BigTV English

Funny Video: అమ్మ కొడితే ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు.. చివరకు..

Funny Video: అమ్మ కొడితే ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నాడు.. చివరకు..

Funny Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అందులో ముఖ్యంగా ఫన్నీ వీడియోలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎప్పుడూ చూసినా ఏదో ఒక ఫన్నీ వీడియోలు నెటిజన్లకు ఆకర్షిస్తూనే ఉంటాయి. వివిధ రకాల ఫన్నీ వీడియోలు చేస్తూ మంచి ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకుంటారు ఇన్ల్పుయెన్సర్లు. అయితే తాజాగా ఓ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో, ఒక ట్రైనర్ ఇంట్లో తల్లి కొట్టకుండా ఎలా ఉండాలో నెర్పిస్తుంటాడు. ఈ క్రమంలో అతడి తల్లి అక్కడికి వచ్చి ట్రైనర్ పైనే చేయి చేసుకుంటుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు.


ట్రైనర్‌నే కొట్టిన తల్లి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఇంట్లో తల్లి కొట్టడం నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో ఒక వ్యక్తి ఇతరులకు శిక్షణ ఇస్తున్నాడు. ఈ తరుణంలో మరో వ్యక్తి ట్రైనర్ చెప్పిన తీరుకు ఎదురుగా తల్లి గెటప్‌లో ఉండి వీడియోలో కనిపించాడు. ఈ తరుణంలో ట్రైనర్ తల్లి సంఘటనా స్థలానికి వస్తుంది. ట్రైనర్‌ చెప్పుతో కొడితే ఎలా తప్పించుకోవాలో నేర్పిస్తుండడం చూసి అతడిని తన చెప్పు తీసి కొట్టడం ప్రారంభిస్తుంది. అతను తప్పించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు.. కానీ తన తల్లి కొట్టిన దెబ్బల నుండి తనను తాను రక్షించుకోలేకపోయాడు.


దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చేస్తే తల్లులు ఇలాగే రియాక్ట్ అవుతారు అని వారు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా తయారు చేస్తారా? అస్సలు ఊహించి ఉండరు!

Virus to Rabbits: కుందేళ్లకు కొమ్ములా.. బాబోయ్ ఇదెక్కడి విడ్డూరం?

Loco pilot Viral Video: క్షణం ఆగి జెండాకు సెల్యూట్.. లోకో పైలట్ వీడియో వైరల్!

Maneka Gandhi Sister: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Dogs Day Celebrations: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

Viral video: బస్సును నడుపుతున్న యువతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Big Stories

×