BigTV English

Hyderabad Flyovers : మెట్రో పిల్లర్లకు టీమిండియా ప్లేయర్ల ఫోటోలు… ఎక్కడంటే

Hyderabad Flyovers : మెట్రో పిల్లర్లకు టీమిండియా ప్లేయర్ల ఫోటోలు… ఎక్కడంటే

Hyderabad Flyovers :  సాధారణంగా టీమిండియా క్రికెటర్లు ఏదైనా మ్యాచ్ ఆడుతున్నారంటే తమకు సంబంధించిన అభిమానులు తమ ఆటగాడిని చూడటానికి స్టేడియం వద్దకు వెళ్తుంటారు. లేదంటే ఎక్కడికైనా వస్తున్నాడనే తెలియగానే చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ వెల్లి వీక్షిస్తుంటారు. తమ అభిమాన క్రికెటర్లను వీక్షించేందుకు ఎవ్వరైనా ఆసక్తి కనబరుస్తారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు బంఫర్ ఆఫర్ ఇస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది. ఉత్సాహంగా రాణించాలని.. ఒలింపిక్స్ లో కూడా భారత్ చైనా మాదిరిగా పతకాలను సాధించాలని తోడ్పాటును అందిస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా తీసుకురానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ లో మెట్రో ఫిల్లర్లకు టీమిండియా క్రికెటర్ల ఫొటోలు కనిపించాయి.


Also Read :  Asia Cup 2025: ఆసియా కప్ కంటే ముందే టీమిండియా ప్లేయర్లకు గంభీర్ అగ్నిపరీక్ష… సెప్టెంబర్ 5 నుంచి ఆట షురూ

మెట్రో పిల్లర్లకు టీమిండియా స్టార్  ప్లేయర్ల ఫోటోలు..


ప్రస్తుతం మెట్రో ఫిల్లర్లకు టీమిండియా క్రికెటర్లు కపిల్ దేవ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా, కే.ఎల్. రాహుల్ వంటి క్రికెటర్లకు సంబంధించిన ఫొటోలు మెట్రో ఫిల్లర్లపై కనిపించడం విశేషం. కొంత మంది క్రికెట్ అభిమానులు, యువకులు క్రికెట్ పై ఆసక్తి కనబరిచేందుకు ఈ ఫిల్లర్ల పై క్రికెటర్లకు సంబంధించిన ఫొటోలు ఏర్పాటు చేసినట్టు సమాచారం.  కొందరూ చూడటానికి చాలా బాగున్నాయని పేర్కొంటే.. మరికొందరూ ఎందుకు ఇవి పనికిరానివి అని ఎవ్వరికీ నచ్చినట్టు వారు పేర్కొంటున్నారు. ఇక ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఒలింపిక్స్ బిడ్ ఏర్పాటు చేయాలని హైదరాబాద్ లో జరిగి స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా పలు మెట్రో స్టేషన్ల వద్ద ఫిల్లర్లకు క్రికెటర్ల ఫొటోలు వేయించారని కొందరూ పేర్కొనడం గమనార్హం.

క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం.. 

క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహానికి సంబంధించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్రం, అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలని తన లక్ష్యం అని సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాాణలో ఐటీ సంస్కృతి ఉందని.. ప్రతీ కుటుంబం తమ పిల్లలు ఐటీ రంగంలో ఉండాలని కోరుకుంటున్నారని.. అదే తరహాలో క్రీడా సంస్కృతి కూడా రావాలని కోరుకుంటున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు గతంతో పోలిస్తే.. బడ్జెట్ ను 16 రెట్లకు పెంచామని.. క్రీడాకారులకు నగదు ప్రోత్సహాకాలు,  ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసారు. క్రీడా రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు స్పోర్ట్స్ హబ్ బోర్డు తగిన కార్యచరణ రూపొందించాలని సూచించారు. ఇకపై గ్రామ స్థాయి నుంచి మొదలు రాష్ట్ర స్థాయి వరకు క్రీడా పోటీలు నిర్వహించి జట్లను ఎంపిక చేస్తామని ప్రకటించారు. క్రీడా పరికరాలపై పన్నులను తగ్గించేలా కేంద్రంతో మాట్లాడతామన్నారు. తమ స్థాయిలో అవసరమైన ప్రోత్సహాకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 

Related News

T-20 Records : టీ-20 చరిత్రలోనే తోపు బౌలర్లు.. వీళ్లు వేసిన ఓవర్లు అన్ని మెయిడీన్లే..!

Asia Cup 2025: ఆసియా కప్ కంటే ముందే టీమిండియా ప్లేయర్లకు గంభీర్ అగ్నిపరీక్ష… సెప్టెంబర్ 5 నుంచి ఆట షురూ

Harshit Rana : గంభీర్ రాజకీయాలు.. వీడొక్కడికే అన్ని ఫార్మాట్ లో ఛాన్స్.. తోపు ఆటగాళ్లకు అన్యాయమే

BCCI president: బీసీసీఐకి కొత్త బాస్.. ఇక టీమిండియాలో పెను మార్పులు!

IND Vs PAK : ఆసియా కప్ కంటే ముందు పాకిస్థాన్ ను వణికిస్తున్న రికార్డులు…. టీమిండియాతో పెట్టుకుంటే మాడి మసి అయిపోవాల్సిందే..

Big Stories

×