Vijayasai Reddy On Ysrcp: ఎంపీ పదవికి రాజీనామా తర్వాత మీడియా ముందుకొచ్చిన విజయసాయిరెడ్డి ఏ ఒక్కర్నీ విమర్శించకుండా జాగ్రత్త పడ్డారు. వైసీపీగానీ, కూటమి ప్రభుత్వాన్నిగానీ టచ్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. దైవం సాక్షిగా తాను ముమ్మాటికీ నిజమే చెబుతున్నారని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
వ్యక్తి గత కారణాల వల్ల తాను0 పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు విజయసాయిరెడ్డి. తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించాను. దాన్ని ఆయన ఆమోదించారని తెలిపారు. రాజీనామా గురించి పలుమార్లు మీడియా గుచ్చిగుచ్చి అడిగినా పూర్తిగా వ్యక్తి గతమని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
న్యాయం చేయలేనని భావించి తప్పుకున్నట్లు చెప్పుకొచ్చారు వీఎస్ఆర్. తనకంటే ఎక్కువ శక్తి సామర్థాలున్న వ్యక్తి రాజ్యసభకు వస్తే ఇటు రాష్ట్రానికి.. అటు దేశానికి ఉపయోగపడతారని భావించి రాజీనామా చేశానన్నారు. ఢిల్లీలో శనివారం ఉదయం మీడియాతో మాట్లాడారాయ. తొలుత ఆయన చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పారు. ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
2019 ఎన్నికల్లో 151 సీట్లు వైసీపీ సాధించిందని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్ సాధించిందన్నారు. అత్యంత ప్రజాధరణ కలిగిన నేత జగన్ అని తెలిపారు. తనలాంటి వాళ్లు 1000 మంది వీడినా ఆ పార్టీకి ఎలాంటి ఢోకా లేదన్నారు.
రాజకీయాల నుంచి తాను తప్పుకుంటే బలహీనుడ్ని అవుతానని, బలవంతుడ్ని కాలేనన్నారు వీఎస్ఆర్. తన రాజీనామా వల్ల కూటమికి సహాయపడుతుందే గానీ, వైసీపీ లబ్ది పొందదని తెలిపారు. ఆ సీటు తరపున ఎవరిని పెద్దల సభకు పంపాలనేది కూటమి నేతల ఇష్టమన్నారు. తాను ఎలాంటి పదవులు, కేసులు మాఫీ చేస్తారని ఆశించి రాజీనామా చేయలేదన్నారు.
ALSO READ: వాళ్లను దేశం నుంచి తరిమేయండి.. విజయ సాయి కొత్త అవతారం
లండన్‌లో ఉన్న జగన్‌తో తాను మాట్లాడి అన్ని విషయాలు వివరించానని తెలిపారు. ఆపై తన నిర్ణయాన్ని వెల్లడించినట్టు తెలిపారు. భవిష్యత్‌లో ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత దాని గురించి మాట్లాడడం సమంజసం కాదన్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక ప్రాథమిక సభ్యత్వం ఎలా ఉంటుందన్నారు.
గతంలో టీడీపీ నుంచి చాలామంది ఎంపీలు బీజేపీలోకి వెళ్లారని, ఇప్పుడు వైసీపీ నుంచి అదే ఒరవడి కొనసాగుతుందన్న ప్రశ్నకు రిప్లై ఇచ్చేశారు వీఎస్ఆర్. రాజకీయ జీవితంలో తాను ఏనాడూ అబద్దాలు చెప్పలేదన్నారు. మూడు తరాలుగా జగన్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. ఆ కుటుంబంతో ఏ రోజూ విభేదాలు లేవు, ఇంతవరకు రాలేదు.. భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదన్నారు.
అక్రమాస్తుల కేసుల విషయంలో అప్రూవర్ కావాలని ఒత్తిడి చేశారని, అందుకు తాను నిరాకరించానన్నారు మాజీ ఎంపీ. కూటమి అధికారంలోకి వచ్చిన నమోదైన కేసుల గురించి మాట్లాడారు. కాకినాడ సీ పోర్టు కేసు గురించి నోరు విప్పారు. తనపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారని, ఏ-2గా చేశారన్నారు. సీఐడీ తనను పిలవలేదని, ఈడీ ముందుకెళ్లి చెప్పాల్సినవన్నీ చెప్పానన్నారు.
కేవీరావుతో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పని ఈడీ ముందు చెప్పానన్నారు. విక్రాంత్ రెడ్డి చిన్న పిల్లవాడని, తనకంటే ఎక్కువ పరిచయాలు ఆయనకు ఉన్నాయన్నారు. ఆయనను కేవీరావు పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. ఎందులోనూ భాగస్వామిని కాదన్నారు.
కాకినాడ సీ పోర్టుకు-తన రాజీనామాకు లింక్ పెట్టడంపైనా మాట్లాడారు. తన వియ్యంకుడితో వ్యాపారాల గురించి ఏనాడు చర్చించలేదన్నారు. వాళ్లకు ఎన్ని ఫార్మా యూనిట్ ఉన్నాయన్న విషయం తెలీదన్నారు. వాటి గురించి తెలుసుకో దలచుకోలేదన్నారు. దయచేసి వార్తలను వార్తలుగానే ప్రసారం చేయాలని మీడియాకు రిక్వెస్ట్ చేశారు.