BigTV English
Advertisement

Devara 2 : క్రేజీ అప్డేట్.. ‘దేవర 2’ షూటింగ్ అప్పటి నుంచేనా..?

Devara 2 : క్రేజీ అప్డేట్.. ‘దేవర 2’ షూటింగ్ అప్పటి నుంచేనా..?

Devara 2 : నందమూరి నటవారసుడు ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన మాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్‌.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ పాపులర్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు దేవరాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా వచ్చి 11 రోజులు అవుతున్నా కూడా సినిమాకు క్రేజ్ తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇక ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతున్న సంగతి తెలిసిందే.. మొదటి పార్ట్ సక్సెస్ అవ్వడంతో రెండో పార్ట్ పై ఆసక్తి పెరుగుతుంది. దేవర 2 పై సోషల్ మీడియాలో ఇప్పటికే ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. వాటికి చెక్ పెట్టేలా తాజాగా ఓ క్రేజ్ అప్డేట్ వచ్చేసింది. అదేంటంటే సినిమా షూటింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది.


దేవర పార్ట్ 2 షూటింగ్ 2025 అక్టోబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. పార్ట్ 1 కు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు రెండో పార్ట్ కు పనిచేయ్యారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కొత్త వాళ్లను దించేలా కొరటాల టీమ్ చూస్తున్నారని సమాచారం.. ఇక ఈ దేవర మూవీ సెప్టెంబర్ 27 న థియేటర్లలోకి వచ్చి సక్సెస్ ఫుల్ టాక్ ను అందుకుంది. ఇక 11 రోజులకు గాను రూ. 469 కోట్లకు పైగా గ్రాస్ ను రాబట్టింది. ఇక ఆ పార్ట్ లో సస్పెన్స్ వల్ల రెండో పార్ట్ పై ఆసక్తి నెలకొంది.. మరి ఎప్పుడు ఆ సినిమాను థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇక పాన్ ఇండియన్ మార్కెట్లో విపరీతమైన హైప్ సంపాదించుకున్న వారిలో ప్రభాస్ మొదటి స్థానంలో ఉంటే.. తర్వాత అల్లు అర్జున్ రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఈ లిస్టులో మూడో స్థానంలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2.. బాలీవుడ్ సినిమాలో నెగటివ్ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తారక్‌ తలపడనున్నాడు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే.. ఎన్టీఆర్ క్రేజ్ బాలీవుడ్‌లోనూ మరింతగా పెరుగుతుంది. ఇక ఈ సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో తారక్ మరో సినిమా చేయనున్నాడు. ఈ మూవీ పూర్తి అయ్యాక దేవర 2 సినిమాను చెయ్యనున్నారని సమాచారం. ఆ తర్వాత తమిళ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యనున్నాడని ఇండస్ట్రీలో టాక్..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×