BigTV English

Mass Jathara Teaser : మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఈ సారి చాలా వైల్డ్‌గానే రియాక్ట్ అయ్యాడు

Mass Jathara Teaser : మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఈ సారి చాలా వైల్డ్‌గానే రియాక్ట్ అయ్యాడు

Mass Jathara Teaser :మాస్ మహారాజా రవితేజ (Raviteja ), భాను భోగవరపు (Bhanu bhogavarapu) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మాస్ జాతర. యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) మరోసారి రవితేజ తో నటిస్తోంది. ‘ధమాకా’ కాంబో రిపీట్ కాబోతుండడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆగస్టు 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 1:36 నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? సినిమాపై హైప్ క్రియేట్ చేసిందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ఆకట్టుకుంటున్న మాస్ జాతర టీజర్..

మాస్ జాతర సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఈయన లుక్ విక్రమార్కుడు సినిమాను గుర్తు చేసింది అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇందులో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. “వాడి డిపార్ట్మెంట్లో తప్ప ప్రతి డిపార్ట్మెంట్లో వేలు పెడుతుంటాడు” అనే డైలాగ్ తో టీజర్ ఆకట్టుకుంది. ఇక శ్రీ లీల అమాయకపు పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయింది. ఇక శ్రీ లీల, రవితేజ రొమాంటిక్ పర్ఫామెన్స్ మరొకసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ మరొకసారి తన యాక్షన్ పర్ఫామెన్స్ తో విధ్వంసం సృష్టించబోతున్నారని టీజర్ లోనే చూపించేశారు. అటు చమ్మక్ చంద్ర తో పాటు పలువురు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మొత్తానికైతే టీజర్ ప్రేక్షకులను ఇప్పుడు ఆకట్టుకుంటుంది.


రవితేజ తదుపరి చిత్రాలు..

గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ‘మాస్ జాతర’ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమా తర్వాత.. కిషోర్ తిరుమల (Kishore Tirumala).దర్శకత్వంలో #RT76 వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రకటించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే జూలై 16న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. దీనికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్లుగా మమిత బైజు, ఆషిక రంగనాథ్, కేతికా శర్మ, కాయాదు లోహర్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ నలుగురిలో ఇద్దరినీ ఫైనలైజ్ చేయబోతున్నారని, ఈసారి రవితేజ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయనున్నట్లు సమాచారం. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న మాస్ జాతరతో హిట్టు కొట్టి, ఆ తర్వాత ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు రవితేజ.

also read:Upasana: క్లీంకారా డైలీ ఫుడ్ అదే.. లేకుంటే అంతే సంగతి అంటూ!

Related News

Chiranjeevi Vs Balakrishna: మరోసారి బయటపడ్డ మెగా నందమూరి విభేదాలు.. అసలు గొడవ అక్కడేనా?

OG Title: OG.. టైటిల్ ని ఆ నిర్మాత గిఫ్ట్ ఇచ్చారు.. అసలు నిజం చెప్పేసిన దానయ్య

OG Film: పవన్ అభిమానులకు బిగ్ షాక్… హెచ్డీ ప్రింట్ లీక్!

Pawan Kalyan: ఓజీ చూడాలంటే ఇది తప్పనిసరి… పవన్ ఫ్యాన్స్ కి ప్రసాద్ మల్టీప్లెక్స్ కండిషన్

Chiranjeevi: అసెంబ్లీలో బాలయ్య వ్యంగ్య కామెంట్స్‌పై చిరంజీవి స్పందన.. కీలక ప్రకటనతో..

Shah Rukh Khan: కొడుకు చేసిన పనికి షారుక్‌కి భారీ మూల్యం.. రూ. 2 కోట్లు పరువు నష్టం దావా!

OG Success Meet : థమన్ బాం*చ*త్ అన్నాడు… సక్సెస్‌మీట్‌లో నిర్మాత కామెంట్

Sujeeth: రాజమౌళికి పోటీగా సుజీత్… అంతా పవన్ వల్లే

Big Stories

×