Jammu Kashmir Vande Bharat Express: దేశానికి తలమాణికం అయిన జమ్మూకాశ్మీర్ కు, దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే గత కొద్ది నెలల క్రితం జమ్మూ రైల్వే డివిజన్ ను ఏర్పాటు చేయగా, తాజాగా ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మార్గంలో అత్యాధునిక వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. USBRL ప్రాజెక్టులో కీలక భాగాలు అయిన ప్రపంపంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జితో పాటు దేశంలోనే తొలి కేబుల్ బ్రిడ్జి అంజిఖాడ్ వంతెనను ఓపెన్ చేశారు. కాశ్మీర్ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కలను ప్రధాని మోడీ నెరవేర్చారు.
జమ్మూకాశ్మీర్ కోసం ప్రత్యేక వందేభారత్ రైళ్లు
ఇక జమ్మూ-కాశ్మీర్ మధ్య సర్వీసుల కోసం ప్రత్యేకంగా వందేభారత్ రైళ్లను రూపొందించారు. ఇందుకోసం మూడు కొత్త రేక్ లను రూపొందించారు. ఈ రూట్ లో నడిచే స్పెషల్ ట్రైన్ సెట్లను కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) తయారు చేసింది. ఈ ట్రైన్ సెట్లు ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ లో సేవలను అందిస్తాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు ఆయా రూట్లలో ఏకంగా 136 వందేభారత్ రైళ్లు తమ సర్వీసులను అందిస్తున్నాయి. ఆ రైళ్లతో పోల్చితే జమ్మూకాశ్మీర్ లో నడిచే వందేభారత్ రైలు అనేక అదనపు ఫీచర్లను కలిగి ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
కాశ్మీర్ వాతావరణ పరిస్థితులను అనుగుణంగా
జమ్మూకాశ్మీర్ లోని ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని ప్రయాణించేలా ఈ సరికొత్త వందేభారత్ రైళ్లను రూపొందించారు. చల్లటి వాతావరణంలోనూ ప్యాసింజర్లు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వీటిలో వాటర్ ట్యాంక్, బయో-టాయిలెట్ ట్యాంక్ లను గడ్డకట్టకుండా నిరోధించే వ్యవస్థను కలిగి ఉంటాయి. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలోనూ సాఫీగా పని చేసేలా ఎయిర్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. ఇక విండ్‌షీల్డ్ లో హీటింగ్ ఎలిమెంట్లను పొందుపర్చారు. దీని ద్వారా లోకో పైలెట్లకు శీతాకాల సమయంలోనూ ముందు భాగం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక వందేభారత్ రైల్లో ప్రత్యేక అదనపు ఫీచర్లు ఉన్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, ఆటోమేటిక్ ప్లగ్ డోర్లు, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు అందుబాటులో ఉన్నాయి. బయట గడ్డకట్టే చలి ఉన్నా, కోచ్ లను వెచ్చగా ఉంచడానికి అధిక సామర్థ్యం గల ఏసీ యూనిట్ (RMPU) కూడా ఏర్పాటు చేశారు.
PM Sh @narendramodi flags-off #VandeBharat Trains from Shri Mata Vaishno Devi #Katra Railway Station#JammuAndKashmir#USBRL #ViksitBharat #ConnectingIndia #ViksitBharatViksitJammuKashmir#VikasKiRail #VandeBharat #JammuKashmir #ValleyViaRail #Train2Kashmir #ConnectingKashmir… pic.twitter.com/uyObYnNoaD
— Information & PR, J&K (@diprjk) June 6, 2025
కాశ్మీర్ లో పర్యాటక రంగానికి మరింత బూస్టింగ్
వందేభారత్ రైళ్ల ప్రారంభంతో కాశ్మీర్ లోయకు రైల్వే కనెక్టివిటీ మరింత పెరిగనుంది. జమ్మాకాశ్మీర్ లో పర్యాటక అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించనుంది. రైల్వే, రోడ్డు రవాణాతో పాటు జమ్మూకాశ్మీర్ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ప్రధాని మోడీ వెల్లడించారు. జమ్మూకాశ్మీర్ పర్యటనలతో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, యువతీ యువకులకు విద్యా, ఉపాధి అవకాశాలు పెంచనున్నట్లు తెలిపారు.
Read Also: తొలి కాశ్మీర్ కు రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జికి మోడీ పచ్చ జెండా!