Burning pyre reel: సోషల్ మీడియా పేరు వింటేనే మనకు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఫేస్‌బుక్ వీడియోలు గుర్తుకొస్తాయి. మొదట్లో ఇవి వినోదం కోసం, ఆనందాన్ని పంచుకోవడానికి వాడేవాళ్లం. కానీ ఇప్పుడు? కొన్ని వీడియోలు చూస్తే మనసుకు బాధను కలిగిస్తాయి. తాజాగా ఒక వీడియో దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
స్థానిక శ్మశానవాటికలో మండుతున్న చితి ముందు… చీర కట్టుకుని ఒక యువతి డాన్స్ చేస్తోంది. చుట్టూ పొగలు, వెనక మంటల్లో దగ్ధమవుతున్న మృతదేహం… ఈ భయానక వాతావరణంలో ఆమె మాత్రం ఫోన్ కెమెరా ముందు స్టెప్పులు వేస్తూ, పోజులు ఇస్తూ, రీల్ షూట్ చేస్తోంది. ఈ వీడియో ఎక్స్ (ట్విట్టర్) లో @ShoneeKapoor అనే యూజర్ షేర్ చేయగానే, క్షణాల్లో వైరల్ అయింది. వేలాదిమంది వీక్షించి, కామెంట్లతో ఆమె ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు.
Also Read : Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు
“ఇది కంటెంట్ క్రియేషన్ కాదు, మానవత్వం పట్ల నిర్లక్ష్యం” అని ఒకరు రాశారు. “ఇప్పుడు రీల్స్ కోసం మనుషులు సిగ్గు, సంస్కారం అన్నింటినీ మర్చిపోయారు” అని మరొకరు స్పందించారు. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రాంతాలు—ఇవే రీల్ లొకేషన్లు అయ్యేవి. కానీ ఇప్పుడు… ఎవరికీ ఊహించని ప్రదేశాలకూ, ముఖ్యంగా శ్మశానాలకూ, ఈ రీల్ ఫీవర్ చేరుకుంది.
ఒక కామెంట్‌లో “దేవాలయంలో భజన గానం చేయడం వంటిది… కానీ ఇక్కడ భజన స్థానంలో డాన్స్, అగరబత్తి స్థానంలో చితి బూడిద” అని తీవ్రంగా విమర్శించారు. మరికొందరు మాత్రం ఆ యువతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
Also Read : Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..
ఈ ఘటన మన సమాజంలో ఒక ఆందోళనకరమైన మార్పును చూపిస్తోంది. వీక్షణలు, లైక్స్, ఫాలోవర్స్ కోసం మరణం, దుఃఖం, పవిత్రమైన ప్రదేశాలపైనా గౌరవం మరిచిపోతున్నారని సోషల్ మీడియా యూజర్లు అంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా చితి ముందు చేసే డాన్స్ కేవలం దృష్టి ఆకర్షించడమే కాకుండా, మరణించిన వారి కుటుంబ సభ్యుల భావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని విమర్శకులు చెబుతున్నారు.
ఒకప్పుడు రీల్స్ వినోదానికి, స్మృతులకు గుర్తుగా ఉండేవి. ఇప్పుడు అవి వివాదాలకు, విమర్శలకు కారణమవుతున్నాయి. ప్రశ్న ఒక్కటే ఈ రీల్ కల్చర్ కోసం మనం ఎంతదూరం వెళ్ళబోతున్నాం? మరణాన్ని, దుఃఖాన్ని కూడా వినోదంగా మార్చే ఈ ధోరణి ఆగాలంటే కేవలం చట్టం కాదు, మనలోని విలువలు, గౌరవం మేల్కొనాలి.