Scientific Reasons Behind on Flagpole Planted in Temples: మనం దేవాలయాలకు వెళ్తుంటాం. వెళ్లినప్పుడు ప్రదక్షిణలు చేసి, పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటాం. ఆ తరువాత కొద్ది సేపు అక్కడ కూర్చుని వస్తుంటాం. ఎందుకంటే అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కూర్చోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఆ సమయంలో ఎటువంటి అంశం మన మనసును దరిచేరదంటారు. అంతేకాదు.. ఆ దేవాలయాలను పరిశీలించగా పలు నిర్మాణాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. ఒక్కో దేవాలయంలో ఒక్కో ప్రత్యేకత కనిపిస్తుంటాయి. వాటిని లోతుగా విశ్లేసిస్తే ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని చెబుతుంటారు.
మరి ఏ దేవాలయానికి వెళ్లినా కూడా మనకు ధ్వజస్తంభం మాత్రం ఖచ్చితంగా దర్శనమిస్తుంటది. ఇది ఓ ప్రత్యేక ఆకారంలో కనిపిస్తుంటది.. అంతేకాదు చాలా ఎత్తులో ఉంటుంది. ఒక్కో చోట అయితే ఆలయం కంటే ఎత్తులో ఉంటుంది. అదేవిధంగా ఇంకొన్ని దేవాలయాల్లో ఆలయ గోపురాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వాటిని ఎత్తులో నిర్మిస్తారు. ఆ గోపురం పైన ఉన్నటువంటి కలశాలలు ప్రత్యేకంగా ఉంటాయి. వీటిని చూసినప్పుడు మనకు ప్రత్యేక ఆకర్శణగా కనిపిస్తుంటాయి. అయితే, వీటి వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందంటా. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎత్తైన కట్టడాలు, సెల్ ఫోన్ టవర్స్ లలో లైటెనింగ్ అరెస్టెర్స్ అనే రాడ్స్ ను అమరుస్తారు. అవి ముఖ్యంగా రాగితో తయారుచేయబడుతుంటాయి. వాటిని ఎందుకు అమరుస్తారంటే.. అవి పిడుగులను శోసించుకుంటాయి. ఇతర ప్రమాదాల బారి నుంచి కూడా టవర్స్, కట్టడాలను తప్పిస్తాయి. అందుకే వాటిని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారంటా.
Also Read: ప్రతి రోజూ ఈ పనులు చేస్తే మీ పూర్వీకుల ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి
ఇదేమాదిరిగా కూడా ఎత్తైన గోపురాలపైన కలశాలను అమరుస్తారు. వాటిని రాగి లేదా బంగారం లేదా కంచుతో తయారు చేస్తారు. ఇవి పిడుగులను శోసించుకుంటాయి. అదేవిధంగా ధ్వజస్తంభాలను కర్రతోనూ, రాయితోనో చేసినప్పటికీ వాటిపై కూడా రాగి కంచు పూత ఉంటుంది. దీంతో అవి పిడుగులను ఆకర్శిస్తాయి. అందువల్ల వాటిని ఆలయాల కంటే కూడా ఎత్తులో ఏర్పాటు చేస్తారు. పిడుగులు లేదా ఇతర ప్రమాదాలు వచ్చినప్పుడు ఆలయాలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అంతేకాదు ఆలయ చుట్టుపక్కల కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుందంటా. అందుకే వీటిని ఎత్తులో ఏర్పాటు చేస్తుంటారని చెబుతుంటారు.