Kerala Floods: కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఓ పక్క భారీ వర్షానికి కొండ చరియల విరిగి పడుతూ మరో పక్క జోరుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం అలర్ట్ అయి హెచ్చరికలు సైతం జారీ చేసింది. అయితే భారీ వర్షాకు లోతట్టు ప్రాంతంలో నదులు పొంగిపొర్లుతున్న వేల ఓ యువకుడు నదిలో జీపు నడుపుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియో చూసి కొందరు ప్రశంసిస్తుంటే మరికొంత మంది నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా పాలా అనే ప్రాంతంలో భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో రహదారులేవి అక్కడ కనిపించడం లేదు. దీంతో జలమయమైన రహదారిపై మహీంద్రా థార్ జీపుతో వరద నీటిలో నుండే కొందరు ప్రయాణం చేశారు. దీంతో ఆదృష్యాలు రికార్డుల చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
Also Read: తెలంగాణ సచివాలయంలో షాడో ల దందా కలకలం!
కేరళలోని పాలా పట్టణ పరిధిలో పూర్తిగా నీటితో నిండిపోయన రోడ్డుపై జీపు సగానికి పైగా వరద నీటిలో మునిగిపోయింది. వాస్తవానికి ఇది ప్రమాదకరం అయినప్పటికీ డ్రైవర్ ఏమాత్రం వెనకడుగు వేయకుండా అలాగే నదిలోనుండి నడుపుతూ ప్రమాదకరంగా ముందుకు సాగాడు. నీటిలోనే జీపును బ్యాలెన్స్ చేస్తూ కొంత మందిని కారులో ఎక్కించుకొని సురక్షితంగా నది దాటాడు. ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు ప్రశంసిస్తుంటే మరికొంత మంది తిడుతున్నారు. ఒక వేల తార్ కారు సైలెన్సర్‌లోకి నీరు వెల్లి ఉంటే జీపు ఆగిపోయి చాలా పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు. మరికొంత మంది వావ్ బలే డ్రైవింగ్ ఇదో సాహోసేపేతమైన పని అంటూ పొగుడుతున్నారు. ఎదేమైన ఈ వీడియో చూసిన నెటిజన్లు వారికి నచ్చినట్టుగా కామెంట్ చేస్తున్నారు.
Also read: క్షుద్రపూజల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న తెలంగాణ.. అజ్ఞాన ప్రదర్శనలో బిజీగా రెండు పార్టీలు!