Asia Cup 2025: ఆసియా కప్ 2025 ప్రారంభం కావడానికి మరో 11 రోజుల సమయం మాత్రమే ఉంది. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుండి 28వ తేదీ వరకు ఈ మెగాటోర్ని 17వ ఎడిషన్ జరగబోతోంది. ఇప్పటివరకు 16 సార్లు జరిగిన ఈ ఆసియా కప్ లో.. 2016 నుండి టీ-20 ఫార్మాట్ ను కూడా ప్రవేశపెట్టారు. 2016, 2022లలో టి-20 ఫార్మాట్ లో ఈ టోర్నీ జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి టి-20 ఫార్మాట్ లోనే ఈ టోర్నమెంట్ జరగబోతోంది. ఇందులో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడతాయన్న విషయం తెలిసిందే.
Also Read: BCCI president: బీసీసీఐకి కొత్త బాస్.. ఇక టీమిండియాలో పెను మార్పులు ?
ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విడదీస్తారు. గ్రూప్ దశ మ్యాచ్ ల అనంతరం సూపర్ ఫోర్, ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ ఆసియా కప్ లో మరోసారి టైటిల్ ఫేవరెట్ గా భారత జట్టు బరిలోకి దిగనుండడం విశేషం. అయితే ఈ టోర్నీ కోసం సెప్టెంబర్ 4న దుబాయ్ కి చేరుకొనుంది భారత క్రికెట్ జట్టు. అయితే ఇటువంటి మెగా టోర్నీలకు వెళ్లే సమయంలో టీమిండియా ప్లేయర్లంతా బిసిసిఐ కార్యాలయానికి చేరుకొని.. అక్కడ గ్రూప్ ఫోటో తీసుకుని, అనంతరం టోర్నీ జరిగే ప్రదేశానికి పయనమవుతారు. కానీ ఈసారి ఆ విధానానికి భారత జట్టు స్వస్తి పలికింది.
సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని 15 మంది సభ్యులతో కూడిన భారత క్రికెట్ జట్టు.. ఈ టోర్నీ కోసం ముంబైలో ముందుగా కలిసి బయలుదేరే పద్ధతిలో కాకుండా.. ఈసారి తమ తమ ప్రాంతాల నుంచి నేరుగా దుబాయ్ కి చేరుకోనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి వెల్లడించారు. జట్టు సభ్యులంతా సెప్టెంబర్ 4 న దుబాయ్ చేరుకుంటారని.. సెప్టెంబర్ 5న ఐసీసీ అకాడమీలో తొలి నెట్ సెషన్ ఉంటుందని తెలిపారు. అయితే ఆటగాళ్ల సౌలభ్యం దృశ్యా.. వారు తమ తమ నగరాల నుంచి నేరుగా దుబాయ్ కి వెళ్లేందుకు అనుమతించామని తెలిపారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5 నుంచి భారత ఆటగాళ్లకు అసలైన అగ్నిపరీక్ష మొదలుకానుంది.
హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియా ఆటగాళ్లతో కఠినమైన ప్రాక్టీస్ చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ టోర్నీలో సత్తా చాటాలని భావిస్తున్నాడు గౌతమ్ గంభీర్. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి కేవలం 15 నెలల్లో టీం ఇండియాకు రెండవ ట్రోఫీని గెలిపించే అవకాశం వచ్చింది. ఇంతకుముందు గంభీర్ హెడ్ కోచ్ గా భారత్ కి 2025 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. ఇప్పుడు ఆసియా కప్ ని కూడా అందించాలనే పట్టుదలతో ఉన్నాడు. గంభీర్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన సమయం నుండి భారత జట్టు మొత్తం 13 టీ-20 మ్యాచ్ లు ఆడగా.. అందులో 11సార్లు విజయం సాధించింది. దీంతో కోచ్ గా గౌతమ్ గంబీర్ టీ-20 లలో 85% విజయాలతో బెస్ట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆసియా కప్ లో కూడా భారత జట్టును గెలుపు బాట పట్టించి.. తానేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు గౌతమ్ గంభీర్.
India will begin their Asia Cup 2025 preparations on 5th September at the ICC Academy 🇮🇳🏏
Source: PTI#AsiaCup2025 #IndianCricketTeam #GautamGambhir #SuryakumarYadav #CricketTwitter pic.twitter.com/8ToL9nuH4M
— InsideSport (@InsideSportIND) August 28, 2025