట్ కిస్ కూడా స్కూల్ టైం లోనే ఎక్స్పీరియన్స్ చేశాను అంటూ ఈమె షాకింగ్ విషయాలను తెలియచేశారు.
రష్మిక క్రష్ అంటున్న అమర్…
ఇక అమర్ దీప్ మీ క్రష్ ఎవరు అంటూ ప్రశ్న ఎదురు కావడంతో తనకు ఎవరూ లేరని కాకపోతే రష్మిక (Rashmika)అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. ఇలా రష్మిక ఇష్టమని చెప్పడంతో విజయ్ దేవరకొండను నేను తీసుకెళ్తాను, రష్మికను నువ్వు తీసుకెళ్లిపో అంటూ సుప్రీత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఇద్దరు సినిమాకు సంబంధించిన విషయాలను అలాగే ప్రేమ మీద వారి అభిప్రాయాల గురించి వెల్లడించారు.
బిగ్ బాస్ 7 రన్నర్ గా…
సుప్రీత సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక అమర్ మాత్రం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా గుర్తింపు పొందడమే కాకుండా బిగ్ బాస్7(Bigg Boss 7) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని రన్నర్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత అమర్ దీప్ బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉండటమే కాకుండా వెండి తెర సినిమా అవకాశాలను అందుకొంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఇలా సినిమాలతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.