E-Paper
Advertisement

Hyderabad Real Estate:- హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు నలుమూలల డిమాండ్.. ఎక్కడా తగ్గడం లేదుగా అసలు

Hyderabad Real Estate:- హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు నలుమూలల డిమాండ్.. ఎక్కడా తగ్గడం లేదుగా అసలు
Advertisement

Hyderabad Real Estate:- హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తిరుగులేని వృద్ధి నమోదు చేస్తోంది. ఫలానా ఏరియాకు మాత్రమే రియల్ ఎస్టేట్ పరిమితం కాలేదు. నగరం నలువైపులా సేమ్ డిమాండ్. కాస్త ప్రైస్‌లో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు గాని.. చేపడుతున్న ప్రాజెక్ట్స్.. అమ్ముడవుతున్న ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ విషయంలో మాత్రం అన్ని ఏరియాలు ఒకేలా కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్‌ జోన్‌లలో పాటు హైదరాబాద్ సెంట్రల్‌లోనూ ఒకే రకమైన వృద్ధి కనిపిస్తోంది.  మార్చి-2023లో హైదరాబాద్‌లో రూ. 3,352 కోట్ల విలువ చేసే ప్రాపర్టీల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. మొత్తం 6,414 అపార్ట్‌మెంట్లు రిజిస్టేషన్స్‌ అయ్యాయి.

Advertisement

తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి.. ఇవన్నీ వెస్ట్ హైదరాబాద్ కిందకు వస్తాయి. ఇక్కడ సప్లై అయిన ఇళ్ల విలువ 85 వేల కోట్లు. నైట్ ప్రాంక్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రాపర్టీ ధరలు 19 శాతం పెరిగాయి.

కొంపల్లి, సైనిక్‌పురి, పోచారం, బాచుపల్లి, మియాపూర్‌.. ఈ ఏరియాలు నార్త్ హైదరాబాద్ కిందకు వస్తాయి. ఇక్కడ సరఫరా అయిన ఇళ్ల విలువ 26 వేల కోట్లు. ఇక్కడ కూడా గతేడాదితో పోల్చితే  ప్రాపర్టీ ధరల 22 శాతం పెరిగాయి.

Advertisement

రాజేంద్రనగర్, మహేశ్వరం, శంషాబాద్, ఆదిభట్ల, షాద్‌నగర్‌… ఇవన్నీ సౌత్ హైదరాబాద్ కిందకు వస్తాయి. ఇక్కడ సరఫరా అయిన గృహాల విలువ 3,400 కోట్ల రూపాయలు. ఈ
సౌత్ హైదరాబాద్‌లో ప్రాపర్టీ ధరలు 20 శాతం పెరిగాయని నైట్ ఫ్రాంక్ సంస్థ తెలిపింది.

ఇక ఈస్ట్ హైదరాబాద్. ఈ రీజియన్‌లోని మెయిన్ ఏరియాలు.. ఉప్పల్, ఘట్‌కేసర్, హబ్సిగూడ, నాగోల్, ఎల్బీనగర్‌. ఇక్కడ సప్లై అయిన ఇళ్ల విలువ 3,200 కోట్లు. ఈ ఏరియాలో  ప్రాపర్టీ ధరలు 20 శాతం వృద్ధి చెందాయి.

ఇక సెంట్రల్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లోనూ జోరు కనిపించింది. ముఖ్యంగా అమీర్‌పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, మెహిదీపట్నంలో ఇళ్ల కొనుగోళ్లు పెరిగాయి. ఇక్కడ సరఫరా అయిన గృహాల విలువ 2,200 కోట్లు. గతేడాదితో పోల్చితే.. ప్రాపర్టీ ధరలు 20 శాతం పెరిగాయి. 

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×