E-Paper
Advertisement

Shocking Video: నాగుపాము ముందు కేక్ కట్టింగ్ చేసిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు

Shocking Video: నాగుపాము ముందు కేక్ కట్టింగ్ చేసిన ఆకతాయిలు.. మండిపడుతున్న నెటిజన్లు
Advertisement

Shocking Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు కొంత మంది ఆకతాయిలు మూగ జీవులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి వీడియోలు తరచూ నెట్టింట వెలుగుచూస్తున్నా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా పెరిగిపోతున్నాయి. హిందూ సంప్రదాయాల ప్రకారం నాగు పాములను దేవుడిగా పూజిస్తారు. శివుడి మెడలో అలంకారంగా ఉండే పాములను పూజించడం హిందువుల సంప్రదాయం. ఈ తరుణంలో ప్రతీ ఏడాది శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి నాడు పాములను పూజిస్తుంటారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో పాముకు పాలు పోసి, పూలు, పండ్లు వివిధ రకాలుగా పూజిస్తుంటారు. అయితే ఈ ఏడాది శుక్ల పక్ష పంచమి తిథి నాడు వచ్చిన నాగుల పంచమి నాడు నాగ దేవతకు భక్తులు ఘనంగా పూజలు చేశారు. శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ తరుణంలో కొంత మంది ఆకతాయిలు చేసిన పని నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీడియోలో కొంత మంది యువకులు నాగు పాము పుట్టిన రోజు అంటూ నాగు పాము ముందే కేక్ కట్టింగ్ చేయించారు. ఈ తరుణంలో ఓ అడవి లాంటి ప్రాంతంలో ఈ ఘటన వెలుగుచూసింది. ఏకంగా పదుల సంఖ్యలో ఉన్న యువకులు పాము ముందు ఓ కేక్ పెట్టారు. దానిని కట్ చేసి దానికి తినిపించేందుకు కూడా ప్రయత్నించారు.

Advertisement

నాగుల పంచమి నాడు ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజలు చేయాల్సింది పోయి, ఇలాంటి చేష్టలకు పాల్పడడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్ బుక్ లో అప్లోడ్ చేయడంతో మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×