BigTV English
Advertisement

Viral Video : ఇతడి పోకిరీ డ్యాన్స్ చూస్తే.. మహేశ్‌బాబుకే మైండ్ బ్లాక్

Viral Video : ఇతడి పోకిరీ డ్యాన్స్ చూస్తే.. మహేశ్‌బాబుకే మైండ్ బ్లాక్

Viral Video : కొన్ని వీడియోలు కిరాక్ ఉంటాయి. వాటిని చూస్తుంటే పడి పడి నవ్వాల్సిందే. ఎక్కడా దొరకవు అలాంటి అలాంటి వీడియోలు. మట్టిలో మాణిక్యాలు టైప్. చాలా నాచురల్‌గా తీస్తారు. ఆ టైమ్‌లో అది అంత పాపులర్ అవుతుందని వాళ్లకు కూడా తెలీదు. కావాలని తీసే వీడియోలు కావవి. అనుకోకుండా అలా వైరల్ అయిపోతాయి. ఓవర్ నైట్ ట్రెండింగ్‌లో వచ్చేస్తుంది. అలాంటిదే లేటెస్ట్‌గా.. ఓ పాత వీడియో కొత్తగా వైరల్ అవుతోంది.


డ్యాన్స్ అంటే ఢీ ప్రోగ్రామే. కిరాక్ డ్యాన్సులు చేస్తుంటారు అందులో. మరీ, అంతలా కాకుండా ప్రతీ ఒక్కరిలో హిడెన్ టాలెంట్ ఉంటుంది. మంచి పాట విన్పప్పుడు, మంచి మూడ్‌లో ఉన్నప్పుడు.. మనలోని డ్యాన్సర్ తన్నుకుంటూ బయటకు వస్తుంటాడు. పెళ్లి వేడుకల్లో, సంగీత్‌లో, ఊరేగింపులో.. అందరూ డ్యాన్సర్లే. ఇక మందేసినాక చిందేయడం మస్ట్. తాగుబోతుల డ్యాన్స్ అయితే చూసి తీరాల్సిందే. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొడుతుంటాయి. లేటెస్ట్‌గా ఓ వేడుకలో ఒకతను చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది.

పాత వీడియోనే అది. పోకిరీ మూవీలో “చూడొద్దు అంటున్నా చూస్తూనే ఉన్నా” సాంగ్‌కు మస్త్ డ్యాన్స్ చేశాడు ఒకతను. డ్యాన్స్‌ చేస్తూనే స్టైల్‌గా టచ్ జగదీష్ మాదిరి ఇన్‌షర్ట్ చేశాడు. ఆ సీన్ అదిరిపోయింది. ఆ తర్వాత స్టెప్పులు సైతం కేకో కేక. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే మరో రేంజ్‌లో. చాలా సీరియస్‌గా చేశాడు డ్యాన్స్. ఎక్కడా లైట్ తీసుకోలేదు. కాంప్రమైజ్ కాలేదు. పోకిరీలో మహేశ్‌బాబు అయినా ఇంతటి కమిట్‌మెంట్‌తో డ్యాన్స్ చేశాడో లేదో అనిపించేలా ఇరగదీశాడు. 2 నిమిషాల పాటు అవుట్ అండ్ అవుట్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.


అప్పటి దాకా తనలో తాను లీనమై పోయి డ్యాన్స్ చేసిన ఆ యువకుడు అంతలోనే కాస్త తేరుకున్నాడు. తాను వచ్చింది ఓ పెళ్లి రిసెప్షన్‌కు కాబట్టి.. వధూవరులను ఆశీర్వదించాలని భావించాడు. డ్యాన్స్ చేసుకుంటూనే స్టేజీ దగ్గరికి వెళ్లాడు. అప్పటికే సోఫాలో కూర్చొని ఉన్నారు కొత్త జంట. వాళ్లు ఇతన్ని పట్టించుకోలేదు. కానీ, ఇతను మాత్రం వాళ్లను బాగా పట్టించుకున్నాడు. గట్టిగా దీవించేయాలని మైండ్‌లో ఫిక్స్ అయ్యారు. స్టేజీపై కిందపడి ఉన్న పువ్వులను తీసుకున్నాడు. డ్యాన్స్ స్టెప్ వేస్తూనే ఆ ఫ్లవర్స్ వాళ్లపై చల్లాడు. చల్లగా ఉండమంటూ తనదైన స్టైల్‌లో దీవించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ డ్యాన్స్ మీరూ చూసేయండి….

Related News

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Mike Tyson: గొరిల్లాతో ఆ పని చేయడానికి ఏకంగా రూ.9 లక్షలు చెల్లించిన మైక్ టైసన్, చివరికి..

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Big Stories

×