BigTV English

Pet Pit Bull Kills Baby: 7 నెలల చిన్నారిని చంపిన పెంపుడు కుక్క, అయ్యో పాపం!

Pet Pit Bull Kills Baby: 7 నెలల చిన్నారిని చంపిన పెంపుడు కుక్క, అయ్యో పాపం!

పెంపుడు జంతువులు కుటుంబ సభ్యులతో ఎంతో కలివిడిగా ఉంటాయి. వచ్చి మీద కూర్చుంటాయి. పక్కనే పడుకుంటాయి. బయటకు వెళ్లి రాగానే ప్రేమగా మీదికి ఎగురుతాయి. పిల్లులతో పోల్చితే కుక్కలో ఎంతో ప్రేమ చూపిస్తాయి. కానీ, అవే కుక్కలు తిరగబడితే? మనుషుల ప్రాణాలను తీసేందుకు వెనుకాడవు. తాజాగా అమెరికాలో ఇదే జరిగింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క 7 నెలల చిన్నారిపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై అమెరికా పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?  

అమెరికా ఒహియోలోని కొలంబస్‌ లో మెకెంజీ కోప్లీ,  కెమెరాన్ టర్నర్ దంపతులు నివాసం ఉంటున్నారు. సౌత్ ఛాంపియన్ అవెన్యూలోని 3700 బ్లాక్‌ లో వాళ్ల ఇల్లు ఉంది. వారికి 7 నెలల ఎలిజా టర్నర్ అనే చిన్నారి ఉంది. వాళ్ల ఇంట్లో మూడు పెట్ డాగ్ లు కూడా ఉన్నాయి. వాటిలో ఓ పిట్ బుల్ కూడా ఉంది. రోజూ తన ఇంట్లోని కుక్కలతో చిన్నారి ఆడుకునేది. అవి కూడా ఆమెతో ఎంతో ప్రేమగా ఉండేవి. కానీ, తాజాగా ఏం జరిగిందో తెలియదు, పిట్ బుల్ చిన్నారిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఆ పాప చనిపోయింది. చిన్నారని మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొలంబస్ పోలీసులు.. మూడు కుక్కలను అదపులోకి తీసుకున్నారు.


దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తల్లిందండ్రులు

రోజూ తన పాపతో ఆడుకునే పెంపుడు జంతువు ప్రాణాలు తీయడంపై చిన్నారి తల్లిదండ్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నాకు ఎందుకో అస్సలు అర్థంకావడం లేదు. పాప ఎలిజా టర్నర్ కుక్కలతో ఎంతో ప్రేమగా ఆడుకునేది. వాటిని కౌగిలించుకునేది. వాటితో కలిసి నవ్వుకునేది. నా బిడ్డ పక్కన రోజూ తిరిగే కుక్క ఈ ఘోరానికి పాల్పడ్డాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఎంతగా ఆలోచించినా అర్థం కావడం లేదు” అని చిన్నారని తల్లి మెకెంజీ కోప్లీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా చంపిన కుక్కతో కలిసి తన కూతురు ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చిన్నారి తండ్రి కామెరాన్ టర్నర్ కూడా కన్నీటి పర్యంతం అయ్యాడు. “నా జీవితంలో తీరని అన్యాయం జరిగింది. పాప లేకుండా ఎలా జీవించాలో అర్థం కావడం లేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అటు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తారు.  కొలంబస్ పోలీస్ సార్జెంట్ జేమ్స్ ఫుక్వా ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది. “ఎలిజాను వాళ్ల పెట్ డాగ్ కరిచింది. ఈ ఘటనలో పాప చనిపోయింది. మేం కూడా ఈ ఘటనపై చాలా బాధపడుతున్నాం. మాకు ఈ ఘటన గురించి మాట్లాడేందుకు మాటలు రావడం లేదు. చిన్నారని ప్రతి ఒక్కరు తమ చిన్నారిగా బావిస్తున్నారు. ఎలిజా ఇంట్లోని మూడు కుక్కలను ఫ్రాంక్లిన్ కౌంటీ యానిమల్ కంట్రోల్ అదుపులోకి తీసుకుంది. సమగ్ర దర్యాప్తు పూర్తయిన తర్వాత వాటిని ఏం చేయాలనేది నిర్ణయిస్తాం” అని వెల్లడించారు.

Read Also: వీధి కుక్కలపై అత్యాచారం.. మనిషివా? పశువువా? రా అయ్యా!

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×