BigTV English

Manchu Vishnu : అసమర్దుడిని పెట్టుకున్నా.. అందుకే విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ కామెంట్స్..

Manchu Vishnu : అసమర్దుడిని పెట్టుకున్నా.. అందుకే విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ కామెంట్స్..

Manchu Vishnu : టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ఆయన డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అదిగో, ఇదిగో అంటున్నారు తప్ప రిలీజ్ డేట్ ను ఫిక్స్ చెయ్యలేదు. గతంలో రెండు సార్లు కన్నప్ప వాయిదా పడింది. ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండటంతో సినీ అభిమానులు సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మొన్నటివరకు ఈ మూవీ హార్డ్ డిస్క్ మాయం అంటూ పుకార్లు వినిపించాయి.. అది ఇంకా తేలలేదు కానీ.. తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను షేర్ చేశారు.. సినిమా డిలే అవ్వడానికి కారణం చెప్పాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.


అతని వల్లే సినిమా వాయిదా పడింది..? 

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు కన్నప్ప మూవీ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేశాడు. కన్నప్ప షూటింగ్ ఎప్పుడో మొదలైంది కదా మరి విడుదల ఎందుకు వాయిదా పడింది అని యాంకర్ అడగ్గా.. దానికి విష్ణు సమాధానం చెప్తూ.. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను. వీఎఫ్ఎక్స్ కోసం ఒక అసమర్దుడిని పెట్టుకున్నా వాడి వల్లే సినిమా గత ఏడాదిలో రిలీజ్ రిలీజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ అయ్యింది. ఈ మూవీ విషయంలో నేను చేసిన అతి పెద్ద మిస్టేక్ ఇదే.. ఇలాంటి తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటాను విష్ణు అన్నారు. మొన్న హార్డ్ డిస్క్ మాయం అన్నారు.. ఇప్పుడేమో ఇలా అనడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మూవీ ఇప్పటిలో విడుదల అవుతుందా? లేదా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరి మంచు విష్ణు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..


Also Read :ఇమ్మానుయేల్‌ పంట పండిందిరోయ్..కరువులో ఉన్న శేఖర్ మాస్టర్..!

‘కన్నప్ప’ మూవీ..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు గా ఈ మూవీ రాబోతుంది.. గతకొద్ది రోజులుగా ఈ మూవీ వార్తల్లో నిలుస్తుందన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మించగా, ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు తన పిల్లలు కూడా నటించారు. అంతేకాదు మోహన్ బాబు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ వంటి వారందరూ కూడా భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఈ స్టార్ సెలబ్రిటీలందరూ ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ మూవీ 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి మూవీ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందేమో చూడాలి…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×