BigTV English

Women Fell Down from 3rd Floor: ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ మూడవ అంతస్తు నుండి పడిపోయిన యువతి..!

Women Fell Down from 3rd Floor: ట్రెడ్‌మిల్‌పై నడుస్తూ మూడవ అంతస్తు నుండి పడిపోయిన యువతి..!

Women Fell Down from 3rd Floor: ప్రస్తుత కాలంలో జీవనశైలి మారుతుంది. దీంతో తింటున్న ప్రతీ ఆహారం కలుషితంగానే ఉంటుంది. దీంతో బరువు పెరగడం, ఊబకాయం వంటి రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం పాటు ఇంట్లోనే జీవనం కొనసాగించిన కారణంగా చాలా మంది బరువు పెరిగారు. మరికొంత మంది యోగా వంటి ఆసనాలు వేస్తూ బరువు తగ్గడం వంటివి చేశారు. అయితే ఈ తరుణంలో బరువు తగ్గేందుకు ప్రస్తుతం యువత కసరత్తులు చేస్తోంది.


బరువు తగ్గాలని జిమ్ ల వెంట తిరుగుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరు జిమ్ లకు వెళ్లి బాడీ పెంచుకోవడం లేదా, బరువు తగ్గడం వంటి పనులు చేస్తున్నారు. అయితే తాజాగా జిమ్ లో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మూడవ అంతస్తులోని కిటికీకి సమీపంలో అమర్చిన ట్రెడ్‌మిల్‌పై 22 ఏళ్ల అమ్మాయి నడుస్తోంది. అయితే అక్కడ ఒక్కసారిగా ఏమైందో తెలీదు. యువతి హఠాత్తున కిటికీ నుంచి బయటపడింది. అయితే ట్రెడ్ మిల్ పై నడుస్తున్న యువతి ఉన్నట్టుండి తన వెనకాలే ఉన్న కిటీకీలోంచి బయటపడిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ఇండోనేషియాలో వెలుగుచూసింది. ఇక్కడ జిమ్‌లోని మూడవ అంతస్తులో ఉన్న మహిళ ట్రెడ్‌మిల్ నుండి జారిపడి కిటికీలోంచి పడిపోవడంతో దారుణంగా మరణించింది. 22 ఏళ్ల అమ్మాయి తన ముఖాన్ని టవల్‌తో తుడవడానికి ముందు ట్రెడ్‌మిల్‌పై నడుస్తున్నట్లు వీడియోలో కనిపించింది. దీని తర్వాత వెంటనే ఆమె తన బ్యాలెన్స్ కోల్పోవడంతో వెనుక ఉన్న ఓపెన్ విండో నుండి బయటకు పడిపోయింది. వీడియోలో, అమ్మాయి పడిపోకుండా ఉండటానికి విండో ఫ్రేమ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చివరకు ఫలితం లేకుండా పోయింది. కింద పడిన యువతి తలకు బలమైన గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించిందని తెలిపారు.


Also Read: Anant Ambani Wedding Card: అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు చూస్తే వావ్ అనాల్సిందే.. ఓపెన్ చేయగానే!

ప్రియుడితో కలిసి జిమ్‌కి..

యువతి తలపై అనేక గాయాలు ఉన్నాయని పోస్టుమార్టంలో తేలింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం, బాధితురాలు తన ప్రియుడితో కలిసి జిమ్‌కు వచ్చింది. అతను రెండవ అంతస్తులో పని చేస్తున్నాడు. ఆమె పడిపోయిన ట్రెడ్‌మిల్ మరియు కిటికీ మధ్య దూరం కేవలం 60 సెంటీమీటర్లు మాత్రమేనని దర్యాప్తులో తేలింది. కిటికీ దగ్గర ట్రెడ్‌మిల్ ఉంచడం ప్రమాదకరమని పోలీసులు తెలిపారు. పాంటియానాక్ పోలీస్ కమీషనర్ ఆంటోనియస్ ట్రయాస్ కుంకురోజాతి మాట్లాడుతూ, ‘ట్రెడ్‌మిల్‌పై ఎవరైనా బ్యాలెన్స్ కోల్పోయి, ఆపై కిటికీలోంచి పడటం చాలా సులభం.’ అని అన్నారు. కాగా, ఈ ఘటన తర్వాత మూడు రోజుల పాటు జిమ్ మూతపడింది.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×