BigTV English

SK 25: ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి.. శివకార్తికేయన్ సినిమాలో ఆ మార్పు జరగాల్సిందే.!

SK 25: ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి.. శివకార్తికేయన్ సినిమాలో ఆ మార్పు జరగాల్సిందే.!

SK 25: సినిమాల విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొందరు ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి. దానివల్ల సినిమాలకు కష్టాలు మొదలవుతాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు ఎఫెక్ట్ అయ్యాయి. అందరు ప్రేక్షకులకు నచ్చే విధంగా, ఏ కాంట్రవర్సీ లేకుండా ఉంటేనే సినిమాలు థియేటర్ల వరకు రాగలుగుతాయి. తాజాగా శివకార్తికేయన్ కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా అయిన ‘ఎస్‌కే 25’ విషయంలో కూడా అలాంటి కాంట్రవర్సీనే మొదలయ్యింది. వారు చెప్పిన మార్పులు చేయాలని లేదంటే సినిమాను విడుదల అవ్వనివ్వమంటూ కొందరు ప్రేక్షకులు సోషల్ మీడియాలో నిరసన మొదలుపెట్టారు.


టైటిల్ వల్లే

శివకార్తికేయన్ తన కెరీర్‌లో 25వ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతను లేడీ డైరెక్టర్ సుధా కొంగరకు ఇచ్చారు. ఇప్పటివరకు సుధా కొంగర డైరెక్ట్ చేసిన సినిమాలు కొన్నే అయినా.. అవన్నీ సూపర్ హిట్‌ను అందుకున్నాయి. అందుకే శివకార్తికేయన్‌తో సుధా డైరెక్ట్ చేసే మూవీపై ముందు నుండే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. షూటింగ్ కూడా మొదలయ్యింది. ఇటీవల షూటింగ్ గురించి ఆసక్తికర అప్డేట్ కూడా అందించాడు హీరో. కానీ ఇంతలోనే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ విషయంలో వివాదం మొదలయ్యింది.


కాంట్రవర్సీ మొదలు

శివకార్తికేయన్ (Sivakarthikeyan), సుధా కొంగర (Sudha Kongara) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీకి ‘పరాశక్తి’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అయ్యాయి. సెన్సార్ సర్టిఫికెట్ ప్రకారం టైటిల్ ఇదేనంటూ బయటికొచ్చింది. దీంతో ఈ టైటిల్‌పై రెడీ అయిన ఫ్యాన్ మేడ్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కానీ ఇంతలోనే ఈ టైటిల్ కొంతమందికి నచ్చక కాంట్రవర్సీ మొదలయ్యింది. ‘పరాశక్తి’ అనే టైటిల్‌ను మార్చాలంటూ శివాజీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ మొదలుపెట్టింది. 1952లో ఇదే టైటిల్‌తో శివాజీ గణేశన్ హీరోగా ఒక సినిమా విడుదలయ్యింది. అది తమిళ సినిమా రూపురేఖలనే మార్చేసింది. ‘పరాశక్తి’ లాంటి క్లాసిక్ టైటిల్‌ను ఎస్‌కే 25 కోసం ఉపయోగించడం తమకు ఇష్టం లేదని శివాజీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది.

Also Read: ఒకవైపు మోక్షజ్ఞ.. మరొకవైపు డ్రీమ్ ప్రాజెక్ట్.. ప్రశాంత్ వర్మ పయనం ఎటువైపు..!

ఫ్యాన్స్ హర్ట్ అవుతారు

గతంలో కూడా ఎన్నో తమిళ సినిమాలు ‘పరాశక్తి’ (Parasakthi) టైటిల్‌ను ఉపయోగించుకోవాలని ప్రయత్నించినా ఈ అసోసియేషన్ అడ్డుపడింది. అందుకే 1952 నుండి ఇప్పటివరకు ఈ టైటిల్‌ను మరొకరు ఉపయోగించలేదు. అందుకే ఇప్పుడు శివకార్తికేయన్ సినిమాకు కూడా టైటిల్ మార్చాలంటూ డిమాండ్ మొదలయ్యింది. అదే టైటిల్ ఉపయోగిస్తే తమిళ లెగసీని దెబ్బతీసినట్టుగా ఉంటుందని, శివాజీ గణేశన్ ఫ్యాన్స్ ఫీలింగ్స్ కూడా హర్ట్ చేసినట్టు ఉంటుందని అసోసియేషన్ అంటోంది. ఈ టైటిల్ వెంటనే మార్చకపోతే భవిష్యత్తులో చర్యలు తప్పవని ఇన్‌డైరెక్ట్‌గా బెదిరింపులకు పాల్పడుతోంది. తమిళ సినిమాల్లో పాత టైటిల్స్‌ను ఉపయోగించడం, తమిళ పాటలను రీమిక్స్ చేసే విషయంలో మేకర్స్ ఎప్పుడూ క్లియర్‌గా ఉంటారు. అలాంటిది ‘పరాశక్తి’ లాంటి పవర్‌ఫుల్ టైటిల్‌ను మరోసారి ఉపయోగిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ శివాజీ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిక్స్ అయ్యింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×