E-Paper
Advertisement

Viral Video: విషమని చెత్తలో పారేసిన.. స్వీట్స్ కోసం ఎగబడ్డ జనం.. ఇలా ఉన్నారేంట్రా!

Viral Video: విషమని చెత్తలో పారేసిన.. స్వీట్స్ కోసం ఎగబడ్డ జనం.. ఇలా ఉన్నారేంట్రా!
Advertisement

Viral Video: ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ లో జరిగిన ఓ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట తీవ్ర చర్చకు దారితీశాయి. చెత్తలో పారేసిన విషపూరిత స్వీట్స్ లేదా మిఠాయిల కోసం ప్రజల ఎగబడిన దృశ్యాలు షాక్ కు గురిచేస్తున్నాయి. డస్ట్ బిన్ నుంచి ఏరుకొని మరి ప్రజలు పట్టుకెళ్లడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఫ్రీగా వస్తే విషాన్ని సైతం వదలరా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగిందంటే?

యూపీలోని హాపూర్ ప్రాంతంలో గల ఓ స్వీట్స్ షాపుపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. కల్తీ జరిగిన, ఎక్స్ పైరీ అయిన స్వీట్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అనంతరం వాటిని షాపు నుంచి తీసుకొచ్చి.. బయట ఉన్న చెత్తలో అధికారులు పారేశారు. స్వీట్స్  నమూనాలను ల్యాబ్ కు పంపి పరీక్షించగా.. అవి తినడానికి ఏ మాత్రం సురక్షితం కాదని రిపోర్ట్ వచ్చిందని ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ ధ్రువీకరించారు. ఫుడ్ ఇన్స్ స్పెక్టర్లు ఆర్.పి. గుప్తా, సహరీష్ సుదాత్ గురువారం (ఫిబ్రవరి 26) ఈ దాడులు జరిపినట్లు స్పష్టం చేశారు.

Advertisement

స్వీట్స్ కోసం ఎగబడ్డ జనం..

షాపులో సీజ్ చేసిన స్వీట్స్ ను బయట చెత్తలో పారేయడాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే.. చెత్తబుట్టలోని స్వీట్స్ ను నవ్వుకుంటూ తీసుకెళ్లారు. అవి విషపూరితమని, తింటే అనారోగ్యానికి గురికావడం ఖాయమని తెలిసినప్పటికీ వారు ఇంటికి పట్టుకెళ్లారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. మరీ ఇంత కక్కుర్తిలో ఉన్నారేంట్రా? అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పాడైన పుడ్ ను అలా జనాలకు కనిపించేలా అధికారులు పడేయడాన్ని కూడా తప్పుబడుతున్నారు.

Advertisement

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఆర్ అండ్ బీ కార్యాలయంపై అధికారుల కొరడా..!

చర్యలకు ఆదేశించిన ఉన్నతాధికారి

వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంపై ఫుడ్ సేఫ్టీ అసిస్టెంట్ కమిషనర్ సునీల్ కుమార్ స్పందించారు. వాస్తవానికి దాడుల సమయంలో స్వాధీనం చేసుకున్న అసురక్షితం లేదా కల్తీ ఆహారాన్ని ప్రోటోకాల్ ప్రకారం గోతి తీసి అందులో పాతిపెడతామని తెలిపారు. తద్వారా మనుషులతో పాటు వీధి కుక్కలు, జంతువులు వాటిని తినకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ దాడులు జరిపిన అధికారులు స్వీట్లను చెత్తలో పారేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు పేర్కొన్నారు. దీనిపై సదరు అధికారుల నుంచి వివరణ సైతం కోరినట్లు చెప్పారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: Nagar Kurnool: నాగార్‌కర్నూల్‌లో ఘోరం.. నీటి తొట్టిలో 3 నెలల పసికందు అనుమానాస్పద మృతి..

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×