Most Unhealthiest Foods: అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మనం తినే కొన్ని రకాల పదార్దాలు అధిక ప్రాసెసింగ్, అధిక చక్కెర, కొవ్వులు, వంటివి కలిగి ఉంటాయి. ఇలాంటి ఆహారాలను తరచూ తీసుకోవడం వల్ల అధిక బరువు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరి ఎలాంటి ఆహార పదార్థాలకు మనం దూరంగా ఉండాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. సాఫ్ట్ డ్రింక్స్:
సాఫ్ట్ డ్రింక్స్ లో అధిక చక్కెర, ఆర్టిఫిషియల్ కలర్‌లు, కెఫైన్ వంటివి అధిక మోతాదులో ఉంటాయి. వీటిలో ఎలాంటి పోషక పదార్థాలు ఉండవు. వీటిని తినడం వల్ల బరువు పెరగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, అంతే కాకుండా ఇవి ఇన్‌సులిన్ రెసిస్టెన్స్‌ను పెంచుతాయి. ఎసిడిటీ, పంటి సమస్యలకు కారణమవుతాయి.
2. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్:
పకోడీలు, సమోసాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై వంటివి ఎక్కువ మోతాదులో ఉప్పు కలిగి ఉంటాయి. ఇవి గుండెకు చాలా హానికరం. వీటిని తరచుగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతే కాకుండా అధిక బరువు, అర్థరైట్‌స్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
3. ఇన్‌స్టంట్ నూడిల్స్:
వీటిలో సోడియం, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. నూడిల్స్ ఎక్కువగా తినడం వల్ల తలనొప్పులు, నిద్రలేమి, అధిక రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.
4. బేక్డ్ గుడ్స్ :
కేకులు, పేస్ట్రీల వంటి వాటిని అధిక చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్స్‌తో తయారు చేస్తారు. అందుకే వీటిని తినడం ద్వారా బరువు పెరగడం, మధుమేహం, గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది.
5. ఫాస్ట్ ఫుడ్:
బర్గర్లు, పిజ్జాలు, టాకోస్ వంటి ఫాస్ట్ ఫుడ్స్‌లో అధిక మొత్తంలో సోడియం, కొవ్వులు, చక్కెరలు ఉంటాయి. ఇవి తినేటప్పుడు బాగున్నా దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలు, అధిక బరువు వంటి అనారోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి.
6. ఆర్టిఫీషియల్ స్వీట్‌నర్స్:
అసలైన చక్కెరకు బదులుగా వాడే స్వీట్‌నర్లు రసాయనాలతో తయారు చేస్తారు. ఇవి నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
7. ప్యాకెజ్డ్ స్నాక్స్:
చిప్స్, కుర్కురే, వంటి వాటిలో అధిక ఉప్పు, ఒరిగిన కార్బ్స్ ఉంటాయి. . ఇవి వెంటనే అలసటను తగ్గించినా, శరీరానికి ఎలాంటి పోషకాలను అందించవు.
8. ఎనర్జీ డ్రింక్స్:
వీటిలో కెఫైన్, చక్కెర, ఆర్టిఫిషియల్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తాగడం వల్ల గుండె వేగం పెరగడం, నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు ఎక్కువవుతాయి.
Also Read: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే.. ఒక్క దోమ కూడా రాదు
9. ఐస్ క్రీమ్స్:
చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఐస్ క్రీములు తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా వీటి తయారీలో వాడే వివిధ పదార్థాలు ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి.
ఇలాంటి ఆహారాలను పూర్తిగా మానేయలేకపోయినా.. వీటిని తగ్గించడం, ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.