Viral News: మునగకాయ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూరగాయ అని ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఈ మీమ్స్‌లో డ్రమ్‌స్టిక్ లోని పోషకాలు, వాటితో తయారు చేసుకునే వివిధ రకాల ఆహార పదార్థాలు, మునగ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలియజేస్తున్నారు.
సోషల్ మీడియాలోని ఈ మీమ్స్ ద్వారా డ్రమ్‌స్టిక్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన పెరుగుతోంది. వీటి పోషక విలువలను హాస్యాస్పదమైన రీతిలో ప్రదర్శిస్తూ మీమ్స్ ద్వారా మరింత మందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రకృతి మనకు అనేక రకాల ఔషధ గుణాలు కలిగిన కూరగాయలు, పండ్లను ప్రసాదించింది. వాటిలో మునగ కూడా ఒకటి. మునగలో ఒక అద్భుతమైన కూరగాయ. దీనిని “మిరాకిల్ ట్రీ” అని కూడా పిలుస్తారు. మొరింగాలో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాల వల్ల ఇది ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూరగాయగా పేరు పొందింది.
పోషక విలువలు:
మునగలో విటమిన్లు, మినరల్స్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ A, C, B6, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. మునగ కాయలలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది సాధారణ కూరగాయల్లో చాలా అరుదుగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు: మునగలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. ఇవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుంచి కూడా రక్షణ కలిగిస్తాయి. అందుకే వీటిని తరచుగా ఆహారంలో బాగంగా చేసుకోవడం చాలా మంచిది.
రక్తపోటు నియంత్రణ: మునగకాయల్లో ఉండే పొటాషియం, మగ్నీషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. హైబీపీ ఉన్న వారు వీటిని తినడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి.
గుండె ఆరోగ్యం: డ్రంస్టిక్ లో ఉండే న్యూట్రియెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.
ముడతలు, చర్మ ఆరోగ్యం: మునగలో ఉండే విటమిన్ C చర్మానికి అందాన్ని ఇస్తుంది. ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: మునగలోని విటమిన్లు , మినరల్స్ శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న వారు మునగ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
వంటలలో ఉపయోగం:
మునగను చాలా రకాల వంటల్లో ఉపయోగించవచ్చు. సాంబార్, కూరలు, సూప్‌ల తయారీలో మునగ ఆకులను వాడవచ్చు. మునగ కాయలతో పాటు ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.వీటిలోని పోషకాలు కూడా వివిధ రకాల వ్యాధులు రాకుండా చేయడంలో ఉపయోగపడతాయి.
Also Read: అందరికీ మటన్ బిర్యానీ పెట్టాలి లేకపోతే పెళ్లి క్యాన్సిల్.. వరుడు బ్లాక్ మెయిల్
మునగలో ఉండే పోషకాల గురించి చాలామందికి తెలియదు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని మన రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అందుకే దీనిని “ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కూరగాయ”అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.