BigTV English

AAP Ka RamRajya: ఎంపీ ఎన్నికలే టార్గెట్.. ‘ఆప్ కా రామరాజ్య’ వైబ్‌సైట్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ

AAP Ka RamRajya: ఎంపీ ఎన్నికలే టార్గెట్.. ‘ఆప్ కా రామరాజ్య’ వైబ్‌సైట్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ

AAP Ka RamRajya: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో ఒక్కసారిగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ‘ఆప్ కా రామరాజ్య’ అనే వైబ్ సైట్ ను ఆప్ ప్రారంభించింది.


లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తులు చేస్తోంది. దీనిలో భాగంగా ‘ఆప్ కా రామరాజ్య’ అనే ప్రత్యేక వైబ్ సైట్ ను ప్రారంభించింది. రాముడి ఆదర్శాలను సాకారం చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ చాలా ప్రయత్నాలు చేసేరని ఆప్ నేతలు వెల్లడించారు.

AAP Ka RamRajya
AAP Ka RamRajya

ఆప్ నేతలు సంజయ్ సింగ్, అతిషి, సౌరభ్ భరద్వాజ్, జాస్మిన్ షాలు కలిసి ఢిల్లీలో ‘ఆప్ కా రామరాజ్య’ వైబ్ సైట్ ను శ్రీరాము నవమి రోజున ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ఆప్ ప్రభుత్వం రామరాజ్యం భావనలతో పనిచేస్తోందని వారు తెలిపారు. ఢిల్లీలో రామరాజ్యాన్ని స్థాపించడం కోసం సీఎం అరవింద్ కేజ్రీవాల్ గత పదేళ్లలో ఎంతగానే కృషి చేసి.. అద్భుత విజయాలు సాధించారని పేర్కొన్నారు.


రామరాజ్యం సాకారంలో భాగంగానే ఢిల్లీలో పాఠశాలల ఆధునీకరణ, మొహల్లా క్లినిక్ లు, ఉచిత తాగు నీరు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి ఎన్నో పథకాలను కేజ్రీవాల్ ప్రవేశపెట్టారని వెల్లడించారు. అలాంటి సీఎంను బీజేపీ తప్పుడు కేసుల్లో అరెస్ట్ చేసిందని ఆరోపించారు.

Also Read: రామ నవమి రోజు అల్లర్లు సృష్టించే కుట్ర జరుగుతోంది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..

సీఎం అరవింద్ కేజ్రీవాల్ శ్రీరామ నవమి రోజున ప్రజలకు అందుబాటులో లేకపోవడం ఇదే మొదటిసారి అనే ఆప్ నేతలు తెలిపారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడంతోనే ఇలా జరిగిందని విచారం వ్యక్తం చేశారు. తప్పుడు ఆధారాలు, తప్పుడు సాక్షుల వాగ్మూలం ఆధారంగా చేసుకుని కేంద్రం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపిందని మండిపడ్డారు.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×