E-Paper
Advertisement

Advocates Fight: కోర్టు ఆవరణలో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళా న్యాయవాదులు.. వీడియో వైరల్

Advocates Fight: కోర్టు ఆవరణలో పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళా న్యాయవాదులు.. వీడియో వైరల్
Advertisement

Advocates Fight Viral Video: న్యాయం చెప్పాల్సిన న్యాయవాదులే జుట్టు జుట్టు పట్టుకుని.. కోర్టు ఆవరణలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. గొడవలకు పరిష్కారం చూపాల్సిన వారే గొడవకు దిగి.. కొట్టుకోవడంతో అక్కడున్నవారంతా షాకయ్యారు. ఆ ప్రాంగణమంతా న్యాయవాదులు, పోలీసులతో కిక్కిరిసి ఉండగా.. ఓ మహిళా జడ్జి, మహిళా లాయర్ చితకొట్టేసుకున్నట్లుగా.. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో 2022 నవంబర్ నాటిది. కానీ.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా ఈ ఘటన మహారాష్ట్ర కోర్టు ప్రాంగణంలో జరిగింది కాదంట. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్ గంజ్ ఫ్యామిలీ కోర్టులో జరిగిన ఘటన.

Advertisement

అందరూ అనుకుంటున్నట్లుగా అక్కడ కొట్టుకున్నది జడ్జి, అడ్వకేట్ కాదు. ఇద్దరూ న్యాయవాదులే. కుటుంబ సమస్యలతో కోర్టు మెట్లెక్కిన ఓ జంట తరఫున వాదోపవాదనలు వినిపిస్తున్నారు. ఈ కేసు విషయమై ఇద్దరి మధ్య కోర్టు బయట మాట మాట పెరిగి గొడవైంది. కోపం పట్టలేక ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

ఒక లాయర్ మరొక లాయర్ జుట్టుపట్టుకుని కొట్టగా.. వారిని విడదీసేందుకు అక్కడున్నవారిలో కొందరు ప్రయత్నించారు. మరికొందరు వీడియోలు తీసి నెట్టింటలో పోస్ట్ చేశారు. చివరికి ఒక మహిళా పోలీస్ జోక్యం చేసుకోవడంతో లాయర్ల మధ్య కొట్లాట కాస్తా ఆగింది.

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×