Elephant video: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పాముల వీడియోలు, ఏనుగుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న ఏనుగు పిల్లలు చేసే పనులు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. బీబే ఏనుగుల చేసే పనులు చాలా అమాయకత్వంగా కనిపిస్తుంటాయి. ఆసక్తితో అందరి హృదయాలను ఆకర్షిస్తున్నాయి. అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల జాబితాలోకి మరొక పిల్ల ఏనుగు వీడియో చేరింది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ చిన్న ఏనుగు పిల్ల తన నిద్రపోతున్న ఓ యువకుడిని ఆప్యాయంగా మేల్కొల్పి, అతని పక్కన పడుకుని నిద్రపోతున్న దృశ్యం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియో కింద నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు.
?utm_source=ig_web_copy_link
ఈ వీడియోలో.. ఒక దుప్పటితో కప్పుకొని నేలపై నిద్రిస్తున్న ఒక వ్యక్తి వద్దకు బేబీ ఏనుగు వస్తుంది. ఆ చిన్న ఏనుగు మొదట అతన్ని సున్నితంగా తాకేందుకు ప్రయత్నించింది. కానీ తర్వాత అతనిపైకి వెళ్లి ఒక ఆప్యాయంగా పడుకునేందుకు ప్రయత్నిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి పరిస్థితిని అర్థం చేసుకుని ఏనుగును సున్నితంగా నిమురుతూ దుప్పటితో కప్పి ఇద్దరూ కలిసి నిద్రపోతారు. ‘బేబీ ఏనుగు తన స్నేహితుడిని కలిసి నిద్రించడానికి మేల్కొల్పింది. స్వచ్ఛమైన ప్రేమ ఇది కదా!’ అని ఈ వీడియోకు ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ALSO READ: Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?
ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బేబీ ఏనుగు అందమైన చేష్టలతో ఆకర్షితులయ్యారు. దీనిపై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ‘ఇది ఏ రకమైన కుక్కపిల్లో?’ అని ఒక నెటిజన్ జోక్ చేశాడు. ‘ఆ ఏనుగును ప్రేమించడం, జాగ్రత్తగా చూసుకోవడం చాలా ప్రత్యేకం’ అని మరొక నెటిజన్ రాసుకొచ్చాడు. ‘ఈ రోజులు అతనికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, ఇది గొప్ప స్నేహం.. 50 ఏళ్ల తర్వాత, ఈ చిన్న ఏనుగు ఆ వ్యక్తి వృద్ధుడు అయ్యాక సంరిక్షంచవచ్చు’ అని మరొకరు రాసుకొచ్చారు.
ALSO READ: Clerk Jobs: భారీగా క్లర్క్ పోస్టులు.. మంచి వేతనం.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలు..!
గత నెలలో, మరొక వీడియోలో ఒక బేబీ ఏనుగు కుర్చీపై ఎక్కి మనిషిలా కూర్చునే ప్రయత్నంలో విఫలమైన అందమైన దృశ్యం వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాగే, మరో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఒక బేబీ ఏనుగు తన సంరక్షకుడితో స్నానం చేస్తూ, ఒక చిన్న కప్పను చూసి సున్నితంగా కదిలిన వీడియో కూడా వైరల్ అయ్యింది. ఈ వీడియోలు బేబీ ఏనుగుల అమాయకత్వం, మానవులతో వారి బంధం ప్రత్యేకతను తెలియజేస్తాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అవుతున్నాయి.