E-Paper
Advertisement

Viral Video: కుమారుడు ప్రాణాలు అంటే లెక్కలేదా..? అలా ఎలా చేస్తారు..?

Viral Video: కుమారుడు ప్రాణాలు అంటే లెక్కలేదా..? అలా ఎలా చేస్తారు..?
Advertisement

Viral Video: ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం కొత్తేమీ కాదు. ఆఫీస్ కు లేట్ అవుతుందనో, అత్యవసర పని కారణంగానో మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో తప్పుకుండా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే ఉంటాం. కానీ ప్రస్తుతం బెంగుళూరులో ఓ జంట ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన విధానం చూసి పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారు ఏం చేశారంటే..

సాధారణంగా స్కూటీపై ఇద్దరి వ్యక్తుల మధ్య ఓ చిన్నారిని కూర్చోబెట్టడం మనం చూస్తూ ఉంటాం. అయితే అందుకు భిన్నంగా బెంగుళూరు నగరంలోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో ఫుల్ ట్రాఫిక్ మధ్య స్కూటీపై వెళుతున్న దంపతులు తమ కొడుకుని ఫుట్ రెస్ట్ పై నిలబెట్టగా.. మహిళ బాలుడిని చేతితో పట్టుకుంది. అదే మార్గంలో వెళుతున్న మరో ప్రయాణికుడు ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Viral Video

ఈ వీడియో ఏప్రిల్ 15న ట్విటర్ లో పోస్టు చేయగా.. దీన్ని చూస్తున్న నెటిజన్లు దంపతుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

కదులుతున్న స్కూటర్ పై అలా ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ వెళ్లడం చాలా ప్రమాదకరమని.. చిన్న పొరపాటు జరిగినా బాలుడి ప్రాణానికే ప్రమాదం జరిగేదని అంటున్నారు. ఈ వీడియోను చూసిన బెంగుళూరు పోలీసులు సైతం ఈ అంశంపై స్పందించారు. ఆ దంపతులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Also Read: ఓరి నీ వేశాలు.. తలపై టపాసులు పెట్టుకుని డ్యాన్స్.. వీడియో వైరల్

భద్రత కంటే వినోదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు చాలామంది. ఇలాంటి సంఘటనలు అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.ఇటీవల న్యూ ఢిల్లీలో ఓ యువకుడు మొబైల్ లో గేమ్ ఆడుతూ బైక్ నడిపిన వీడియో కూడా వైరల్‌ అయ్యింది.యువకుడు రెండు చేతులతో గేమ్ ఆడుతూ తన కాళ్లతోనే బైక్ ను హాండిల్ చేశాడు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×