BigTV English

Video Viral: రీల్స్ చేయడానికి కారులో వచ్చి నడిరోడ్డుపై ఆగి యువతి రచ్చరచ్చ.. చివరికీ ఊహించని ట్విస్ట్

Video Viral: రీల్స్ చేయడానికి కారులో వచ్చి నడిరోడ్డుపై ఆగి యువతి రచ్చరచ్చ.. చివరికీ ఊహించని ట్విస్ట్

Video Viral: సోషల్ మీడియా ప్రభావం యువతపై దారుణంగా చూపుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు వీడియోలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోసల్ మీడియా ప్లాట్ ఫాంలను ఉపయోగించి తరచూ వీడియోలు చేస్తున్నారు. కేవలం సరదా కోసం మాత్రమే కాకుండా సంపాదన కోసం కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగాలు మానుకుని మరి యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నారు. ఇలా ఎంతో మంది జీవనోపాది కోసం మరియు పేరు సంపాదించుకోవడానికి సోషల్ మీడియాను వాడుకుంటున్నారు.


సోషల్ మీడియాలో వీడియోలు చేసేందుకు ప్రమాదాలను కూడా లెక్కచేయడం లేదు. ప్రాణాలకు తెగించి మరి వీడియోలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చాలా మంది ప్రకృతిని ఆస్వాదిస్తూ, వర్షంలో తడుస్తూ వీడియోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలా చేసిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇలా సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం, లేదా వారి ప్రాణాలకే ప్రమాదాలను తెచ్చుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలా తాజాగా ఓ యువతి ఏకంగా నడిరోడ్డుపై డ్యాన్స్ చేస్తూ దర్శనమిచ్చింది.

వర్షాకాలం కావడంతో రోడ్లపై ట్రాఫిక్ మరియు రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి ఓ యువతి ఏకంగా రోడ్డుపై డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో వీడియోలో పోస్ట్ చేయాలని ప్రయత్నించిన యువతి కారులో వచ్చి ఓ చోట రోడ్డుపై ఆగింది. వెంటనే కారులో నుంచి కిందకు దిగా డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. ఇలా రోడ్డుకు ఓ పక్కన కూడా కాకుండా రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇలా చేస్తుండగా రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ఆ యువతిని చూస్తూ వెళ్లారు.


దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో యువతి పోస్ట్ చేసింది. ఈ మేరకు ఇలా పోస్ట్ చేసిన వీడియోపై యూపీ పోలీసులు రియాక్ట్ అయ్యారు. దీంతో ఆ యువతికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై నోటీసులు మాత్రమే కాదు సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అసలు ఇలాంటి వీడియోలు చేయడం కోసం రోడ్లపై ప్రదర్శనలు ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

 

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×