Most Haunted Railway Stations In The World: ప్రపంచ వ్యాప్తంగా కొన్ని రైల్వే స్టేషన్లు అత్యంత అనుమానాస్పద రైల్వే స్టేషన్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ రైల్వే స్టేషన్లలో పని చేసేందుకు ఉద్యోగులు, రైలు ఎక్కేందుకు ప్రయాణీకులు భయంతో వణికిపోతారు. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿బేగుంకోదర్ రైల్వే స్టేషన్, పశ్చిమ బెంగాల్
బేగుంకోదర్ రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఇది రాంచీ డివిజన్ పరిధిలో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ మాస్టర్ తో పాటు ఆయన కుటుంబం అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. అప్పటి నుంచి ఈ స్టేషన్ లో ఓ ఆడ దెయ్యం తిరుగుతుందని ప్రచారం జరిగింది. అందుకే ఈ రైల్వే స్టేషన్ కొన్ని దశాబ్దాలుగా మూతపడింది.
⦿రవీంద్ర సరోబార్ మెట్రో స్టేషన్, కోల్‌కతా
ఈ రైల్వే స్టేషన్ కూడా పశ్చిమ బెంగాల్ లోనే ఉంది. టోలీగంజ్ చారు మార్కెట్ లోని చారు చంద్ర అవెన్యూలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ రోడ్డులో ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే చివరి రైలులో దెయ్యం ఉంటుందని చాలా మంది నమ్ముతారు.
⦿బిషన్ MRT స్టేషన్, సింగపూర్
ఇది సింగపూర్ లోని బిషన్‌లోని నార్త్- సౌత్ సర్కిల్ లైన్‌లలో ఉన్న మాస్ రాపిడ్ ట్రాన్సిట్ ఇంటర్ చేంజ్ స్టేషన్. ఇది ఓ స్మశానవాటిక మీద నిర్మించబడి ఉందని నమ్ముతారు. ఈ రైల్వే స్టేషన్ లో తలలేని దెయ్యాలు వెంటాడుతాయనే ప్రచారం ఉంది.
⦿పాంటియోన్స్ మెట్రో స్టేషన్, మెక్సికో
ఇది మిగ్యుల్ హిడాల్గో బరోలోని కొలోనియా అర్జెంటీనా జిల్లాలో ఉంది. ఈ రైల్వే స్టేషన్ లో మనుషులు లేకుండానే నీడలు, భయానక అరుపులు వినిపిస్తాయని అందరూ భావిస్తారు.
⦿కావోబావో రోడ్ సబ్‌వే స్టేషన్, చైనా
ఇది షాంఘై మెట్రో లైన్ 1, లైన్ 12 మధ్య ఉన్న ఇంటర్‌చేంజ్ స్టేషన్. మార్చురీ సమీపంలో నిర్మించిన ఈ స్టేషన్‌లో చాలా వింత వింత ఘటనలు జరిగాయని జనాలు నమ్ముతారు. ఈ రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు చాలా మంది భయపడతారు.
⦿వాటర్ ఫ్రంట్ స్టేషన్, కెనడా
ఈ రైల్వే స్టేషన్ అంతా దెయ్యాలతో నిండి ఉందని అందరూ నమ్ముతారు. అందుకే, ఈ రైల్వే స్టేషన్ లో ట్రైన్లు ఎక్కేందుకు ప్రయాణీకులు వణికిపోతారు.
⦿మాక్వేరీ ఫీల్డ్స్ రైలు స్టేషన్, ఆస్ట్రేలియా
ఇది సిడ్నీ శివారు మాక్వేరీ ఫీల్డ్స్ లో ఉంటుంది. రైళ్ల రాకపోకలు పూర్తయ్యాక, రాత్రిపూట ఏడుపులు, కేకలు తరచుగా వినిపిస్తాయని స్థానికులు భావిస్తారు. జూలై 1906లో ఎమిలీ హే జార్జ్‌సన్ అనే 42 ఏళ్ల మహిళ రైలు ఢీకొని చనిపోయింది. ఆ తర్వాత ఆమే దెయ్యమై తిరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
⦿అడిస్కోంబ్ రైల్వే స్టేషన్, ఇంగ్లాండ్
ఈ రైల్వే స్టేషన్ లో 1900లో రైలు పట్టాలపై ఓ లోకో పైలెట్ చంపబడ్డాయి. చాలా మంది ఆ చంపే వ్యక్తి అస్పష్టంగా కనిపించినట్లు చెప్పారు. అదో దయ్యం మాదిరిగా ఉన్నట్లు వెల్లడించారు. అప్పటి నుంచి ఈ స్టేషన్ భయంకరమైన స్టేషన్లలో ఒకటిగా పిలువబడుతోంది.
Read Also: అక్కడ అడుగు పెడితే ప్రాణాలు పోయినట్టే, దేశంలోనే భయంకరమైన ఘోస్ట్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసా?