Pawan kalyan : ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్నారు. ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ విషయం పై అనేక నిజాలు వెలుగు చూసాయి. లడ్డు కల్తీ కారణంగా డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆయన నియమ నిష్ఠలతో స్వామి వారి దర్శననానికి కాలినడకన తిరుమలకు వెళ్లారు. నిన్న ప్రాయశ్చిత్త దీక్ష విరమణలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనార్థం అలిపిరి మెట్ల మార్గం గుండా సామాన్య భక్తులతో కలిసి కాలినడకన తిరుమల కొండ పైకి చేరుకున్నారు. నేడు శ్రీవారిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చిన్న కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయన చిన్న కూతురు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ విరమణ దీక్షలో భాగంగా తిరుమలకు చేరుకున్నారు.. తన ఇద్దరు కూతుర్లతో కలిసి టీటీడీ ఉద్యోగులను మీట్ అయ్యారు. టిటిడి ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్బంగా పవన్ చిన్న కూతురు పలీనా అంజని క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. పలీనా అంజని మైనర్ అయినందున తండ్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ఆ పత్రాలపై సంతకాలు చేశారు.. పవన్, అన్నా లెజనోవా దంపతులకు కూతురే ఈ అమ్మాయి.. పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కూతుర్లతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ చిన్న కూతురును చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎప్పుడు చూడలేదు.. ఇద్దరు కూతుర్లు ఒకేలా ఉన్నారు అంటూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు..
ఇక పవన్ కళ్యాణ్ తిరుమలలో ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని పిమ్మట తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోనున్నారు. స్వామి దర్శనం అనంతరం పవన్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించునున్నారు. ఇక శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ తన కూతుర్ల తో కలిసి నేరుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం సముదాయానికి చేరుకోనున్నారు పవన్. భోజనశాలలో అన్నప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి, అన్నప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు పవన్ కళ్యాణ్. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించనున్నారని సమాచారం..