E-Paper
Advertisement

Viral Video: ఓరి నీ వేశాలు.. తలపై టపాసులు పెట్టుకుని డ్యాన్స్.. వీడియో వైరల్

Viral Video: ఓరి నీ వేశాలు.. తలపై టపాసులు పెట్టుకుని డ్యాన్స్.. వీడియో వైరల్
Advertisement

 

Viral Video: పిచ్చి పలు రకాలు అంటారు. ఒక్కోక్కరికి ఒక్కో రకమైన పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి. ఏదో చేద్దాం అని చూస్తే మరేదో అవుతుంది. అలాంటి ఘటనలు తరచూ చాలానే చూస్తుంటాం. అయితే ఇలా ఎన్ని ఘటనలు చూసినా కూడా కొంతమంది మాత్రం సోషల్ మీడియా ఫేమ్ కోసమో లేక ఇంకెదానికో చేసే పనులు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటిదే ఓ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఏంటి ఆ ఘటన ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఓ వ్యక్తి తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ప్రవర్తించాడు. పెళ్లి భరాత్ లో భాగంగా ఓ వ్యక్తి చేసిన పని నెట్టింట విమర్శలకు దారి తీసింది. ఓ వైపు పెళ్లి భరాత్ జరుగుతుండగా యువకులు అంతా పాటలకు డ్యాన్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి భరాత్ అంటే ఎలా ఉంటుంది మరి. బాంబులు పేలుస్తూ, పేపర్లు విసురుతూ నానా హంగామా చేస్తుంటారు. ఈ తరుణంలో పెద్ద పెద్ద బాంబులు ఉపయోగిస్తుంటారు. అయితే ఇక్కడ కూడా అదే జరిగింది. రాకేట్ బాంబులకు సంబంధించిన ఓ పెద్ద బాంబు సెట్ ను పెట్టారు. ఇక ఆ పక్కనే యువకులు అంతా డ్యాన్స్ చేస్తున్నారు.

డ్యాన్స్ చేస్తున్న క్రమంలో ఓ యువకుడు ఏకంగా ఆ బాంబు డబ్బాను తీసుకుని తలపై ఎత్తుకున్నాడు. ఇక బాంబులను తలపై పెట్టుకుని డ్యాన్స్ చేశాడు. దీంతో పక్కనే ఉన్న యువకుడు కూడా అతడితో డ్యాన్స్ చేశారు. పైన ఓ వైపు బాంబులు పేలుతుంటే మరోవైపు యువకుడు బాంబులను తలపై పెట్టుకోవడంతో.. ఓ బాంబు హటాత్తున తలపై పేలింది. దీంతో ఆ బాంబు డబ్బాను.. వెంటనే కిందకు దించాడు. ఇక ఆ బాంబులు అన్ని వైపులా పేలుతుండడంతో అందరూ అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×