Nani : టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా, నిధి శెట్టి హీరోయిన్ గా రాబోతున్న సినిమా హిట్ 3( థర్డ్ కేస్) శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హిట్ సిరీస్ లో వస్తున్న మూడో సినిమా ఇది. హిట్ ఫస్ట్ కేసులో విశ్వక్ సెన్ హీరోగా నటించారు. హిట్ రెండవ కేసులో అడవి శేషు హీరోగా నటించారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నానినే నిర్మాతగా వ్యవహరిస్తూ తానే హీరోగా నటిస్తున్నాడు. మొదటి రెండు భాగాల కంటే హిట్3లో యాక్షన్ వైలెంట్ ఎక్కువగా ఉంటుందని మితిమీరిన హింస, రక్తపాతం ఎక్కువగా కనిపిస్తుందని మనకి టీజర్ ద్వారా అర్థమవుతుంది. మొదటి రెండు భాగాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. అర్జున్ సర్కార్ కి జాలీ దయ లేని పోలీస్ ఆఫీసర్ గా నాని ఈ సినిమాలో కనిపిస్తారు. ఇక ఈ మూడో భాగం మే 1న రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీం. అందులో భాగంగా సెన్సార్ కూడా పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఒకే సంవత్సరం రెండు సినిమాలను నిర్మిస్తున్న వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు చూద్దాం..
ఆ సినిమా కన్నా పెద్ద హిట్ ..
ఈ సంవత్సరం నానికి బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. వాల్ పోస్టర్ బ్యానర్ పై తాజాగా హిట్ అందుకున్న నాని, ఈ సినిమాతో మరోసారి ముందుకు రానున్నారు. తాజాగా కోర్టు మూవీతో, బ్లాక్ బస్టర్ అందుకున్నరు. మంచి సినిమాలకి ప్రేక్షక ఆదరణ ఎప్పుడు ఉంటుందని నిరూపించిన మూవీ కోర్టు. చిన్న సినిమాగా మన ముందుకు వచ్చి ఊహించని స్థాయిలో కోట్లు కొల్లగొట్టి, ప్రొడ్యూసర్ కి లాభాల బాట వేసిన సినిమా. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయి బాక్సాఫీస్ వద్ద 66 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ సినిమా తరువాత నాని వాల్ పోస్టర్ నుండి వస్తున్న సినిమా కావడంతో హిట్ 3పై భారీగా అంచనాలె ఉన్నాయి.దాదాపు ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్ తో మన ముందుకు రానుంది. ఈ సినిమా కాస్త పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నానికి మంచి లాభాలే వస్తాయి. ఇక కోర్టు సినిమా కన్నా ఈ సినిమా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుందంటున్నారు అభిమానులు. నాచురల్ స్టార్ నాని వైల్డ్ యాక్టర్ గా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం .
అప్పుడు ఆలా ఇప్పుడు ఇలా ..
ఇక సినిమాల పరంగా చూస్తే నాని సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మొదటి సినిమా అష్టాచమ్మా, భలే భలే మగాడివోయ్, జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర అయ్యాడు. ఆ తర్వాత కాస్త జోనర్ మార్చాడు మాస్ ఎలిమెంట్స్ తో యాక్షన్ సినిమాలను తీయడం మొదలుపెట్టాడు. దసరా,సరిపోదా శనివారం సినిమాతో యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఇక ఇప్పుడు తాజాగా హిట్ 3 చిత్రంలో వెలెంట్ పోలీసు ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు.వేసవి కానుకగా ఈ సినిమా మే 1తేదీన వరల్డ్ వైస్ గా రిలీజ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు అభిమానులు.
Kesari Chapter 2 First Review : కేసరి చాప్టర్ 2పై రానా ఫస్ట్ రివ్యూ… హిస్టరీ క్రియేట్ అంటూ.