BigTV English

Amazon: అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే.. ఫ్రీగా షాక్ ఇచ్చే గిఫ్ట్‌ కూడా వచ్చింది

Amazon: అమెజాన్‌లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే.. ఫ్రీగా షాక్ ఇచ్చే గిఫ్ట్‌ కూడా వచ్చింది

Amazon: షాపింగ్ చేయాలంటే ప్రస్తుతం బయటకు వెళ్లి షాపుల్లో షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో చాలా రకాలుగా షాపింగ్ చేసుకునే సదుపాయాలు నేడు అందుబాటులో ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా లేక ఈ కామర్స్ వెబ్ సైట్ల ద్వారా షాపింగ్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు నచ్చిన షాపింగ్ చేసినా కూడా చాలాసార్లు నిరాశే మిగులుతుంది. ఎందుకంటే మనం అనుకున్న దానికంటే చాలా వరకు లో క్వాలిటీ దుస్తులు వస్తుంటాయి.


దుస్తులే కాదు చిన్న వస్తువు నుంచి ఇళ్లును కూడా ఆన్ లైన్ లో కొనుగోలు చేసే సదుపాయాలు ఉన్న ఈ కాలంలో జనాలు వారి వీలును బట్టి షాపింగ్ చేస్తుంటారు. అయితే వస్తువులను కొనుగోలు చేసే క్రమంలో చాలా రకాలుగా ఇబ్బందులను ఎుదర్కొంటుంటారు. ఆ వస్తువులు సరైనవి రాకపోవడం, లేక ఆ వస్తువులతో పాటు ఏదో ఒక విధమైన వస్తువు ఆర్డర్ వస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఓ మహిళకు ఇలాగే ఓ చేదు అనుభవం ఎదురైంది. అమెజాన్ లో ఎయిర్ ఫ్రైయర్ ఆర్డర్ పెడితే దానికి తోడుగా ఓ షాకింగ్ వస్తువు కూడా రావడంతో ఒక్కసారిగా ఆ మహిళ ఆశ్చర్యపోయింది. దీనికి సంబంధించిన సంఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది.

ఈ ఘటన కొలంబియాలో వెలుగుచూసింది. సోఫియా సెరానో అనే యువతి వంటింట్లోకి ఎయిర్ ఫ్రైయర్‌ను ఆర్డర్ చేసింది. అయితే దీనిని అమెజాన్ లో ఆర్డర్ చేసింది. ఆన్ లైన్ డెలివరీ ఇచ్చే క్రమంలో ఎయిర్ ఫ్రైయర్ ఇంటికి రాగానే సోఫియా దానిని ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. ఒక్కసారిగా పార్శిల్ ఓపెన్ చేయగా అందులో ఎయిర్ ఫ్రైయర్ తో పాటు వింతగా మరో వస్తువు కూడా వచ్చింది. దానిని చూడగా అందువలో బల్లి ఉండడంతో మహిళ కంగుతింది. అయితే ఆ బల్లి స్పానిష్ రాక్ బల్లిగా గుర్తించింది. అయితే ఇలా రావడానికి గల కారణం తనకు తెలియలేదని ఇది ఎవరి తప్పిదం అయినా కూడా ఇలాంటివి రావడం నిజంగా భయాందోళనకు గురిచేస్తుందని మహిళ పేర్కొంది.


Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×