BigTV English

Viral Video: ప్రాంక్ చేయాలని చూసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

Viral Video: ప్రాంక్ చేయాలని చూసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు..

Viral Video: డ్యాన్స్, స్టంట్స్, జుగాడ్ వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. చాలా మంది తెలియని వ్యక్తులపై ప్రాంక్ చేయాలని చూస్తుంటారు. ఇలాంటి తరుణంలో జోక్స్ చేయడం, ఏడిపించడం, భయపెట్టడం వంటివి చేసి వీడియోలు చేసి చివరికి అవేవి నిజం కావని, ప్రాంక్ అంటూ రివీల్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు కొంతమందిని నవ్వించినా, మరికొంత మందిని మాత్రం కోపానికి గురిచేస్తుంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వారిపై ప్రాంక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ తరుణంలో తాను ప్రాంక్ చేసిన వ్యక్తి కోపానికి గురై ఏకంగా దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న వారితో సరదాగా ప్రాంక్ చేస్తున్నాడు. అందరి దగ్గరికి వెళ్లి అందరి చెవిలో స్ప్రే కొడుతుంటాడు. ఈ క్రమంలో చాలా మందిపై ప్రాంక్ చేసిన అంనతరం నది ఒడ్డున నిర్మించిన వంతెనపై నిలబడి ఉన్న వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తి హాయిగా నిలబడి నదివైపు చూస్తున్నాడు. ఇంతలో చిలిపి పని చేస్తున్న వ్యక్తి చెవుల్లో స్ప్రే కొట్టాడు. శబ్దం అతని చెవులకు చేరడంతో, వ్యక్తి భయపడి, అతనిపై దాడి చేశాడు. అంతేకాదు ఆ వ్యక్తి అతడిని పక్కనే ఉన్న నదిలో తీసి విసిరేశాడు.

దీంతో ఆ వ్యక్తి నదిలో పడిపోయిన దృశ్యం కూడా వీడియోలో కనిపించింది. దీంతో దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఆ వ్యక్తికి సరైన గుణపాఠం చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన ఎవరైనా ఇంకోసారి ఇలాంటి వెదవ వేశాలు వేయరని మండిపడుతున్నారు. ఈ వీడియో నెట్టింట్ హల్ చల్ చేస్తుంది.


Related News

Viral Video: ఆహా.. తందూరి రోటీలో బల్లి.. దోరగా వేగిపోయి.. కస్టమర్‌కు షాక్!

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Big Stories

×