OTT Movie : ఓటీటీ లో ఎన్నోరకాల సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక ఒంటరి మహిళ చుట్టూ తిరుగుతుంది. ఈ స్టోరీ చాలా డిఫ్ఫరెంట్ గా ఉంటుంది. ఒక అడవి మధ్యలో, ఆమె ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఆస్ట్రియన్-జర్మన్ డ్రామా మూవీ పేరు ‘ది వాల్’ (The Wall). దీనికి జూలియన్ పోల్స్లర్ దర్శకత్వం వహించారు. ఆస్ట్రియన్ రచయిత మార్లెన్ హౌషోఫర్ 1963 లో రాసిన నవల ‘డై వాండ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమా ఒక మహిళ ఒంటరితనం, ప్రకృతితో సంబంధం చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ 86వ అకాడమీ అవార్డ్స్‌లో, ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఆస్ట్రియన్ ఎంట్రీగా ఎంపికైంది. కానీ అది నామినేట్ కాలేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఒక ఒంటరి మహిళ తన ఇద్దరు స్నేహితులు హ్యూగో, లూయిస్ వారి కుక్క లింక్స్‌తో కలిసి, ఆస్ట్రియన్ ఆల్ప్స్‌లోని ఒక ప్రాంతానికి విహార యాత్రకు వెళ్తారు. ఆ రాత్రి, హ్యూగో లూయిస్ సమీప గ్రామంలోని పబ్‌కు వెళతామని చెప్పి బయలుదేరతారు. కానీ వారు ఎంత సేపటికీ తిరిగి రారు. మరుసటి రోజు ఉదయం, ఆమె వారిని వెతకడానికి గ్రామం వైపు నడుస్తూ వెళ్తుంది. కానీ అకస్మాత్తుగా ఒక అదృశ్య గోడ ఆమెను అడ్డుకుంటుంది. ఈ గోడ ఆమెను బయటి ప్రపంచం నుండి పూర్తిగా వేరు చేస్తుంది. ఆమె బైనాక్యులర్స్‌తో చూసినప్పుడు, గోడ ఆవల ఉన్న వ్యక్తులు స్తంభించినట్లు కనిపిస్తారు. బహుశా చనిపోయి ఉండవచ్చని ఆమె అనుమానిస్తుంది. ఆమె తిరిగి తన కుటీరానికి చేరుకుంటుంది. ఇక ఎవరూ లేకపోవడంతో, లింక్స్ కుక్కతో కలిసి జీవించడం ప్రారంభిస్తుంది.
తరువాత ఆమె ఒక ఆవు, ఒక పిల్లి, దాని పిల్ల ను కూడా పెంచుతుంది. అక్కడ ఆమె మూడు సంవత్సరాలు ఒంటరిగా జీవిస్తుంది. ఈ సమయంలో ఆమె వ్యవసాయం, వేటాడటం, ఆహారాన్ని సేకరించడం వంటివి చేస్తూ జీవిస్తుంది. ఆమె తన అనుభవాలను, భయాలను, ఆలోచనలను ఒక బుక్ లో రాస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత, ఆమె ఒక రోజు మరొక వ్యక్తిని చూస్తుంది. అతను ఆమె ఆవు దూడను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఈ సంఘటనలో, ఆ వ్యక్తి లింక్స్ కుక్కను కూడా చంపేస్తాడు. ఆగ్రహంతో, ఆమె రైఫిల్‌తో ఆ వ్యక్తిని కాల్చి చంపుతుంది. ఈ ఘటన ఆమె శాంతియుత జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది. చివరికి ఆమె స్నేహితులు ఏమయ్యారు ? ఆ మహిళ వాళ్ళని కనిపెడుతుందా ? ఆమె ఒంటరిగానే బతికేస్తుందా ? ఈ విషయాలను మూవీ చూసి తెలుసుకోండి.
Also Read : ప్రియుడిని కాదని తండ్రిని ప్రేమించే కూతురు … ఈ అమ్మాయి ఇచ్చే ట్విస్ట్ కి బుర్ర కరాబ్