Anasuya: అనసూయ భరద్వాజ్(Anasuya Bhardwaj) పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వెండితెరపై సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ ఇప్పటికీ స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమానికి యాంకర్ గా కొనసాగుతున్న ఈమె ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. కెరియర్ పరంగా బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.
ప్రత్యేక పూజలు చేసిన అనసూయ..
తాజాగా రాఖీ పండుగ (Rakhi Festival) సందర్భంగా తన ఇంట్లో పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇందులో భాగంగా తన భర్త ఇద్దరు కొడుకులతో కలిసి ఈమె ఈ పూజలను నిర్వహించారని తెలుస్తోంది. ఈ ఫోటోలు చూస్తుంటే మాత్రం అనసూయ చాలా సాంప్రదాయబద్ధంగా ఈ వేడుక నిర్వహించారు. ఇక అనసూయ కూడా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నా జీవితం..నా ఇష్టం…
సాంప్రదాయపదంగా చీర కట్టుకొని ఈ పూజా కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ ఫోటోలపై స్పందిస్తూ సూపర్ అంటూ కామెంట్లు చేయగా మరికొతమంది అనసూయలో ఎంత మార్పు వచ్చింది ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా.. చాలా అద్భుతంగా, అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అనసూయ వస్త్రధారణ పై తరచూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ విమర్శల పై అనసూయ స్పందిస్తూ తనదైన స్టైల్ లోనే సమాధానాలు చెబుతూ ఉంటారు. తన జీవితం తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానని తన జీవితం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు అంటూ ఇటీవల కూడా అనసూయ తనను విమర్శించిన వారికి గట్టిగానే సమాధానం ఇచ్చారు.
ఇక ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల విషయంలో ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. ఇక ప్రస్తుతం ఈమె పలు సినిమా పనులలో బిజీగా ఉంటూనే షాపింగ్ మాల్స్ తదితర ఓపెనింగ్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తున్నారు. అయితే తన విషయంలో ఎవరైనా చెడుగా మాట్లాడిన అనసూయ మాత్రం తన ముందు ఎవరున్నారనే విషయాలను కూడా పట్టించుకోకుండా వారికి తనదైన స్టైల్ లోనే సమాధానం ఇస్తూ ఉంటారు. ఇటీవల ఏకంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకతాయిలు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని చెప్పు తెగుద్ది అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రస్తుతం ఈమె పెద్ది సినిమాలో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: Samantha: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ స్టెప్పులు వేయనున్న సమంత.. తగ్గట్లేదుగా?