Illu Illalu Pillalu ToIlluday Episode August 29th : నిన్నటి ఎపిసోడ్ లో.. తిరుపతికి వచ్చిన లెటర్ అనుకోని ప్రేమ దాన్ని ఎంతో ఆశగా ఓపెన్ చేస్తుంది కానీ అందులో తాను, తన మాజీ బాయ్ ఫ్రెండ్ కళ్యాణ్తో కలిసిన ఫోటోలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఇక ఏమి మాట్లాడలేక పోతుంది.. ఆ లెటర్ ఎవరికి వచ్చిందని అడుగుతారు.. కానీ ప్రేమ మాత్రం అది నాకే వచ్చింది కాలేజ్ నుంచి వచ్చింది అని చెప్పేసి కవర్ చేస్తుంది. ధీరజ్మాత్రం లెటర్ నీకు వచ్చిందా ఎవరు పంపారు అని అడుగుతాడు. కాలేజీ నుంచి వచ్చింది అని ప్రేమ అబద్ధం చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోతుంది.. అయితే ఆ ఫోటోలను చూస్తున్న ప్రేమ దిమ్మ తిరిగిపోయే షాక్ అవుతుంది. మాజీ లవర్ కళ్యాణ్ తో ప్రేమకు మళ్లీ కష్టాలు మొదలవుతాయి.. నర్మదతో సాగర్ ప్రేమ కబుర్లు చెప్పుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే…సాగర్, నర్మదలు ఇద్దరు కూడా బైకుపై సరదాగా వెళ్తుంటారు.. అయితే సాగర్ బండి నడపడం చూసి నర్మదా నాకేంటి టార్చర్ అని అంటుంది. చాలా రోజుల తర్వాత ఇలా వస్తున్నాం కదా… నాకు చాలా సంతోషంగా ఉంది అని సాగర్ అంటాడు. ఎప్పుడూ నాన్న నాన్న అంటావ్ కదా అందుకే ఇన్నాళ్లకు మనం ఇలా రావాల్సి వచ్చింది అని అంటుంది నర్మదా.. ఇద్దరూ కలిసి సరదాగా బయట ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. నర్మదా సాగర్ చేస్తున్న చిత్ర విచిత్రాలకి ఈరోజు సునామీ తుఫాను అన్ని వచ్చేలా ఉన్నాయని అంటుంది.. నువ్వే మీ నాన్నకు భయపడి ఇంట్లోంచి బయటికి తీసుకురావాలన్నా కూడా పర్మిషన్ ఇవ్వడం అనుకుంటావు.
నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఎంత ధైర్యం చేశానో తెలుసా? ప్రేమ పెళ్లి చేసుకోనని మా నాన్నకు మాటిచ్చి మరి నిన్ను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకెళ్ళను నువ్వేం చేసావు అని సాగర్ అడుగుతాడు.. నేను జస్ట్ ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చాను అని అంటున్నావే మా తల్లిదండ్రులని వదిలేసి నేను ఎంత బాధని దిగమింగుకొని వచ్చాను తెలుసా అని నర్మదా అడుగుతుంది.. అప్పుడే నర్మదకు ఎక్కిళ్ళు వస్తాయి. నేను నీతో వచ్చేసిన తర్వాత మా నాన్న నన్ను అనుకోవడం కూడా మానేసి ఉంటాడు అని నర్మదా అంటుంది.
అంతలోపే నర్మద వాళ్ళ నాన్న నుంచి ఫోన్ వస్తుంది. మా నాన్న ఫోన్ చేస్తున్నాడు అని సంతోషపడుతుంది కానీ చేసింది వాళ్ళ అమ్మ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని నర్మదా అడుగుతుంది. మీ నాన్నకు హార్ట్ ఎటాక్ వచ్చింది అని వాళ్ళ అమ్మ చెప్పగానే నర్మదా ఒక్కసారిగా షాక్ గురవుతుంది. వెంటనే సాగర్ తో కలిసి హాస్పిటల్ కి వెళుతుంది.
హాస్పిటల్ బెడ్ పైన వాళ్ళ నాన్నను చూసి నర్మదా కన్నీళ్లు పెట్టుకుంటుంది. నా కూతురు అని ఎంత మురిసిపోయావు నాన్న ఇప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి పోయింది అని అడుగుతుంది. నా కూతురు ప్రతిదీ నాతో చెప్పేది. మాట కాదనకుండా అన్ని వినేది అందుకే నేను ఎప్పుడూ నా కూతురు గురించి గొప్పగా మాట్లాడుకుంటాను. మా ఆఫీస్ లో మీ అల్లుడు రైస్ మిల్లులో మూటలు మోస్తున్నాడట కదా అని అడుగుతుంటే తల కొట్టేసినట్టు ఉంటుంది. అందుకే ఈమధ్య ఆఫీస్ కి కూడా వెళ్లలేదు అని అంటాడు.
ఆ మాట విన్నా సాగర్ లోపలికి వస్తాడు. మీరు నా మొహం కూడా చూడడానికి ఇష్టపడడం లేదని నాకు అర్థం అవుతుంది. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి అని అడుగుతాడు. నేను గవర్నమెంట్ జాబ్ చేస్తే మీరు నన్ను అల్లుడుగా ఒప్పుకుంటారా అని అడుగుతాడు. నర్మదా మీ ఇంట్లో పరిస్థితి గురించి తెలుసు కదా సాగర్ అని అంటుంది. కాసేపు ఆగు నర్మదా అని సాగర్ అంటాడు.. నేను గవర్నమెంట్ జాబ్ కచ్చితంగా తెచ్చుకుంటాను మీరు నన్ను అల్లుడుగా ఒప్పుకోవాలి అని అడుగుతాడు. నేను కచ్చితంగా ఒప్పుకుంటాను నువ్వు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నర్మదా వల్ల నాన్న అంటాడు.
Also Read : సూసైడ్ చేసుకోబోయిన కీర్తి.. నమ్మిన వాళ్ళే నాతో అలా..
ఇంట్లో శ్రీవల్లి నర్మదా ప్రేమలకు నువ్వు ఎలా దొరకబెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఎంతగా ఆలోచించినా నర్మదా ప్రేమల తప్పులు కనిపించవు. అయితే శ్రీవల్లి సరిగ్గా ఆలోచిస్తే ఏదో ఒకటి దొరుకుతుందని మళ్లీ ఆలోచిస్తుంది. సాగర్ చేతిలో బుక్ ఉంది కదా ఏదో జరుగుతుంది అదేంటో తేల్చేస్తా అని అనుకుంటుంది. నర్మదా గుట్టు అయితే బయటకు వచ్చింది కానీ ప్రేమ ఏం చేసిందా అని ఆలోచిస్తుంది. నిన్ను అత్తయ్య పిలుస్తుంది వెళ్ళు అని ప్రేమను అంటుంది.. ప్రేమ రూమ్ లో శ్రీవల్లి వెతుకుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. మరి రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ఫోటోలు బయటపడతాయా? శ్రీవల్లి ఇంట్లో ఎలాంటి అలజడి సృష్టిస్తుంది చూడాలి..