BigTV English

Groom Cancel Wedding: అందరికీ మటన్ బిర్యానీ పెట్టాలి లేకపోతే పెళ్లి క్యాన్సిల్.. వరుడు బ్లాక్ మెయిల్

Groom Cancel Wedding: అందరికీ మటన్ బిర్యానీ పెట్టాలి లేకపోతే పెళ్లి క్యాన్సిల్.. వరుడు బ్లాక్ మెయిల్

Groom Cancel Wedding| భారతదేశంలో వివాహం అంటే ఓ వేడుక. ధనవంతులైనా, పేదలైనా ఇంట్లో పెళ్లి సంబరంగా చేయాలనుకుంటారు. కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అయినా సరే అప్పు చేసి మరీ భారీగా అతిథులకు మర్యాదలు చేస్తారు. ప్రతీ చోట పెళ్లి అనగానే ముందుగా గుర్తోచ్చేది అందరూ తళుకున మెరిసే బట్టలు వేసుకోవడం.. రకరకాల వంటలతో విందు భోజనం కోసం ఎదురు చూడడం. తాజాగా ఒక పెళ్లిలో ఈ విందు భోజనమే పెద్ద సమస్యగా మారింది.


వధూ వరులు ఇరువైపల కుటుంబాలు కూడా పేద, దిగువ మద్య తరగతికి చెందినవారు. దీంతో ఓ వైపు పెళ్లికూతురు కుటుంబం సాదాసీదాగా పెళ్లి చేయాలని భావించగా.. వరుడి కుటుంబం కూడా అందుకు ఒప్పుకుంది. కానీ పెళ్లికి మరో వారం రోజుల ముందు వరుడు తనకు పరువు పోతుందని.. వచ్చే అతిథులందరికీ భారీ విందు భోజనం ఏర్పాటు చేయాలని.. ముఖ్యంగా మటన్ బిర్యానీ తప్పనసరిగా పెట్టాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో పెళ్లి రద్దు చేయాల్సిన పరిస్థితి.

వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో రెడ్డిట్ ప్లాట్ ఫామ్ పై ఒక యూజర్ తన కుటుంబానికి ఎదురైన చేదు అనుభవాన్ని అందరితో పంచుకుంటూ.. ఇది న్యాయమేనా అని ప్రశ్నించాడు. ఆ రెడ్డిట్ యూజర్ కథనం ప్రకారం.. అతను ఒక చిరుద్యోగం చేస్తున్నాడు. దిగువ మధ్య తరగతి కుటుంబం చెందిన అతని కుటుంబంలో అతని సోదరికి పెళ్లి కుదిరింది. వారి గ్రామానికే చెందిన ఒక యువకుడితో పెళ్లి చేయాలని నిశ్చయించారు. అయితే వారి గ్రామంలో పెళ్లి రెండు రకాలుగా చేస్తారు.


ఒకటి.. గ్రాండ్ గా మటన బిర్యానీ పెట్టి రూ.10 నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేయాలి. లేదా రెండో విధానం.. సాయంత్రం టీ, కాఫీలు, స్నాక్స్ పెట్టి పెళ్లి కానిచ్చేయడం. అయితే అలా చేస్తే మధ్యాహ్నం వచ్చే బంధువులకు మాత్రం భోజనాలు పెట్టాలి. ఆ ఖర్చులు కూడా ఇరువైపులా భరించాలి. దిగువ మధ్య తరగతి కావడం తో పెళ్లి కతూరు కుటుంబం రెండో విధానంతో పెళ్లి కానిచ్చేద్దాం తమ వద్ద భారీగా ఖర్చు పెట్టేందుకు డబ్బులు లేవని తెలిపారు. ఈ కండీషన్ కు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అంగీకరించారు కూడా. మే నెల 4వ తేదీన పెళ్లి ఖరారు చేసుకున్నారు.

Also Read: మూడు సంవత్సరాలుగా ప్రతిరోజు పీరియడ్స్.. చెప్పలేని డాక్టర్లు కారణం టిక్ టాక్ లో తెలిసింది!

అయితే తాజాగా పెళ్లి కొడుకు తన పెళ్లి గ్రాండ్ గా చేయాలని.. జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లి కాబట్టి తాను వేడుకలా చేసుకోవాలనుకుంటున్నానని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం ఈ విషయాన్ని పెళ్లికూతరు కుటుంబానికి తెలియజేశాడు. కానీ వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం స్వయంగా వరుడే అమ్మాయి ఇంటికి వెళ్లి.. తాను చెప్పిన కండీషన్ కు ఒప్పుకుంటున్నారా? లేదా? అని ప్రశ్నించాడు. అలా కుదరదు అని వధువు కుటుంబం తేల్చి చెప్పేసింది. దీంతో ఆ కాబోయే వరుడు తన పెళ్లిలో మొత్తం 600 మంది అతిథులు వస్తారని.. వారందరికీ కనీసం మటన్ బిర్యానీ అయినా పెట్టాలని కోరాడు. అయితే పెళ్లికూతరు తండ్రి తన ఆర్థిక స్థోమత అంత లేదని తెలపాడు. దానికి ఆ వరుడు అయితే అప్పులు చేయండి. ఒకసారి మాత్రమే జరిగే పెళ్లి కదా?.. అని అడిగాడు. అందుకు వారు అప్పులు చేసి పెళ్లి చేస్తే.. ఆ తరువాత ఆ భారం తాము జీవితాంతం మోయాలని.. అలా చేయడం కుదరని మరోసారి చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆ పెళ్లికొడుకు.. “అయితే పెళ్లి రద్దు చేసుకుంటున్నాము. దీని గురించి గ్రామ పంచాయితీలో ఫిర్యాదు చేస్తాను.” అని చెప్పేసి వెళ్లిపోయాడు.

అది విన్న ఆ రెడ్డిట్ యూజర్ తల్లి, కాబోయే పెళ్లికూతురు కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలో పరువుగా బతికే తమకు ఈ పంచాయితీలకు పోవడం తెలీదని బాధపడ్డారు. ఈ విషయంపై ఆ రెడ్డిట్ యూజర్.. సోషల్ మీడియాలో సలహా అడిగాడు.

ఈ పోస్ట్ పై పలువురు స్పందిస్తూ. . కామెంట్లు పెట్టారు. అందరూ దాదాపు ఒకటే మాట చెప్పారు. అతను ఒక పేద కుటుంబానికి చెందిన వాడై ఉండి కూడా.. సాటి వారి బాధను, కష్టాలను అర్థం చేసుకోవడం లేదు. అలాంటి వాడితో మీరు సంబంధం కలుపుకోకపోవడమే మంచిది. మీకు దీని కంటే మరో మంచి సంబంధం వస్తుంది అని రాశారు. ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. వాడొక వేస్ట్ ఫెలో పెళ్లి రద్ద అయినందుకు పార్టీ చేసుకోండి బ్రో అని రాశాడు.

Related News

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Karachi Airport: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Big Stories

×