Jana Gana Mana: మన దేశ జాతీయ గీతం “జనగణమన” వినిపించినా మన మనసు గర్వంతో నిండిపోవడం సహజం. కానీ, ఈసారి ఆ గర్వం, ఆ ఆనందం… ఒక చిన్నారి స్వరంలో వినిపించింది. అంతే కాదు దేశం మొత్తం ఈ క్యూట్ వీడియోతో మంత్ర ముగ్ధమైంది. అరుణాచల్ ప్రదేశ్‌కి చెందిన ఒక చిన్నారి తన స్కూల్ యూనిఫాం వేసుకుని, కళ్ళు మూసుకుని, ఎంతో ప్రేమగా, భావోద్వేగంతో జాతీయ గీతం పాడింది. ఆ చిన్నారికి మాటలు రాకపోయినా జాతీయ గీతం పాడుతూ ప్రతి అక్షరంలోనూ దేశభక్తి పొంగిపొర్లింది. కళ్లు మూసుకుని మొత్తం గీతం ఆలపిస్తూ అలా ఉండిపోయింది.
ఈ అందమైన క్షణాన్ని అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ముచ్చు మిథి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో షేర్ చేశారు. వీడియోలో ఆ చిన్నారి, “జనగణమన”ను తన చిన్న వాయిస్‌తో ఆలపించడం చూడగానే, వినగానే… ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు రావడం సహజమే. దేశవ్యాప్తంగా నెటిజన్లు ఈ వీడియోను చూసి మురిసిపోతున్నారు. “ఇంటర్నెట్‌లో ఈరోజు చూసిన క్యూ టెస్ట్ విషయం ఇదే” అని చాలామంది కామెంట్లు చేశారు. ఇంకొందరు… “మన దేశ భవిష్యత్తు ఇలాంటి అమాయక సంతానమే. వీళ్లే రేపు దేశాన్ని గర్వపడేలా చేస్తారు” అని రాశారు.
Also Read: Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు
మనమంతా Independence Day కోసం సిద్దమవుతున్న ఈ సమయంలో… ఈ చిన్నారి స్వరం మనలో ఒక ప్రత్యేకమైన గర్వాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే జాతీయ గీతం అందంగా పాడటం కంటే… ఆ భావనతో పాడటమే గొప్ప విషయం. అదే ఈ వీడియోలో కనిపించింది. అరుణాచల్ ప్రదేశ్ వంటి ఉత్తర తూర్పు రాష్ట్రాల నుండి ఇలాంటివి రావడం… దేశం మొత్తం ఒకే తాటిపైకి రావడానికి సంకేతం. భాష వేరైనా, ప్రాంతం వేరైనా… దేశభక్తి మాత్రం ఒకటే అని ఈ చిన్నారి మనకు గుర్తు చేసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో రీ-షేర్స్, లైక్స్, కామెంట్స్ వర్షంలా కురుస్తున్నాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక పాట కాదు… ఇది మన ‘భారతీయత’కు ప్రతీక.
“జనగణమన”ను పాడేటప్పుడు… మనకు ఎప్పుడూ ఒక గంభీరత, గౌరవం కలుగుతుంది. కానీ… ఈ వీడియో చూసిన తర్వాత, ఆ గంభీరతతో పాటు, ఒక తీపి అమాయకపు నవ్వు కూడా కలుస్తుంది. ఎందుకంటే ఈ చిన్నారి మన జాతీయ గీతాన్ని కేవలం పాడలేదు… తన హృదయంలోని ప్రేమను మనకు వినిపించింది. ఈ వీడియో Independence Day కి ముందే దేశంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా… మనం ఈ వీడియోలో కనిపించే చిన్నారి లాంటి అమాయక భావనతో, నిజమైన గౌరవ భావంతో మన దేశాన్ని గౌరవిద్దాం.