Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో దాడులు, హత్యలు, ఘర్షణలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా వైద్యులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. డాక్టర్లు ప్రాణాలను రక్షించే దేవుళ్లు అంటారు. అలాంటి వారిపై ఇటీవల చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇటీవల ఓ డాక్టర్ పై అత్యాచారం జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ డాక్టర్ పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
డాక్టర్ అని కూడా ఆలోచించకుండా కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. సాధారణంగా ఆసుపత్రిలోకి వెళ్లాలంటే చెప్పులను బయట విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే హాస్పిటల్ లో పేషేంట్స్ ఉంటారు. కాబట్టి పరిశుభ్రత పాటించాలని డాక్టర్లు చెబుతుంటారు. అయితే తాజాగా ఓ ఆసుపత్రిలో మాత్రం డాక్టర్ చెప్పులు బయట విడిచిపెట్టి రావాలని చెప్పినందుకు కొందరు వ్యక్తులు దాడికి దిగారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఘటన గుజరాత్ లోని భావ్ నగర్ లో వెలుగుచూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆసుపత్రిలో వ్యక్తులు చెప్పులు వేసుకుని రావడం చూసి చెప్పులు బయట విడిచిపెట్టాలని డాక్టర్ సూచించాడు. దీంతో ముగ్గురు వ్యక్తులు డాక్టర్ పై దాడికి దిగారు. దీంతో ఆ ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఎమర్జెన్సీ వార్డులో వెలుగుచూసింది. సీసీటీవీ కెమెరాలో ఓ మహిళ బెడ్ పై పడుకుని ఉండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. డాక్టర్ జైదీప్ సింగ్ గోహిల్ అని పేషెంట్ తరపు వారు చెప్పులతో రావడంతో అలా రావద్దని చెప్పగా తనపై దాడికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపారు. ఈ దాడి జరుగుతున్న క్రమంలో నర్సు, పేషెంట్ కూడా ఆపాలని ప్రయత్నించారు. అయినా కూడా ఆ వ్యక్తులు మాత్రం డాక్టర్ పై దాడికి పాల్పడుతూనే ఉన్నారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Young Doctor assaulted at Sihor hospital in #Bhavnagar district;
Altercation erupts over removing shoes.
A verbal altercation turned violent when relatives of a female patient were instructed to remove their footwear before entering the emergency ward.”#MedTwitter @JPNadda pic.twitter.com/b91PU6eECD— Indian Doctor🇮🇳 (@Indian__doctor) September 16, 2024