BigTV English

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Viral wedding: సోషల్ మీడియా లో ఇటీవలి కాలంలో ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్ జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు… ప్రదీప్ నేగి, కపిల్ నేగి… ఒకే మహిళ, సునీతా చౌహాన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి చిత్రాలు, వీడియోలు దేశమంతా హాట్ టాపిక్ అయ్యాయి. కానీ ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు కథ, ఆ సంప్రదాయం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.


జూలై 12న, హిమాచల్ ప్రదేశ్‌లోని శిల్లై ప్రాంతంలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన ఈ పెళ్లి… స్థానిక జానపద గీతాలు, నృత్యాలు, వందలాది మంది హాజరైన వేడుకలతో ముగిసింది. ఇది సాధారణ పెళ్లి కాదు, హట్టి గిరిజన సంప్రదాయం “జోడిదారా” ప్రకారం జరిగిన ఫ్రాటర్నల్ పొల్యాండ్రి పెళ్లి. అంటే, ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకే మహిళను భార్యగా చేసుకోవడం. ప్రదీప్ నేగి వీడియోలో స్పష్టంగా చెప్పారు – “మా దగ్గర ఈ జోడిదారా పద్ధతి తరాలుగా వస్తోంది. మేమే మొదటివాళ్ళం కాదు, చివరివాళ్ళం కూడా కాదని. మా కుటుంబ ఆశీర్వాదాలతో, పరస్పర సమ్మతితో పెళ్లి చేసుకున్నాం. మేము మా జీవితంతో సంతోషంగా ఉన్నాం.”

కపిల్ నేగి, వీరిలో ఒకరు విదేశాల్లో పనిచేస్తున్నారు. ఆయన మాటల్లో – “మా దగ్గర ఎవరూ ఈ సంప్రదాయాన్ని బలవంతంగా పెట్టరు. మేమిద్దరం కలసి, ఆలోచించి, స్వచ్చందంగా నిర్ణయం తీసుకున్నాం. ఇలా చేస్తే మా భార్యకు ఇద్దరి ప్రేమ, సహాయం, భరోసా లభిస్తుంది. కుటుంబం ఒకటిగా నిలుస్తుంది.” వీరిద్దరూ స్పష్టం చేశారు – ఈ పెళ్లి పాపులారిటీ కోసం కాదు. “మేము ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేయడానికి లేదా వార్తల్లో రావడానికి పెళ్లి చేసుకోలేదు. మా ఉద్దేశం కేవలం కలిసే ఉండటం, ఒకరినొకరం ప్రేమించుకోవడమే.” అని ప్రదీప్ అన్నారు.


అయితే, ఈ పొల్యాండ్రి సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే, హట్టి గిరిజనుల జీవనశైలి, భౌగోళిక పరిస్థితులు దీనికి ప్రధాన కారణం. ఈ ప్రాంతం పర్వత ప్రాంతం కావడంతో, భూములు చిన్న చిన్న ముక్కలుగా విడిపోకుండా కాపాడుకోవడానికి ఈ సంప్రదాయం పాటించేవారు. అన్నదమ్ములు ఒక్క భార్యతో కుటుంబాన్ని కొనసాగిస్తే, ఆస్తి విభజన జరగదు. అంతేకాకుండా, అన్నదమ్ముల మధ్య ఐక్యత బలపడుతుంది. గ్రామీణ సమాజంలో భద్రత, ఆర్థిక స్థిరత్వం కూడా వస్తుంది.

కాలం మారుతున్న కొద్దీ, చదువు పెరగడంతో, కొత్త ఉద్యోగ అవకాశాలు రావడంతో ఈ సంప్రదాయం తగ్గిపోతున్నా… హిమాచల్-ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లోని కొన్ని గ్రామాల్లో ఇది ఇంకా కొనసాగుతోంది. ప్రదీప్-కపిల్ పెళ్లిలో ‘సీంజ్’ అనే ప్రత్యేక రీతిని గౌరవంగా నిర్వహించారు. వరుడి ఇంట్లో, స్థానిక భాషలో మంత్రాలు చదివి, పవిత్ర జలాన్ని జంటపై చల్లడం… చివరగా బెల్లం ఇచ్చి, వారి జీవితంలో మాధుర్యం నిండాలని ఆశీర్వదించడం – ఇవన్నీ ఈ పెళ్లి భాగమయ్యాయి.

ప్రదీప్ చివరగా విమర్శకులకు ఓ సందేశం ఇచ్చారు – “మా సంప్రదాయాలను కాపాడుకోవడమే మా లక్ష్యం. ఎవరికీ అర్థం కాకపోయినా, మేము మా సంస్కృతిపై గర్వంగా ఉన్నాం. మమ్మల్ని తీర్పు ఇవ్వకండి, మాకు మా జీవితం ఉంది, దానిలో మేము సంతోషంగా ఉన్నాం.” వీరి కథ మనకు ఒక విషయం చెబుతుంది – ప్రపంచంలో ప్రతి ప్రాంతానికీ తనకంటూ ఒక సంస్కృతి, సంప్రదాయం ఉంటుంది. మనం అర్థం చేసుకోలేకపోయినా, దానికి ఉన్న చరిత్ర, అవసరాలు లోతైనవి. గౌరవించడమే మంచిది.

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×