BigTV English

Viral Video: రైల్లో టీ తాగుతున్నారా? ఈ వీడియో చూస్తే జీవితంలో చాయ్ జోలికి వెళ్లరు!

Viral Video: రైల్లో టీ తాగుతున్నారా? ఈ వీడియో చూస్తే జీవితంలో చాయ్ జోలికి వెళ్లరు!

Shocking Video: రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో చిరు వ్యాపారులు, పల్లీలు, సమోసాలు, టీ, కాఫీ లాంటి తినబండారాలను అమ్ముతుంటారు. ప్యాసెంజర్లు కూడా వాటిని కొనుగోలు చేసిన తింటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే, రైళ్లలో అమ్మే టీ, కాఫీలు, ఇతర తినుబండారాలు దారుణంగా ఉంటాయని నిరూపించే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘోరమైన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో చూసి రైల్వే ప్రయాణీకులతో పాటు నెటిజన్లు షాక్ అవుతున్నారు.


టాయిలెట్ వాటర్ తో టీ కంటేనర్ క్లీనింగ్

రైల్లో చాయ్ అమ్మే ఓ వ్యక్తి టాయిలెట్ లోపల జెట్ స్ప్రేతో టీ కంటైనర్ ను కడుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోను చూసి రైల్వే ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైళ్లలో ఎంత అపరిశుభ్రమైన టీ, కాఫీలు, తినుబండారాలు అమ్ముతారో అని చెప్పడానికి ఇదో నిదర్శనం అంటున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ అయూబ్ ఈ వీడియో తన ఇన్ స్టాలో షేర్ చేశారు. ‘ట్రైన్ కి చాయ్’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టాడు. ఇందులో సదరు టీ సెల్లర్ ఏకంగా టాయిలెట్ బేసిన్ మీదే టీ కంటేనర్ ను ఉంచి  జెట్ స్ప్రేతో క్లీన్ చేస్తూ కనిపించాడు. చాలా మంది ఈ వీడియోను ఇండియన్ రైల్వే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ కి ట్యాగ్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Ayub (@yt_ayubvlogger23)

రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు

ఇక ఈ వీడియోపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతున్నది. “ఇకపై రైల్లో కనీసం టీ కూడా తాగలేని దుస్థితి తలెత్తింది” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ఇది చాలా అసహ్యమైన చర్య. ఇలాంటి కంటేనర్ లో టీ తాగితే మనుషులు బతుకుతారా?” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “రైళ్లలో దొరికే ఫుడ్ ఇలా ఉంటుంది కాబట్టే నేను చాలా కాలంగా జర్నీ సమయంలో తినుబండారాలు కొనుగోలు చేయడం మానేశాను. అవసరం అనుకుంటే, ఇంటి దగ్గరి నుంచే తీసుకెళ్తాను” అని మరో వ్యక్తి వెల్లడించాడు. “ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత కూడా రైల్వే అధికారులు ఏమీ పట్టనట్టు ఉండకూడదు. కచ్చితంగా ఈ వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మిగతా వారిలో భయం ఏర్పడుతుంది” అని ఇంకో నెటిజన్ రాసుకొచ్చాడు.

గతంలోనూ ఇలాంటి ఘటన

ఇక 2018లోనూ ఇలాంటి సంఘటన జరిగింది. చెన్నై- హైదరాబాద్ ఎక్స్‌ ప్రెస్‌ లో ఒక టీ అమ్మే వ్యక్తి, చాయ్ తయారు చేయడానికి టాయిలెట్ నీటిని ఉపయోగిస్తూ వీడియోకు చిక్కాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు దర్యాప్తు చేశారు. సదరు వ్యక్తికి రూ. లక్ష జరిమానా విధించారు.

Read Also: ప్రపంచంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు.. ఇందులో మన స్టేషన్లు కూడా ఉన్నాయండోయ్!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×