BigTV English

Trinayani Serial Today October 8th: ‘త్రినయని’ సీరియల్‌: ఒకేసారి నడచుకుంటూ వచ్చిన ఇద్దరు గాయత్రిలు – ఇద్దరిని ఓకేసారి చూసి షాక్‌ అయిన తిలొత్తమ్మ

Trinayani Serial Today October 8th: ‘త్రినయని’ సీరియల్‌: ఒకేసారి నడచుకుంటూ వచ్చిన ఇద్దరు గాయత్రిలు – ఇద్దరిని ఓకేసారి చూసి షాక్‌ అయిన తిలొత్తమ్మ

trinayani serial today Episode: ప్రయోగాలు మంచికే ఉపయోగించాలి అని విక్రాంత్‌ చెప్పగానే మరి చేసింది మంచి ప్రయోగమా? అని ప్రశ్నిస్తుంది సుమన. నీకు మా అమ్మ గురించి తెలియదు. తనకు అనుమానం వస్తే సంపూర్ణంగా తుడిచిపెట్టుకుపోవాలి అని విక్రాంత్‌ చెప్పినా నిన్ను అడిగితే చెప్పవు కానీ ఇవాళ రాత్రిని నువ్వే చూస్తావుగా అంటూ విక్రాంత్ వెళ్లిపోతాడు.


వల్లభ గాయ్రతి పాపను తీసుకుని తిలొత్తమ్మ దగ్గరకు వస్తాడు. రా పాప నిన్ను కన్నతల్లి ఎవరో తెలియదు కానీ నా కన్నతల్లి దగ్గరకు నిన్ను తీసుకొచ్చాను అంటాడు వల్లభ. నువ్వు స్పృహ కోల్పోగానే గాయత్రి అక్క వచ్చిందంటే తనే నువ్వు నువ్వే తను అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో విశాల్‌ వస్తాడు. గుర్తుపట్టావా? అమ్మా అంటూ అడుగుతాడు. దీంతో ఈ పిల్ల నిజంగా నిన్ను నాన్నా అని పిలవాలి. ఎందుకంటే నువ్వు దత్తత తీసుకున్నందుకు కాదు. ఈ పాపే నీ కన్నబిడ్డ కాబట్టి అని చెప్తుంది. ఇంతలో నయని వస్తూ నేను కూడా అదే అనుకుంటున్నాను అత్తయ్య అంటుంది.

ఎందుకు అలా అనుకుంటున్నావు అక్కా అంటూ సుమన అడుగుతుంది. దీంతో గాయత్రి పాప నిద్రపోతున్నప్పుడు, స్పృహలో లేనప్పుడే కదా గాయత్రి పెద్దమ్మ వచ్చేది అంటాడు విక్రాంత్‌. అవును ఆవిడ ఆత్మ రావడం నా మీద దాడి చేయడం కూడా జరిగింది కదా? అంటుంది తిలొత్తమ్మ. అమ్మా నిన్ను ఎందుకు కొట్టిందో కానీ గాయత్రి పాప మెలుకువ ఉన్నప్పుడు అమ్మా రాదంటారా? అని విశాల్‌ అడగ్గానే రాదని తిలొత్తమ్మ అంటుంది. ఒకవేళ వస్తే..  పాప ఇక్కడే ఉంది పైగా మెలుకువతో ఉంది. మా అమ్మ ఇక్కడే ఉంటే.. అంటాడు విశాల్‌.


ముందు గాయత్రి అక్కను రమ్మనండి. అప్పుడు ఈ పిల్ల మన పిల్ల కాదని కరాకండిగా చెప్పేయొచ్చు అంటుంది తిలొత్తమ్మ. నయని అమ్మను రమ్మను అంటూ చెప్తాడు విశాల్‌. దీంతో నయని అమ్మగారు ఈ అయోమయం నుంచి మమ్మల్ని బయట పడేయాలంటే మీరొక్కసారి దర్శనం ఇవ్వాలి. రండి అమ్మగారు అని పిలుస్తుంది. అక్క కనక ఇప్పుడు రాకపోతే నయని కన్నబిడ్డ ఇంకా మనకు దొరకనట్టే అని నేను కూడా ఓప్పేసుకుంటానురా.. అంటుంది తిలొత్తమ్మ. నయని ఎంత పిలిచినా గాయత్రి దేవి రాదు. దీంతో తిలొత్తమ్మ కోపంగా గాయత్రి అక్కా అయితే రాదురా.. ఎందుకంటే ఈ పిల్లే గాయత్రి దేవి అంటుంది. ఇంతలో నయనికి గాయత్రి దేవి కనిపిస్తుంది. అత్తయ్యా అమ్మగారు వస్తున్నారు అటు చూడండి అని చెప్పగానే గాయత్రి దేవిని చూసి తిలొత్తమ్మ షాక్‌ అవుతుంది.

గాయత్రి పాప వస్తుంది కదా? అంటూ సుమన ప్రశ్నించడంతో పక్కన గాయత్రి అమ్మ గారు కూడా ఉన్నారు చెల్లి అంటుంది నయని. విక్రాంత్‌ అమ్మా నిజంగానే పెద్దమ్మ వచ్చారా? అని అడుగుతాడు. భయంతో వచ్చార్రా..? అంటూ చెప్తుంది తిలొత్తమ్మ. ఈ అమ్మ టెన్షన్‌ పడుతుందంటే మా అమ్మ ఏదో చెప్పి ఉండాలి అంటాడు విశాల్‌. ఉదయం గాయత్రి పాప నిద్రమత్తులోకి జారుకోగానే ప్రయోగం పేరుతో చిన్నపిల్లను ఏం చేస్తారోనని వచ్చారంట బాబుగారు అంటుంది నయని.

మొన్న పాము కాటేసినప్పుడు రాలేదు కనీ ఈరోజు మా ఆయన ప్రయోగం చేస్త వచ్చారా? అత్తయ్యగారు అని సుమన అడుగుతుంది. దీంతో విష సర్పాల కన్నా ఎక్కువ విషం మనుషులలో ఉంది. నేను ఎప్పుడు నీ బిడ్డగా రావాలో అది విశాలాక్షి అమ్మగారికే తెలుసు నయని. ఇంకోసారి ఇలాంటి ప్రయోగం చేయకండి అని గాయత్రి దేవి చెప్తుంది. నయని ఇంకెలాంటి ఆలోచనలు చేయకు నీ ముందు ఉన్న కర్తవ్యం రెండు మణులను మానసాదేవి ఆలయానికి చేర్చటమే ఇదిగో భుజంగమణి తీసుకో అని ఇచ్చి వెళ్లిపోతుంది గాయత్రి దేవి.

తర్వాత నయని దగ్గరకు వచ్చిన విశాల్‌ పాప మీద ఉన్న నీ అనుమానాలు తీరిపోయినట్టేనా అని అడుగుతాడు. నాకు పాప మీద ఎలాంటి అనుమానాలు లేవని అయితే ఇప్పుడు నాకు ఇంకొక డౌట్‌ వచ్చింది బాబుగారు అని గాయత్రి అమ్మగారు భుజంగమణిని తీసుకొచ్చి నాకే ఎందుకు ఇచ్చారు. ఆ మణిని గాయత్రి అమ్మగారికి ఎవరు ఇచ్చారు. ఆ మణి ఎక్కడ పెట్టింది మీకు తప్పా ఎవరికి తెలియదు కదా? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో నయని నువ్వు ఇంత లోతుగా ఆలోచించాల్సిన పనిలేదు. ఒకరు ఇవ్వడం ఏంటి? అమ్మకు ఏది ఎక్కడుందో తెలియదా? ఏంటి? అంటాడు. తెలియదు ఆ చాన్స్‌ లేదు బాబు గారు అంటుంది నయని. మీకు తప్పా అది ఎక్కడుంది ఎవరికీ తెలియదు అంటూ అనుమానిస్తుంది నయని.

అందరూ హాల్లో కూర్చుని ఉండగా హాసిని పొడుపుకథ వేస్తుంది. ఎవరైనా విప్పండి అని చెప్తుంది. దీంతో అందరూ ఆలోచిస్తుంటారు. వల్లభ ఏంటి మమ్మీ అంటూ తిలొత్తమ్మను అడగగానే నాకు తెలియదు అంటుంది. ఇంతలో దురందర నయని చెప్తుంది అనుకుంటా? అనగానే ఇంతలో నయని చీమలబారు అంటూ పొడుపుకథ విప్పుతుంది. వల్లభ ఇంకోటి అడుగు అనగానే ఇంకో పొడుపుకథ అడుగుతుంది హాసిని. దీంతో వల్లభ ఆన్సర తెలియక ఆలోచిస్తుంటాడు. మళ్లీ నయనే ఆన్సర్‌ చేస్తుంది. ఇంతలో ఎవరో వల్లభ ఫోన్‌ చేసి తిడతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×