Upasana Konidela : ఇండస్ట్రీలో మోస్ట్ లవ్లీ కపుల్ అంటే రామ్ చరణ్ ఉపాసన అనే పేరు అందరికీ గుర్తుకు వస్తుంది. పెళ్లయిన నాటినుండి ఇప్పటివరకు ఎటువంటి విభేదాలు రాకుండా ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతున్న ఈ జంట పై అభిమానులు ఎప్పుడు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకునే జంటలు ఈమధ్య చివరి వరకు కలిసి ఉండడం లేదు. మనస్పర్ధలు కారణంగా ఎంతోమంది విడాకులు తీసుకుంటున్నారు. కానీ వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సినిమాల్లో ఎన్నో టెస్టులు దాటి హీరోగా నిలిచే రామ్ చరణ్… రియల్ లైఫ్ లోనూ ఓ లవ్ టెస్టులో నెగ్గాడు. ఆ లవ్ టెస్టు పెట్టింది ఎవరో కాదు ఉపాసనే. వీళ్లు డేటింగ్ లో ఉన్న రోజుల్లో రామ్ చరణ్ కు పెట్టిన లవ్ టెస్టు గురించి ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ కు లవ్ టెస్ట్..
ఉపాసన ఎప్పుడూ ఏదో ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తుంది. తన ప్రొఫెషనల్ లైఫ్ గురించి క్లింకార గురించి మాత్రమే కాదు.. రామ్ చరణ్ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా కర్లీ టేల్స్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తన లవ్ టెస్టులో ఎలా పాస్ అయ్యాడో ఉపాసన వెల్లడించింది. ఉపాసన మాట్లాడుతూ.. మేము డేటింగ్ లో ఉన్న సమయంలో ఆమె ఓల్డ్ సిటీ దగ్గర ఉన్నట్లు తెలిపింది. నీకు నా మీద నిజంగా ప్రేమ ఉంటే నన్ను ఫేమస్ ఐస్ క్రీం షాప్ కి తీసుకెళ్ళాలి’ అని అడిగా. ఆ సమయంలో ఫేమస్ ఐస్ క్రీం మార్కెట్ మధ్యలో ఉండేది.. అప్పటికే అతను హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. జనాల మధ్యలోకి వెళ్తే గుర్తుపడతారని ఆర్డర్ చేశాడు. ఆ టెస్టులో రామ్ చరణ్ పాస్ అయ్యాడు అని ఉపాసన చెప్పింది. నాకోసం ఇలా చేయడం చాలా సంతోషంగా అనిపించిందని ఉపాసన అన్నది.. తన భర్త గురించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.
Also Read : రిలీజ్ కు ముందే ‘కూలీ ‘ హిట్.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే..?
రామ్ చరణ్ సినిమాలు..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఆ మూవీ తో విదేశాల్లో కూడా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన చేస్తున్న మూవీలపై జనాల్లో ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఎన్నో అంచనాల తో రిలీజ్ అయిన ఈ మూవీ అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం పెద్ది అనే సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను అలరించాయి.. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..